Dawn newspaper
-
కరోనా కట్టడిలో యూపీ భేష్.. పాక్ మీడియా
లక్నో: కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీసుకుంటున్న చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ పాక్ మీడియా ప్రశంసలు కురిపిస్తుంది. పాకిస్తాన్ 'డాన్' వార్తాపత్రిక సంపాదకుడు ఫహద్ హుస్సేన్, కరోనా కట్టడి కోసం ఉత్తర ప్రదేశ్ లాక్‌డౌన్‌ను ఎంత కఠినంగా అమలు చేసిందో.. పాక్ ఎలా వదిలేసిందో గ్రాఫ్లతో వివరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పాకిస్తాన్ జనాభా 20కోట్లకు పైగా ఉండగా ఉత్తరప్రదేశ్ జనాభా సుమారు 22 కోట్లు. అయితే పాక్‌లో కరోనా మరణాల రేటు.. యూపీ కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా కట్టడిలో యూపీ పనితీరును మెచ్చుకున్న ఆయన.. మహారాష్ట్ర పనితీరును విమర్శించారు. (ఆస్పత్రి నిర్లక్ష్యం..400 మంది క్వారంటైన్) Here's another graphic comparison this time between Pakistan and Indian state of Maharashtra (prepared by an expert). This shows how terribly Maharashtra has performed in relation to Pakistan. Shows the outcome of bad decisions & their deadly consequences #COVIDー19 (1/2) pic.twitter.com/6AHenrznIs — Fahd Husain (@Fahdhusain) June 7, 2020 మరో ట్వీట్లో.. ‘భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో.. పాకిస్తాన్ కంటే తక్కువ మరణాల రేటు ఉంది. అలానే మహారాష్ట్రలో యువ జనాభా, జీడీపీ అధికంగా ఉన్నప్పటికి ఆ రాష్ట్రంలో మరణాల రేటు అధికంగా ఉంది. కరోనా కట్టడి కోసం యూపీ సరిగ్గా ఏమి చేసిందో.. మహారాష్ట్ర ఏమి చేయలేదో మనం తెలుసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోనందున మహారాష్ట్ర, పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఫహద్ యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించడం పట్ల మిశ్రమ స్పందన వెలువడుతుంది. కొందరు ఫహద్‌ను మెచ్చుకోగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. -
ముంబై దాడులపై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని అంగీకరించారు. ముంబైలో మారణహోమం నిర్వహించింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని ఆయన తొలిసారి అంగీకరించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి పాకిస్థానేనని పరోక్షంగా తెలిపారు. అయితే, ఆ ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వంతో ప్రమేయం లేదని, పాక్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రతండాలు రాజ్యేతర శక్తులని ఆయన ‘డాన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2008 నవంబర్ 26న పాక్ ఉగ్రవాదులు పదిమంది.. భారీ ఆయుధాలు, బాంబులతో విరుచుకుపడి.. ముంబైలో మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భయానక ఉగ్రవాద దాడిలో తొమ్మిదిమంది ఉగ్రవాదులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సజీవంగా చిక్కిన ఉగ్రవాది కసబ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడంతో.. అతన్ని ఉరితీశారు. ముంబైలో జరిగిన ఈ ఉగ్రదారుణంపై భారత్ ప్రభుత్వం ఎన్ని ఆధారాలు సమర్పించినా.. పాక్ మాత్రం తమ ప్రమేయం లేదని బుకాయిస్తూ వచ్చింది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హజీఫ్ సయీద్ అని స్పష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించినా పాక్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించింది. ఇప్పుడు మాజీ ప్రధానమంత్రే 26/11 ముంబై దాడులు తమ పనేనని అంగీకరించడం పాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. -
మంత్రి రాజీనామా.. ప్రధాని ఆమోదం!
ఇస్లామాబాద్: న్యూస్ పేపర్ కథనంతో పాకిస్తాన్ కు చెందిన ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పాక్ సమాచారశాఖ మంత్రి పర్వేజ్ రషీద్ తన రాజీనామా లేఖను ప్రధాని నవాజ్ షరీఫ్ కు అందజేయగా, రాజీనామా అంగీకరించినట్లు సమాచారం. దాన్ న్యూస్ పేపర్ లో ప్రభుత్వానికి, పాక్ ఆర్మీకి మధ్య అసలు పొసగడం లేదని కథనలు వచ్చాయి. ప్రభుత్వం, ఆర్మీ మధ్య వివాదాలు తలెత్తాయాని రషీద్ స్వయంగా న్యూస్ ఏజెన్సీకి చెప్పారని ఆరోపణలొచ్చాయి. గత మూడు వారాలుగా రషీద్ రాజీనామా అంశంపై ప్రధాని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అక్టోబర్ 6న వచ్చిన వార్త కథనమే మంత్రి పదవికి ఎసరు పెట్టిందని, దాని నుంచి ఎన్నో విషయాలు బటయకు వచ్చాయి. అన్ని అంశాలపై నిర్దారణకు వచ్చిన తర్వాతే పర్వేజ్ రషీద్ ను మంత్రివర్గం నుంచి తొలగించారని ప్రచారం జరుగుతోంది.