Daughter Murder
-
నాన్నా..నన్నెందుకు చంపావ్!
-
కన్నకూతుర్నే కడతేర్చారు..!
న్యూఢిల్లీ: నగరంలో మరో పరువు హత్య చోటు చేసుకొంది. ఆమె కుటుంబ సభ్యుల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఆమె స్నేహితుడితో పెళ్లి చేసుకొంది. ఇది ఇష్టం లేని కుటుంబ సభ్యులు ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహానికి నిప్పు అంటించారు. ఈ దుస్సంఘటన బుధవారం వారి పూర్వీకుల గ్రామమైన రాజస్థాన్‌లోని అల్వార్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ప్రాపర్టీ డీలర్ జగ్మోహన్ యాదవ్, అతడి భార్య సావిత్రి, కూతురుతో కలిసి పశ్చిమ ఢిల్లీలోని కాక్రోలాలోని భారత్ విహార్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. భావన, అభిషేక్ సేత్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వెంకటేశ్వర కాలేజీలో చదువుతున్నపుడే 2012లోనే ఒకరికొకరు పరిచయమయ్యారు. ప్రేమలో పడ్డారు. అలా మొదలై.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొన్నారు. కానీ ఈ విషయం భావన తల్లిదండ్రులకు ఇష్టం లేక నిరాకరించారు. అయినప్పటికీ ఇద్దరూ మేజర్లే కావడంతో ఈ నెల 12వ తేదీన మందిర్ మార్గ్‌లో ఉన్న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసు కొన్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ భావనను తీసుకొని పశ్చిమ ఢిల్లీలో ఉన్న ఉత్తమ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారి తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి అంగీకరించారు. కానీ అదే రాత్రి భావన తల్లిదండ్రులు వచ్చి తామే ఘనంగా పెళ్లి చేయిస్తామని నచ్చజెప్పి భావనను వెంట తీసుకెళ్లారు. అనంతరం తమకు ఇష్టం లేని ఈ పెళ్లి చేయమని తమకు ఇష్టం ఉన్న వారితోనే పెళ్లి చేయిస్తామని చెప్పడంతో మళ్లీ భావన తిరిగి అభిషేక్ దగ్గరకు నవంబర్ 14 వ తేదీన వచ్చింది. భావన కుటుంబ సభ్యులు మరికొంతమంది బంధువులతో కలిసి వచ్చి తమ ఇంట్లోనే ‘చున్నీ పండుగ’(నిశ్చితార్థం) నిర్వహిస్తామని చెప్పి మళ్లీ తీసుకెళ్లారు. ఆదివారం తిరిగి పంపిస్తామని చెప్పారని అభిషేక్ తెలిపాడు. కానీ ఇంతలోనే భావన మేనమాత లఖన్ ఫోన్ చేసి మిమ్ముల్ని ఇద్దరి చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయాడు. ఈ మేరకు నిందితులైన తల్లిదండ్రులను అరెస్టు చేసి విచారిస్తున్నామని అదనపు పోలీస్ కమిషనర్(నైరుతి) సుమన్ గోయల్ తెలిపారు. -
కూతురిని హత్యచేసిన తండ్రికి డబుల్ యావజ్జీవం
చెన్నై: కన్నకూతురిపైనే లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భవతి కావడంతో హత్య చేసిన మాజీ సైనికుడికి రెండు యావజ్జీవ శిక్షలతో పాటు మరో 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అరుమలై అంబలకడైకి చెందిన బ్రూస్‌వెల్ట్ (48) మాజీ సైనికుడు. మొదటి భార్య చనిపోవడంతో ఐడా సెల్వకుమారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె, పదో తరగతి విద్యార్థిని షెర్లీ జాస్మిన్ (16) వీరితోనే కలసి ఉండేది. అయితే 2010 మే 29న జాస్మిన్ ఇంట్లోనే నీటితొట్టెలో శవమై కనిపించింది. పోస్టుమార్టంలో ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలడంతో.. అనుమానంతో బ్రూస్వెల్ట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. కుమార్తెపైనే బ్రూస్‌వెల్ట్ లైంగికదాడికి పాల్పడటంతో ఆమె నెలతిప్పింది. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని బ్రూస్‌వెల్ట్ కుమార్తెను హత్య చేసి నీటితొట్టిలో పడేశాడు. నాగర్‌కోవిల్ మహిళా కోర్టు న్యాయమూర్తి ముత్తు శారద 33 మంది సాక్షులను విచారించి.. బ్రూస్వెల్ట్కు రెండు యావజ్జీవ శిక్షలు, మరో 27 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. బలాత్కారం చేసిన నేరానికి ఒక యావజ్జీవం, హత్యానేరానికి మరో యావజ్జీవ శిక్ష, కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన నేరానికి పదేళ్ల జైలు, సాక్ష్యాలను రూపుమాపిన నేరానికి 7 ఏళ్ల జైలు శిక్ష, కుమార్తె గర్భంలోని శిశువును హత్యచేసిన నేరానికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. -
ఓ కూతురిని హత్యచేసి... మరో కూతురితో కోర్టుకా?
నాగార్జున సాగర్ : సృష్టిలో మాతృమూర్తికి మహోన్నత స్థానం ఉంది. కానీ ఆ అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది ఓ కర్కశ హృదయురాలు. కూతురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితురాలిని పోలీసులు బుధవారం కోర్టుకు తీసుకు వచ్చారు. ఆమె తనతో పాటు కోర్టుకు మరో కూతుర్ని వెంట తీసుకొచ్చింది. ఆమెను రిమాండ్ చేస్తే... ఆ చిన్నారి రక్షణ బాధ్యత ఎవరిది...? పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారు... అవి కోర్టుకు వివరిస్తేనే నిందితురాలిని రిమాండ్ చేసేందుకు ఒప్పుకుంటా...అని న్యాయమూర్తి వి.సత్యనారాయణ అన్నారు. పోలీసులు చిన్నారి రక్షణకు తీసుకున్న చర్యలు వివరించినప్పుడే నిందితురాలి రిమాండ్‌కు ఒప్పుకుంటానని స్పష్టం చేస్తూ తిప్పి పంపారు. వివరాల్లోకి వెళితే నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పంచాయితీ పరిధి బంటుగూడెంలో ఇటీవల చిన్నారి కృష్ణవేణిని తల్లే కడతేర్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె కొద్దిమాసాల క్రితమే తన చిన్న కుమార్తెను కూడా వదిలించుకోవాలని చూసింది. పెద్దవూర మండలం మూలతండాకు చెందిన వర్తియా హనుమంతు తన భార్య చనిపోవటంతో మేనకోడలు చంద్రకళను వివాహం చేసుకున్నాడు. కొద్దికాలానికే చంద్రకళ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కాగా తనకు అడ్డువస్తున్న కూతుళ్లను వదిలించు్కోవాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే గత ఫిబ్రవరిలో తన చిన్న కుమార్తెను ఒంగోలు జిల్లాకు చెందిన వ్యక్తులకు విక్రయించింది. ఆ గ్రామ అంగన్వాడీ టీచర్ విషయం తెలుసుకొని సూపర్ వైజర్ ఖతీజాకు సమాచారం ఇచ్చింది. ఆమె ఆ తండాకు వెళ్లి విచారణ జరిపింది. శిశువిక్రయం నేరమని కేసు నమోదు చేస్తామని బెదిరించటంతో విక్రయించిన అమ్మాయిని తెచ్చి తాను పెంచలేనని దేవరకొండలోని శిశుమందిర్‌కు అప్పగించింది. వారు చంద్రకళ, హనుమంతును పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు.