dasyam vinaybhaskar
-
వరంగల్ పశ్చిమలోని ’కీ‘.. త్రీ..
సాక్షి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంది. టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి 21 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా పోటీ ముగ్గురు మధ్యనే ఉంది. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ప్రజా కూటమి నుంచి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పోటీలో ఉన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి గతంలో నర్సంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ధర్మారావు బీజేపీ అభ్యర్థిగా హన్మకొండ నియోజకవర్గం నుంచి 1999లో గెలిచారు. గత ఎన్నికల సందర్భంగా ఉద్యమ ప్రభావం ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దీంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. దాస్యం వినయ్‌భాస్కర్ (టీఆర్ఎస్) బలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిత్యం ప్రజల మధ్య ఉండడం, ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం ఆంధ్ర పార్టీగా టీడీపీకి ముద్ర... కూటమి నుంచి ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉండడం మంత్రి కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి చేసిన అభివృద్ధి పనులు కార్మిక సంఘాలు, చిరు వ్యాపారులతో ఉన్న అనుబంధం మాజీ మంత్రి, సోదరుడు ప్రణయ్‌భాస్కర్‌పై ఉన్న అభిమానం అభ్యర్థిగా ముందుగా ప్రకటించడం, ముందు నుంచి ప్రచారంలో ఉండడం బలహీనతలు టీఆర్ఎస్ ప్రభత్వంపై, తాజా మాజీ ఎమ్మెల్యేగా వ్యతిరేకత భూ కబ్జాదారునిగా ప్రచారం కావడం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, కమీషన్ల కోసం అభివృద్ధి పనులు ఆపారని అపవాదు కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ స్థల సేకరణను పట్టించుకోవడం లేదనే ఆరోపణ నియోజకవర్గానికి ఆశించిన మేర ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కాకపోవడం రేవూరి ప్రకాష్‌రెడ్డి (టీడీపీ) బలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, తాజా మాజీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రజా కూటమిగా ఏర్పాటు కావడం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ వివాద రహితుడు కావడం, వ్యక్తిగతంగా అతనికున్న ఇమేజ్, పార్టీ మారకుండా నిబద్ధతతో ఉండడం. గతంలో నర్సంపేటలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులతో ఉన్న మంచితనం కాంగ్రెస్ నుంచి పోటీపడిన నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు ప్రజా కూటమిలో అన్ని పక్షాలు కలిసిరావడం మేధావి వర్గంలో సానుకూల దృక్పథం బలహీనతలు ఆంధ్ర పార్టీగా టీడీపీకి ఉన్న ముద్ర స్థానికుడు కాదనే ప్రచారం కూటమిలోని పార్టీల ఓట్ల బదిలీపై సందిగ్ధం టీడీపీకి గట్టి పునాదులు లేకపోవడం, ఇతర పార్టీలపై ఆధారపడడం. ఆలస్యంగా టికెట్ కేటాయించడం, ప్రచారం ఆలస్యం కావడం మార్తినేని ధర్మారావు (బీజేపీ) బలాలు ప్రభుత్వం, గత ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, ప్రజా కూటమి నుంచి ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టీడీపీ అభ్యర్థి ఉండడం గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి సుపరిచితుడు కావడం వరంగల్ నగరానికి కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాల ద్వారా రూ.కోట్లలో నిధులు తీసుకురావడం వివాద రహితుడు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఆదరణ గతంలో చేసిన అభివృద్ధి పనులు బలహీనతలు బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు నియోజకవర్గంలో బీజేపీకి పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడం ప్రచారం ఆలస్యం కావడం ఎన్నికల తర్వాత ప్రజల్లో లేకపోవడం -
కొండా మురళికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్
సాక్షి, వరంగల్ అర్బన్ : కేసీఆర్ సర్వేలో అనుకూల ఫలితాలు రానందునే టీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖకి టికెట్ నిరాకరించిందని వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాజకీయంగా బీభత్సమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటున్న కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. మురళి ఏకగ్రీవంగా ఎన్నికైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయంలో ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడిన కొండా దంపతులు ప్రజలు, కార్యకర్తలు, మైనారిటీలను దూరం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. వారి భూ కబ్జాలకు హన్మకొండలోని రామ్‌నగర్‌లో ఉన్న భవనమే సాక్షి అని విజయ్‌భాస్కర్ ఆరోపించారు. ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేదు కనుకనే రాష్ట్రంలో లేని పార్టీలు పిలిచాయని చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అత్యన్నత పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. అవినీతి చరిత్ర కలిగిన కొండా దంపతులు ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మీవెంట ఒక్క కార్పొరేటర్ అయినా ఉన్నాడా..! అధికారం ఉన్నంతకాలం పార్టీని వాడుకుని ఇవాళ కేసీఆర్, కేటీఆర్ పట్ల కొండా దంపతులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎంపీ పసునూరి దయాకర్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని ఏ ఒక్క కార్పొరేటర్ కూడా కొండా దంపతులకు తోడుగా లేరంటేనే వారి నైజం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌పై కూడా వారు విమర్శలు చేయడం దారుణమన్నారు. తమ సమస్యలు తీర్చాలని ఇంటికొచ్చిన ప్రజలతో కాళ్లు మొక్కించుకునే నియంతృత్వం కొండా దంపతులదని దయాకర్ నిప్పులు చెరిగారు. కాగా.. అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
భారతావనికే ఆదర్శం కాకతీయుల పాలన
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : కాకతీయుల పాలన యావత్ భారతదేశానికే ఆద ర్శం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాకతీ య ఉత్సవాలు ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. కాకతీయ ముగింపు ఉత్సవా ల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు వేయిస్తంభాల గుడి లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం. కళా సాహిత్య రంగాల అభివృద్ధికి కాకతీయులు చేసిన సేవలు భావితరాలకు మార్గదర్శకం కావడానికి ఈ ఉత్సవాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. తెలంగాణ పునఃర్నిర్మాణంలో కవులు, కళాకారులు, మేధావులు సహకరించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. విషిష్ట అతిథిగా హాజరైన ఎంపీ రాజయ్య మాట్లాడుతూ కాకతీయుల పాలన స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. తన నిధుల నుంచి వరంగల్ కోట అభివృద్ధికి రూ.5 కోట్లు, రామప్ప పరిరక్షణకు రూ.5.80 కోట్లు, గణపురం కోటగుళ్లకు రూ.3.50 కోట్లు, పాండవుల గుట్ట కు రూ.1.50కోట్లు, చేర్యాల, పెంబర్తి హస్త కళాకారుల అభివృ ద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించానని తెలిపారు. చట్టసభల్లో మన వాటాకోసం పోరాడి సాధించుకుందామని అన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాల కోసం నిర్వహించిన రివ్యూలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు ముందు రూ.300కోట్లు విడుదల చేయాలని కోరితే గుడ్డి, చెవిటి చేతకాని సీమాంధ్ర ప్రభుత్వం ముష్టి రూ.30లక్షల ఇచ్చిందని విమర్శించారు. శ్రీకృష్ణ దేవరాయుల ఉత్సవాల కోసం రూ.300కోట్లు కేటాయించి, తపాల బిళ్ల సైతం విడుదల చేసిన సర్కారు కాకతీయ ఉత్సవాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని చెప్పారు. కార్యక్రమంలో వేయిస్తంభాల ఆల య ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ప్రముఖ నవ లా రచయిత అంపశయ్య నవీన్, ఏపీఆర్ఓ శ్రీనివాస్, పులి రజినీకాంత్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొనగా వ్యాఖ్యాతగా వల్స పైడి వ్యవహరించారు. శిల్ప కళావైభవం అద్భుతం ఖిలావరంగల్ : కాకతీయుల శిల్ప కళావైభవం అద్భుతమని మంత్రి బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. శనివారం ఖిలావరంగల్ మధ్యకోటలో జరిగిన కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి సముచిత స్థానం కల్పిస్తున్నామని, కాకతీయులు నాడే రాణి రుద్రమదేవికి రాజ్యాధికారం అప్పగించి మహిళలకు పెద్ద పీట వేశారని చెప్పారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ వరంగల్ ఘన కీర్తిని ఢిల్లీలో చెప్పుకుంటారని అన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశామన్నారు. తెలంగా ణ ప్రాంత రాజకీయ నాయకులు కలిసి కట్టుగా ముందు సాగి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలకు నిధుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపించిందని, ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటైన తర్వాత వరంగల్కోట సమగ్ర అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. జెడ్పీ సీఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు కాకతీయులు కట్టడానికి వినియోగించిన టెక్నాలజీని గమనించి వారి తీపిగురుతుగా గుర్తుంచుకోవాలన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాకతీయులు గొప్ప కళాకారులు, శిల్పులని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మాజీ కౌన్సిలర్ సిరబోయిన కృష్ణ, బిల్లశ్రీకాంత్, యాకయ్య, జీవన్‌గౌడ్, గైడ్స్ రవియాదవ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.