యానిమల్స్ డ్యాన్స్ ..
యానిమల్స్ ఆర్ ద ఫ్యూచర్.. వి డోంట్ లివ్ వితవుట్
యానిమల్స్.. వి లవ్ బర్డ్స్.. ప్లకార్డులు పట్టుకుని యువత చేసిన డ్యాన్స్ అండ్ డ్రామా ఆకట్టుకుంది. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని జీవీకే వన్ మాల్‌లో శనివారం డేట్ విత్ ద వైల్డ్ అండ్ బ్యూటీఫుల్, మాగస్ లైఫ్ సంస్థ సభ్యులు జంతు సంరక్షణపై అవగాహన కలిగించారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వారు చేసిన డ్యాన్స్‌లు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా మాగస్ లైఫ్ ఫౌండేషన్ సభ్యురాలు విభూతి జైన్ మాట్లాడుతూ ‘ మనుషులు వారి సమస్యలను బయటకు వ్యక్తం చేయగలరు. కానీ మూగజీవాలకు ఆ అవకాశం లేదు. అందుకే జంతువుల సమస్యలను అర్థం చేసుకుని వాటి సంరక్షణకు పాటుపడాలి’ అని కోరారు.