Date with the Wild and Beautiful
-
వైల్డ్ ఇన్ డిజైన్స్
‘వన’వీధిలో విహరించే వన్యప్రాణుల శైలి ఆటవికం... మన వీధుల్లో కనిపించే మా‘నవ’ సమాజ శైలి ఆధునికం... ఈ రెండింటినీ ఒక చోట చేరిస్తే అదే జీ‘వన’ వైవిధ్యం. వన్యప్రాణులపై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్‌ను, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ‘డేట్ విత్ వైల్డ్ అండ్ బ్యూటిఫుల్’ ఈవెంట్ వైవిధ్యంగా అనిపించింది. వరల్డ్ యానిమల్ డేని పురస్కరించుకుని ఆదివారం మారియట్ హోటల్లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు బొమ్మల వెంకన్న, వి.నర్సయ్య, మౌక్తిక్రెడ్డిలు తీసిన 60కిపైగా వన్యప్రాణుల చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. దీనితో పాటే యానిమల్ టాటూస్‌ను చిత్రించుకున్న మోడల్స్‌తో ర్యాంప్‌వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పేజ్‌త్రీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులు హాజరయ్యారు. -
యానిమల్స్ డ్యాన్స్ ..
యానిమల్స్ ఆర్ ద ఫ్యూచర్.. వి డోంట్ లివ్ వితవుట్ యానిమల్స్.. వి లవ్ బర్డ్స్.. ప్లకార్డులు పట్టుకుని యువత చేసిన డ్యాన్స్ అండ్ డ్రామా ఆకట్టుకుంది. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని జీవీకే వన్ మాల్లో శనివారం డేట్ విత్ ద వైల్డ్ అండ్ బ్యూటీఫుల్, మాగస్ లైఫ్ సంస్థ సభ్యులు జంతు సంరక్షణపై అవగాహన కలిగించారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వారు చేసిన డ్యాన్స్‌లు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా మాగస్ లైఫ్ ఫౌండేషన్ సభ్యురాలు విభూతి జైన్ మాట్లాడుతూ ‘ మనుషులు వారి సమస్యలను బయటకు వ్యక్తం చేయగలరు. కానీ మూగజీవాలకు ఆ అవకాశం లేదు. అందుకే జంతువుల సమస్యలను అర్థం చేసుకుని వాటి సంరక్షణకు పాటుపడాలి’ అని కోరారు.