than the daughter
-
కన్నకూతురు కళ్లెదుటే భార్యను హత్యచేసిన భర్త
చింతపల్లి(పాడేరు): వివాహేతర సంబంధం అనుమానంతో కట్టుకున్న భార్యను కుమార్తె కళ్లేదుటే ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్యచేశాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తమ్మంగుల పంచాయతీ కె.దుర్గం గ్రామానికి చెందిన సాగిన బాబూరావు, కరుణమ్మ (30)భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య మీద అనుమానంతో బాబూరావు తరచూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం పసుపు ఉడకబెట్టేం దుకు కట్టెల కోసం సమీప అటవీ ప్రాంతా నికి వెళదామని భార్యను నమ్మించాడు. మూడవ కుమార్తె శ్రీలక్ష్మి కూడా తల్లిదండ్రులతో అడవికి వెళ్లింది. ఊరికి కిలోమీటరు దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. వివాహేతర సంబంధం అనుమానాన్ని భార్యవద్ద వ్యక్తం చేసి, ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బాబూరావు కట్టెలు నరికేందుకు వెంటతెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. తీవ్ర భయాందోళనకు గురైన కుమార్తె శ్రీలక్ష్మి గ్రామంలోకి పారిపోయింది. బాబూరావు రాత్రంతా అడవిలో ఉండిపోయి బుధవారం పోలీసుల ఎదుటలొంగి పోయాడు. సంఘటనపై ఇన్చార్జి సీఐ గోవిందరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ వెంకటరావు తెలిపారు. -
కంటిరెప్పే కాటేసింది!
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. మైనర్ కూతురిమీదే అత్యాచారానికి ఒడిగట్టిన ఆ కామాంధుడిని ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి ధనరాజు (42) అనే వ్యక్తి భార్య, బిడ్డలతో కలసి జాలరిపేటలో నివసిస్తున్నాడు. గతంలో కేర్ ఆసుపత్రిలో వాచ్మెన్గా పనిమానేసిన అతడు కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. తాగుడుకు బానిసై కన్నకూతురిపై ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో ఆ మైనర్ బాలిక కిమ్మనకుండా తండ్రి కసాయి చర్యలు భయంతో, బాధతో భరించింది. పదిహేను రోజుల క్రితం కన్న తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడటాన్ని తల్లి గమనించి అతన్ని నిలదీసింది. అతను చంపుతానని బెదిరించడంతో కూతురిని తీసుకుని చెల్లెలు ఇంటికి వెళ్లిపోయింది. బంధువులు ఇచ్చిన ధైర్యంతో మంగళవారం రాత్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు రాబట్టిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.