dawaleswaram
-
గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలకు హైఅలర్ట్
అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు. ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
ఆ రెండు ప్రాంతాల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ!
సాక్షి, రాజమండ్రి: గోదావరికి అంతకంతకూ వరద ఉధృతి పెరుగురతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 19 లక్షల 21 వేల క్యూసెక్కులు గా ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 17.50 అడుగులకు చేరుకుంది. దీంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 68 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 6వేల మందిని తరలించారు. దేవీపట్నం, వీరవరం, తొయ్యేరు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని గ్రామస్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి.. అదేవిధంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అక్కడ కూడా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2014 తర్వాత మళ్లీ ఆరేళ్లకు అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. భద్రాచలం వద్ద ఇప్పటికే నీటి మట్టం 61.5 అడుగులకు చేరుకుంది. మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలోని రేపాకగొమ్ము, రుద్రమ్మకోట, టేకురు, వసంతవాడ, టుకురు గొమ్ము, కోయిదా, నార్లవరం, తిర్లాపురం, చీరవల్లి, చిగురుమామిడిగూడెం సహా మొత్తం14 గ్రామాలు ముంపునకు గురికానున్నాయని అధికారులు తెలిపారు. ఈ గ్రామ ప్రజలను ఖాళీ చేయించి లాంచీలలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారి కోసం నిత్యావసరాలు, పాలు, కిరోసిన్, కూరగాయలతో సహా అధికారులు సర్వం సిద్ధం చేశారు. కోవిడ్-19 కారణంగా వైద్య శాఖ అప్రమత్తమైంది. ఎమ్మెల్యే బాలరాజు, కలెక్టర్ ఎంవీ రెడ్డి దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చదవండి: చంద్రబాబు తీరుపై బీజేపీ నేత ఆగ్రహం -
ముంచెత్తిన వాన
-
పెరిగిన వడి... మళ్లీ అలజడి
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగి భయపెడుతోంది. ఇళ్ల చుట్టూ చేరిన వరద నీరు బుధవారం నాటికి మూడు నుంచి నాలుగు అడుగులు లాగేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు పునరావాస చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో వరద ముంపు, తీసుకుంటున్న పునరావాస చర్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు మంత్రుల బృందాన్ని ఏజెన్సీ దేవీపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటించేలా చేసి బాధితులకు భరోసా నింపేలా చేశారు. ఇంతలోనే బుధవారం సాయంత్రానికి మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాఫర్ డ్యామ్‌తో ఎదురైన ముంపు, పోలవరం పునరావాస ప్యాకేజీపై గత చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో నిర్వాసితుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు సీఎం ఆదేశాల మేరకు భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం ఏజెన్సీలోని ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని మంత్రి వారికి చెప్పి వెళ్లారు. మరోపక్క ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తదితర నిత్యావసరాలను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తున్నారు. నష్టం రూ.5.53 కోట్లుగా అంచనా ప్రాథమికంగా జిల్లాలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టం రూ.5.53 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ⇔ ముమ్మిడివరం నియోజకవర్గం లంక ఆఫ్ ఠాణేల్లంక, గురజాపులంక, కేశనకుర్రు శివారు పొగాకులంక తదితర ప్రాంతాల్లో ముంపు నుంచి బయటపడటంతో ఉపశమనం పొందుతున్నారు. ⇔ గురజాపులంకలో బెండ, ఆనప, వంగ తోటలు ముంపుతో తీవ్రంగా నష్టపోవడం కనిపించింది. గోదావరి ప్రవాహ వేగానికి సుమారు 50 ఎకరాల ముమ్మిడివరం మండలంలోని లంక భూములు కోతకు గురయ్యాయి. ⇔ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం తొర్రేడు, కోలమూరు తదితర గ్రామాల్లోని పంటలు ముంపులోనే ఉన్నాయి. కపిలేశ్వరపురం మండలంలో సుమారు 390 ఎకరాల్లో కూరగాయలు, అరటి, బొప్పాయి పంటలు ముంపుతో దెబ్బతిన్నాయి. ⇔ రాజోలు నియోజక వర్గంలో సుమారు వెయ్యికి పైగా ఇళ్లు ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సుమారు పది వేల ఎకరాల్లో వరి చేలు వరద ముంపులో నానుతున్నాయి. ⇔ కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో అరటి, కంద, పసుపు, బొప్పాయి పంటలతో పాటు పశుగ్రాసం వరదనీటిలో మునిగాయి. ⇔ అల్లవరం మండలం బోడసకుర్రు పరిధిలో వరద ముంపులో 40ఇళ్లు ఉన్నాయి. పల్లిపాలెంలో మత్స్యకారులకు చెందిన 60 ఇళ్లు వరద ముంపులో చిక్కుకున్నాయి. ⇔ పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ కూడా నాటుపడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి కనిపించింది. మానేపల్లి శివారు చివాయిలంక ప్రజలు నడుంలోతు నీటిలో ప్రయాణం సాగిస్తున్నారు. ముంపులో కాజ్‌వేలు... పాశర్లపూడి ఏటిగట్టు దిగువన జల దిగ్బంధంలో ఉన్న కాజ్వే నుంచి రాకపోకలు పునరుద్ధరించారు. ఇదే మండలం కొర్లగుంట ఏటిగట్టు దిగువన కాజ్‌వేపై ఎనిమిదో రోజు కూడా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ముక్తేశ్వరం–అయినవిల్లిలంక గ్రామాల మధ్య ఎదురుబిడిం కాజ్‌వేపై ఇంకా రెండడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. పడవల రాకపోకలు నిలుపుదల చేశారు.. ఏజెన్సీలో దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఎనిమిది రోజులైనా ఇప్పటికీ రవాణా సౌకర్యాలు పునరుద్ధరించ లేదు. మంత్రులు వచ్చి వెళ్లాక ఏజెన్సీలో సహాయక చర్యలు మాత్రం సక్రమంగానే సాగుతున్నాయి. భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరుకోవడం, శబరి నది ఉధృతి ఎక్కువగా ఉండటంతో దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ఇంకా వరద ముంపు కొనసాగుతోంది. మంగళవారం నాలుగు అడుగులు తగ్గిన వరద బుధవారం సాయంత్రం మరో అడుగు పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాంతాల్లో ముంపు కాస్త తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. వారం రోజులుగా సుమారు 4,500 కుటుంబాలు ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం వరద ముంపు తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ స్వల్ప పెరుగుదల నమోదవడంపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎగువన మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న ప్రభావంతో వరద మరోసారి పెరిగేందుకు అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అభిప్రాయపడుతోంది. ఉద్యానవన పంటలకు అపార నష్టం... జిల్లాలో 2510 హెక్టార్లలో ఉద్యావన పంటలు నీట మునిగాయని ప్రాథమికంగా జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పొలవరం, మామిడికుదురు, పి. గన్నవరం, కె గంగవరం మండలాల్లో రూ.2.45 కోట్లు మేర 1563 హెక్టార్లలో కూరగాయలకు, రూ.2.17 కోట్ల మేర 708 హెక్టార్లలో అరటి, రూ.19 లక్షల మేర 104 హెక్టార్లలో బొప్పాయి, రూ.60 లక్షల మేర 80 హెక్టార్లలో తమలపాకులకు, రూ.4.50 లక్షల మేర 30 హెక్టార్లలో పసుపునకు, రూ.7.15 లక్షల మేర 25 హెక్టార్లలో పువ్వులతోటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవి కాకుండా మరో 4వేల 377 హెక్టార్లలో వరి పంటకు నష్టం సంభవించిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. సహాయ చర్యలు ముంపునకు గురైన ప్రాంతాల్లో వరద బాధితుల కోసం 104 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 43 వేల 293 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వరద బాధితుల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, బృందాలు పనిచేస్తున్నాయి. నాలుగు లాంచీలతోపాటు, మరపడవలను వినియోగిస్తున్నారు. ఉరకలేస్తున్న గోదారమ్మ ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): కాటన్‌బ్యారేజీ వద్ద గోదారమ్మ ఉరకలేస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు 11.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతూ ఉదయం 11 గంటలకు 11.75 అడుగులకు చేరుకోవడంతో తిరిగి మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. అక్కడ నుంచి మరింత పెరుగుతూ రాత్రి 7 గంటలకు 12.20 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. కాటన్ బ్యారేజీ నుంచి 10,45,343 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి జలాలు నిలిపివేత సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాల విడుదల నిలిపివేశామని జలవనరులశాఖ డీఈ వెంకట్రావు తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బురద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పై అధికారుల సూచనలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాల విడుదల నిలిపివేశామన్నారు. -
ఉధృతంగా గోదావరి..
సాక్షి, అమరావతి : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 15.2 అడుగులకు చేరుకుంది. 15 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం నారాయణ లంక, అద్దంకివారి లంక, రావులపాలెం మండలం తోక లంక గ్రామాలకు వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయినవిల్లి మండలం కొండుకుదురులంక, పొట్టిలంక గ్రామాలు వరద ముంపునీటిలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర సరకుల కోసం జనం అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన విద్యార్థులు చిర్రావూరుకు చెందిన శివ, శశి, దినేష్, క్రాంతికుమార్లుగా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
బైక్‌లపైకి దూసుకెళ్లిన క్వారీ లారీ
ధవళేశ్వరం/రాజమహేంద్రవరం: జాతీయ రహదారిపై ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ధవళేశ్వరం కొత్తపేట ప్రాంతానికి చెందిన లోట్ల అప్పలరాజు, ఇందిరా స్వర్ణనగర్కు చెందిన ఇమ్మంది వీరవెంకట శివరామప్రసాద్ (27)లు మిత్రులు. ఇద్దరూ బొమ్మూరు వచ్చి , అక్కడ పని ముగించుకుని వేర్వేరు బైక్‌లపై ఇళ్లకు వెళుతున్నారు. ఇండస్ట్రియల్ కాలనీ వద్దకు వచ్చేసరికి బొమ్మూరు నుంచి వేమగిరి వైపు మట్టి లోడుతో వేగంగా వస్తున్న క్వారీ లారీ వారి బైక్‌లపైకి దూసుకువెళ్లింది. అంతటితో ఆగని లారీ ముందుకు వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పలరాజు తలకు బలమైన గాయాలవగా, శివరామప్రసాద్ కాలు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇంజ¯ŒS ఆయిల్ మీద పడడంతో పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ జవ్వాదుల దుర్గాప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ముగ్గురినీ తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పలరాజు, రామప్రసాద్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రామ్‌ప్రసాద్‌ను అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. దుబాయ్ వెళ్లాలనుకుని ... అనంత లోకాలకు.. తండ్రి చనిపోవడంతో తల్లి, నలుగురు అక్కలున్న కుటుంబాన్ని అన్నీ తానై రామ్‌ప్రసాద్ పోషిస్తున్నాడు.యానాం వద్ద రిలయ¯Œ్స సంస్థలో అతడు చిరుద్యోగి. కుటుంబానికి మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో మరో నాలుగు రోజుల్లో దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈలోగా మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.