టీడీపీ ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు విదేశీ పర్యటనలో తలకు తీవ్ర గాయమైంది. బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, మరికొందరు ఎమ్మెల్యేలు ఐదు రోజుల క్రితం విదేశీ పర్యటన నిమిత్తం సింగపూర్, మలేషియా వెళ్లారు. రెండు రోజుల క్రితం మలేషియాలో చైతన్యరాజు, బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు రహదారిపై అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో బుచ్చిబాబు తలకు తీవ్ర గాయమై 12 కుట్లు పడినట్టు ఎమ్మెల్యే తెలిపారు. బుచ్చిబాబు గాయపడిన విషయం స్వదేశం వచ్చేవరకూ ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు టీడీపీ కార్యకర్తలు, అధికారులు ఆయనను పరామర్శించారు.