అనారోగ్యంతో ఉన్న తన నెలరోజుల వయసున్న పిల్లను సరిగా చూసుకోలేకపోతున్నానన్న బాధతో.. ఆ పిల్లను పీకపిసికి చంపేసి, తర్వాత తాను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందో తల్లి. ఈ ఘటన తమిళనాడులోని సేలం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ మహిళకు తగినంతగా పాలు పడకపోవడంతో పిల్లకు సరిపడ పాలివ్వలేకపోతున్నట్లు తరచు ఆవేదన వ్యక్తం చేసేదని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.
దాంతో చివరకు పిల్లను పీక పిసికి చంపేసి, మృతదేహాన్ని ఓ బక్కెట్టులో దాచిపెట్టేసింది. తర్వాత సమీపంలోని గ్రామానికి వెళ్లి అక్కడ ఓ బావిలో దూకి చనిపోయింది. ముందుగా ఇరుగుపొరుగులు ఇంట్లో ఉన్న శిశువు మృతదేహాన్ని కనుగొన్నారు. తర్వాత ఆ తల్లి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త పవర్ లూమ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
నెల రోజుల పిల్లను చంపి.. తల్లి ఆత్మహత్య
Published Fri, Oct 2 2015 8:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM
Advertisement