daughter murdered
-
లాక్‌డౌన్‌తో మానసిక స్థితి కోల్పోయి..
జోగిపేట: లాక్డౌన్ కారణంగా ఉపాధి లభించకపోవడంతో మానసిక స్థితి కోల్పోయిన ఓ తండ్రి కన్న కూతురునే కడతేర్చాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ తండాలో చోటుచేసుకుంది. సీఐ బుర్రి శ్రీనివాస్ కథనం ప్రకారం.. గొంగ్లూర్ తండాకు చెందిన రమావత్ జీవన్ దంపతులకు ముగ్గురు సంతానం. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంటి ఎదుట నిద్రించారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో రమావత్ జీవన్ మానసిక స్థితి కోల్పోయి కూతురు అవంతిక (4)ను కత్తితో గొంతు కోసి చంపాడు. ఏమి తెలియనట్లు భార్యను లేపి బిడ్డకు ఏదో అయింది చూడు అని చెప్పాడు. అప్పటికే పాప మరణించింది. కూతురును తన భర్తే హత్య చేశాడని భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. కూతురును హత్య చేసింది తానేనని, ఎందుకు ఇలా చేశానో అర్థం కావడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, జీవన్ మానసిక పరిస్థితి సరిగా ఉండటం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
కుమార్తెను చంపి ..ఆత్మహత్య చేసుకున్న తండ్రి
చుండూరు: కుమార్తెను చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. ఈ సంఘటన గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో జరిగింది. అంగిరేకుల రాజు(30)కు చైతన్యపద్మావతి (8) అనే కుమార్తె ఉంది. ఏడాది క్రితం ఇతని భార్య మొక్కజొన్న కంకెల మిషన్‌లో పడి మృతి చెందింది. దీంతో అతను కుమార్తెను చదివించకోవడానికి తల్లిదండ్రులతో కలిసి తెనాలిలోని రవీంద్రనగర్ కాలనీలో ఉంటున్నాడు. అప్పటి నుంచి మనోవేదనతో ఉన్న రాజు సోమవారం కుమార్తెను పొలానికి తీసుకెళ్లి అక్కడే ఆమెను చంపి చెట్టుకు ఉరివేసుకుని తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య చనిపోయినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నట్టు రాజు లేఖలో రాశాడు. తెనాలి సీఐ కల్యాణరావు, చుండూరు ఎస్సై విక్టర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతుర్ని చంపాడంటూ అమాంతం గాల్లోకి ఎగిరి..
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. ఆ నిందితుడిపై పగపై రగిలిపోయాడు. శిక్ష పడుతుందని రెండేళ్ల నుంచి ఎదురుచూశాడు. చివరికి కోర్టులో అతడ్ని ప్రవేశపెట్టగా ఆ తండ్రి తీవ్ర ఆవేశంతో ఊగిపోయాడు. ఈ రోజు నా చేతిలో నువ్వు చస్తావు అంటూ ఒక్క ఉదుటున నిందితుడి మీదకు దూకాడు. అధికారులు కంట్రోల్ చేయడంతో నిందితుడ్ని వదిలేశాడు. గురువారం నాడు అమెరికాలోని ఓహియో కోర్టులో ఈ సంఘటన జరిగింది. వాన్ టెర్రీ కూతురు షిరెల్డా టెర్రీ రెండేళ్ల కిందట దారుణ హత్యకు గురైంది. 2013లో మాడిసన్ ముగ్గుర్ని హత్య చేసి వారి మృతదేహాలను బ్యాగ్ లో తీసుకెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అంగెలా డిస్కిన్స్(38), షెటిషా షీలే(18), షిరెల్డా టెర్రీ(18)లను ఈస్ట్ క్లీవ్ లాండ్ లోని తన నివాసంలో అతి దారుణంగా హతమార్చాడు. ఓహియో కోర్టులో కేసు గురువారం విచారణకు వచ్చింది. నిందితుడు మాడిసన్ కు మరణశిక్ష విధించారు. అయినా వాన్ టెర్రీ కోపం చల్లారలేదు. అమాంతం గాల్లోకి ఎగిరి నిందితుడిపై దూకాడు. ఇంతలో అధికారులు ఒక్కసారిగా అప్పమత్తమై నిందితుడు మాడిసన్ ను పక్కకు జరిపారు. దాదాపు పది మంది వ్యక్తులు ఆయనను పట్టుకుని వెనక్కి లాగుతున్నా కొంత సేపటి వరకు కంట్రోల్ చేయలేకపోయారు. అప్పటికీ దుఖంలో ఉన్న ఆ తండ్రి నన్ను వదలండీ సార్.. వాడు మా కుటుంబాన్ని టచ్ చేశాడు. ఆ నీచుడ్ని నా చేతులతోనే చంపేస్తాను. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న పాపాత్మున్ని శిక్షిస్తాను అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యం అక్కడి అధికారులతో పాటు కోర్టుకు హాజరైన వారిని కంటతడి పెట్టించింది. -
లవర్ కోసం పోటీపడి కన్న కూతుర్ని..
చంఢీగఢ్: ప్రేమ అంటూ ఓ తల్లి ఘాతుకానికి పాల్పడింది. ప్రేమికుడి కోసం జరిగిన పోరులో కన్న కూతుర్ని బలి తీసుకుంది. సినిమాలో ట్విస్ట్ కంటే కూడా ఎక్కువ నాటకీయత చోటుచేసుకున్నా చివరికి న్యాయమే గెలిచింది. కొన్ని రోజుల కిందట దీక్ష(17) చనిపోయింది. ఆమె తల్లి ఇది ఆత్మహత్య అని అందరినీ నమ్మించింది. కానీ చివరికి దీక్ష మరణం వెనుక అసలు రహస్యాలను తెలుసుకుని పోలీసులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఫేస్ బుక్ లవర్ విజయ్ కుమార్ అలియాస్ సోను కోసం కూతుర్ని అంతం చేసింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నరేందర్ పాల్ సింగ్ తెలిపారు. ఫేస్ బుక్ లో పరిచయం.. ఆపై ఇంట్లో మకాం.. కూతురు దీక్షతో కలిసి తల్లి మంజు పంజాబ్ లోని పంజీర్ లో నివాసం ఉండేది. విజయ్ సౌదీ అరేబియాలో ఉండేవాడు. అయితే 2015 అక్టోబర్ లో ఫేస్బుక్ ద్వారా దీక్ష తల్లి మంజు, విజయ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ఏడాది డిసెంబర్ లో విజయ్ ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ జనవరి నుంచి అబోహర్ లో ఉన్న మంజు ఇంట్లోనే విజయ్ మకాం వేశాడు. తల్లితో సహజీవనం చేస్తున్న విజయ్ మెల్లమెల్లగా దీక్షపై కన్నేశాడు. దీక్షతో విజయ్ చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. కూతురు కూడా విజయ్ ను ప్రేమించింది. అయితే తల్లితో కూడా అతడు సంబంధం పెట్టుకున్నాడన్న విషయాన్ని ఓ రోజు రాత్రి గుర్తించింది. కూతురు ఈ విషయంలో తల్లిని ప్రశ్నించింది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తాను విజయ్ ని ప్రేమిస్తున్నట్లు కూతురికి చెప్పేసింది. తాను కూడా విజయ్ తో గాఢమైన ప్రేమలో ఉన్నట్లు తల్లికి తెగేసి చెప్పింది. ఇక అంతే ప్రియుడు తనకే దక్కాలి, తననే పెళ్లి చేసుకుంటాడంటూ తల్లీకూతుళ్ల మధ్య పోటీ మొదలైంది. ప్రేమికుడి కోసం కూతురు పోటీ పడుతోందని.. తన ప్రేమ నిజమైందని నిరూపించుకోవడానికి విజయ్ పేరును తన మణికట్టుపై పచ్చ పొడిపించుకుంది. దీంతో తన లవర్ ను కూతురు ఎగరేసుకు పోతుందని తల్లి మంజు భావించింది. ఆమె కోపం రెట్టింపయి కూతుర్ని చంపేందుకు పథకం పన్నింది. ఫ్యాన్ కు ఉరివేసి గత నెల 24న దీక్షను చంపేశారు. కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా దీక్ష పేరుతో విజయ్ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. బంధువులు తమ ఆస్తి ఇవ్వలేదని సూసైడ్ చేసుకుందని పోలీసులను నమ్మించాలని చూసింది. అయితే దీక్ష చేతిపై విజయ్ పేరు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మంజు, విజయ్ లను తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం చెప్పేశారు. లవర్ విజయ్ కోసం కూతుర్ని హత్య చేసినట్టుగా అంగీకరించింది. మంజు ప్లాన్ ప్రకారం దీక్షను చంపేశామని విజయ్ చెప్పాడని ఎస్పీ నరేందర్ పాల్ సింగ్ వివరించారు. -
ఎవ్వరినీ వదల్లేదు.. ఇక నీ వద్దకు వచ్చేస్తా..
అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు శవమై కనిపిస్తే ఆ మాతృమూర్తి వేదన ఎలా ఉంటుంది. కూతురు లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి.. కూతుర్ని హత్య చేసిన వారిని వదిలి పెట్టకూడదని నిర్ణయించుకుంది. పదేళ్ల కిందట 24 ఏళ్ల కూతురి అంత్యక్రియలు చేసిన తల్లి బెలిండా లేన్ పగతో రగిలిపోతోంది. నిందితుల వివరాలు కనిపెట్టి పోలీసులకు ఇచ్చేందుకు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు కూడా తెరిచింది. కూతురు క్రిస్టల్ థియోబాల్డ్ డెడ్ బాడీతో తాను ప్రామిస్ చేశానని కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. 2006 ఫిబ్రవరిలో కూతురు క్రిస్టల్ ఓ బైక్ పై వెళ్తోంది. ఆ బైక్ పై క్రిస్టల్ సోదరుడితో పాటు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తాను కారులో వెళ్తుండగా తన వెనకాలే ఆ బైక్ వస్తుందని, ఇంతలో కొందరు వ్యక్తులు ఆ ముగ్గురిపై దారుణంగా కాల్పులకు తెగబడ్డారని విషాధాన్ని గుర్తుచేసుకుంది. కూతురి బాయ్ ఫ్రెండ్ కడుపులో బుల్లెట్లు దిగినా, చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. క్రిస్టల్ శరీరంలోకి బుల్లెట్లు చాలా దూసుకెళ్లడంతో గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని వదలిపెట్టేది లేదని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెలిండా చెప్పింది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిందితుల వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నించానని వివరించింది. కాలిఫోర్నియాకు చెందిన చివరి నిందితుడు సొటేలో అరెస్టయ్యాడని, బెయిల్ కూడా రాలేదని పేర్కొంది. నిందితులకు శిక్ష పడేలా చేసే ప్రతయ్నంలో తాను ఏ అఘాయిత్యమైనా చేసి యావజ్జీవ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ నిందితులను వదిలేది లేదంటూ గతంలో చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంది. నిందితులకు శిక్ష పడిందని ఇక తనకు ఇష్టంలేదంటూ తల్లి బెలిండా లేన్ ఏడ్చేసింది. -
పాతబస్తీలో తల్లి, కూతురు దారుణ హత్య
హైదరాబాద్: నగరంలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జీఎంచౌనిలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, కూతురు అనూహ్యంగా మరణించారు. తెల్లవారే సరికి వారి మెడలు కోసి ఉన్నాయి. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారితోపాటు ఉండే భర్త కనిపించకుండాపోయాడు. దీంతో స్థానికులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెల రోజుల పిల్లను చంపి.. తల్లి ఆత్మహత్య
అనారోగ్యంతో ఉన్న తన నెలరోజుల వయసున్న పిల్లను సరిగా చూసుకోలేకపోతున్నానన్న బాధతో.. ఆ పిల్లను పీకపిసికి చంపేసి, తర్వాత తాను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందో తల్లి. ఈ ఘటన తమిళనాడులోని సేలం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ మహిళకు తగినంతగా పాలు పడకపోవడంతో పిల్లకు సరిపడ పాలివ్వలేకపోతున్నట్లు తరచు ఆవేదన వ్యక్తం చేసేదని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. దాంతో చివరకు పిల్లను పీక పిసికి చంపేసి, మృతదేహాన్ని ఓ బక్కెట్టులో దాచిపెట్టేసింది. తర్వాత సమీపంలోని గ్రామానికి వెళ్లి అక్కడ ఓ బావిలో దూకి చనిపోయింది. ముందుగా ఇరుగుపొరుగులు ఇంట్లో ఉన్న శిశువు మృతదేహాన్ని కనుగొన్నారు. తర్వాత ఆ తల్లి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త పవర్ లూమ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. -
కుమార్తెను చంపి.. తానూ గొంతు కోసుకుని...
చిలకలూరిపేట: మద్యం మత్తులో కన్నకూతుర్నే హతమార్చిన తండ్రి ఉదంతమిది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఈ ఘటన జరిగింది. వెంగళాయిపాలేనికి చెందిన కందుకూరి తిరుపతయ్య, అనంత లక్ష్మి దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో పెద్దవారు స్థిరపడి వేరు పడగా, రెండో కుమారుడు పవన్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మూడో కుమార్తె మహేశ్వరి(9)అంగవైకల్యంతో ఇబ్బంది పడుతోంది. తిరుపతయ్య మద్యానికి బానిసై తరచూ డబ్బులు ఇవ్వమని భార్యని వేధిస్తుండేవాడు. ఇటీవలే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో శనివారం భార్యతో గొడవకు దిగడంతో 11 గంటల సమయంలో ఆమె వినుకొండకు వెళ్లిపోయింది. ఈ సమయంలో స్కూలునుంచి వచ్చిన పవన్‌పై కత్తితో దాడికి యత్నించాడు. బాలుడు పరిగెత్తగా ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి మహేశ్వరి గొంతును కత్తితో కోసి చంపాడు. తానూ మెడను కోసుకున్నాడు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు.