నవ్వుతూ నిద్దరోవాలి రా తమ్ముడూ!
లెన్స్
లండన్ ఫొటోగ్రాఫర్ శాండి ఫోర్డ్ పేరు గుర్తుకు వస్తే చాలు... గుర్తుకొచ్చేవి పిల్లల నవ్వుల పువ్వులు. వాటి పరిమళానికి ఏది సాటి! న్యూబోర్న్ బేబీస్ను ఫొటోలు తీయడంలో శాండిది పేరు పొందిన చేయి. లండన్లోని ఆమె ‘డే లైట్’ స్టూడియోలో తమ పసిడి నవ్వుల పసిపిల్లల ఫొటోలు తీయించుకోవడానికి తల్లులు అత్యంత ఆసక్తి చూపుతుంటారు. సహజ కాంతిని ఎక్కువగా ఇష్టపడే శాండి, ఫొటోకు సంబంధించిన ఏ చిన్న వివరాన్ని కూడా నిర్లక్ష్యం చేయరు.
అనుకున్న ఫొటో అనుకున్నట్లుగా వచ్చేవరకు తీస్తూనే ఉంటారు. శాండికి ముగ్గురు చిన్న పిల్లలు... వాళ్లు ఎప్పుడు నవ్వుతారు? ఎప్పుడు దిగులుగా ఉంటారు? ఎప్పుడు హుషారుగా ఉంటారు?... ఇలాంటి వివరాలన్నీ ఆమెకు కొట్టినపిండి. జస్ట్... ఇటీవలే శాండి తీసిన ఫొటోల తాజాదనపు పరిమళాన్ని ఆస్వాదించండి.