కల్యాణ వైభోగమే..
ద్వారకాతిరుమల : సర్వ జగద్రక్షకుడైన శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతున్న ఉభయ దేవేరులను పెండ్లాడాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దుర్ముఖినామ సంవత్సర ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం భక్తజన సందోహాలు, గోవిందనావు స్మరణలు, వేదవుంత్రోచ్ఛరణల నడుమ కడురవుణీÄýæుంగా సాగింది. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగవూన్ని అనుసరించి జరిపిన ఈ కల్యాణ తంతును భక్తజనులు వీక్షించి తరించారు.
కల్యాణ వేడుక ఇలా..
శ్రీవారి అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చిన వెంకన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కళా సౌందర్యాలు, పచ్చిపూలతో కల్యాణ వేదికను ముస్తాబు చేశారు. అనంతరం ఆలయంలో తొళక్కవాహనంపై శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అట్టహాసంగా ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి వాహనాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. కల్యాణ తంతులో వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్రS, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పట్టు వస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అమ్మవార్లకు పట్టువస్త్రాలను అందించారు. ఈ కల్యాణ వేడుక ఆద్యంతం భక్తులను ఆనంద పారవశ్యంలో ఓలలాడించింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు.
క్షేత్రంలో పెళ్లిళ్ల సందడి
ద్వారకా తిరుమల :
ఆశ్వయుజమాసంలో మంచి ముహూర్తం కావడంతో చిన వెంకన్న క్షేత్రంలో పెళ్లిబాజాలు మారుమోగాయి. శనివారం ఉదయం క్షేత్ర పరిసరాల్లో వివాహాలు అధికంగా జరిగాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణ మండప ప్రాంతం, దేవస్థానం, ప్రై వేటు సత్రాల్లో ఈ వివాహాలు భారీగా జరిగాయి. దీంతో క్షేత్ర పరిసరాలు పెళ్లిజనాలతో కళకళలాడాయి. వివాహాలు జరుపుకున్న అనంతరం నూతన వధువరులు, వారి బంధువులు శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు.
వైభవం.. గరుడోత్సవం
శ్రీవారి కల్యాణ తంతు ముగిసిన అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారు ఉభయ దేవేరులతో క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. గరుడు స్వామివారికి నిత్య సేవకుడు. అటువంటి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, గజసేవల నడుమ విశేష అలంకారాల్లో చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో ఊరేగారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 8 గంటల నుంచి – భజన సంకీర్తనలు
ఉదయం 10 గంటల నుంచి – భక్తి రంజని
సాయంత్రం 5 గంటల నుంచి – ఉపన్యాసం
సాయంత్రం 6 గంటల నుంచి – భరతనాట్యం
రాత్రి 7 గంటల నుంచి – మోహినీ భస్మాసుర నాటకం
రాత్రి 7 గంటల నుంచి – శ్రీవారి దివ్య రథోత్సవం