న్యూఢిల్లీ: నగరంలో మరో పరువు హత్య చోటు చేసుకొంది. ఆమె కుటుంబ సభ్యుల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఆమె స్నేహితుడితో పెళ్లి చేసుకొంది. ఇది ఇష్టం లేని కుటుంబ సభ్యులు ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహానికి నిప్పు అంటించారు. ఈ దుస్సంఘటన బుధవారం వారి పూర్వీకుల గ్రామమైన రాజస్థాన్‌లోని అల్వార్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ప్రాపర్టీ డీలర్ జగ్‌మోహన్ యాదవ్, అతడి భార్య సావిత్రి, కూతురుతో కలిసి పశ్చిమ ఢిల్లీలోని కాక్రోలాలోని భారత్ విహార్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. భావన, అభిషేక్ సేత్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వెంకటేశ్వర కాలేజీలో చదువుతున్నపుడే 2012లోనే ఒకరికొకరు పరిచయమయ్యారు. ప్రేమలో పడ్డారు.
అలా మొదలై.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొన్నారు. కానీ ఈ విషయం భావన తల్లిదండ్రులకు ఇష్టం లేక నిరాకరించారు. అయినప్పటికీ ఇద్దరూ మేజర్లే కావడంతో ఈ నెల 12వ తేదీన మందిర్ మార్గ్‌లో ఉన్న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసు కొన్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ భావనను తీసుకొని పశ్చిమ ఢిల్లీలో ఉన్న ఉత్తమ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారి తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి అంగీకరించారు. కానీ అదే రాత్రి భావన తల్లిదండ్రులు వచ్చి తామే ఘనంగా పెళ్లి చేయిస్తామని నచ్చజెప్పి భావనను వెంట తీసుకెళ్లారు. అనంతరం తమకు ఇష్టం లేని ఈ పెళ్లి చేయమని తమకు ఇష్టం ఉన్న వారితోనే పెళ్లి చేయిస్తామని చెప్పడంతో మళ్లీ భావన తిరిగి అభిషేక్ దగ్గరకు నవంబర్ 14 వ తేదీన వచ్చింది.
భావన కుటుంబ సభ్యులు మరికొంతమంది బంధువులతో కలిసి వచ్చి తమ ఇంట్లోనే ‘చున్నీ పండుగ’(నిశ్చితార్థం) నిర్వహిస్తామని చెప్పి మళ్లీ తీసుకెళ్లారు. ఆదివారం తిరిగి పంపిస్తామని చెప్పారని అభిషేక్ తెలిపాడు. కానీ ఇంతలోనే భావన మేనమాత లఖన్ ఫోన్ చేసి మిమ్ముల్ని ఇద్దరి చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయాడు. ఈ మేరకు నిందితులైన తల్లిదండ్రులను అరెస్టు చేసి విచారిస్తున్నామని అదనపు పోలీస్ కమిషనర్(నైరుతి) సుమన్ గోయల్ తెలిపారు.
కన్నకూతుర్నే కడతేర్చారు..!
Published Wed, Nov 19 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement