DCCB Chairman Election
-
తెలంగాణలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు
-
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వీరికే..!
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు ప్రారంభయ్యాయి. మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగిన తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించిన వారి పేర్లను వెల్లడించారు. నల్గొండలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా నామినేషన్ వేస్తున్న కొండూరు రవీందర్రావు జిల్లాల వారీగా.. సహకార పదవులు పొందినవారు.. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కూరాకుల నాగభూషయ్య, వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. డీసీఎంఎస్ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాస రావు. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా, వైస్ చైర్మన్‌గా కొరమోని వెంకటయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా హర్యా నాయక్. మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం, డీసీఎంఎస్ చైర్మన్‌గా మల్కాపూర్ శివకుమార్. నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా వట్టి జానయ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నామ్‌దేవ్ కంబ్లే, వైస్ చైర్మన్‌గా రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా టి లింగయ్య, వైస్ చైర్మన్‌గా కొమరం మాత్తయ్య. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొత్త మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్‌గా మదుకర్ రెడ్డి. దాదాపు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుని సత్తాచాటిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు. ఎన్నికపై అసంతృప్తి.. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. అయితే, చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ నేతలు, పీఏసీఎస్ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఈ ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందు నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు. -
ఉత్కంఠ!
ఆ ఇరువురు డీసీసీబీ డెరైక్టర్లను అర్హులుగా తేల్చిన హైకోర్టు డీసీఓ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్పు అర్హత సాధించిన ఇన్చార్జి ఛైర్మన్ఆంజనేయులు రేపే ఛైర్మన్ ఎన్నికకు ఓటింగ్ సాక్షి ప్రతినిధి, కడప : డీసీసీబీ ఛైర్మన్ ఎన్నికలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. డీసీఓ అనర్హులుగా ప్రకటించిన ఇరువురు డెరైకర్లను హైకోర్టు అర్హులుగా ప్రకటించింది. ఎలాగైనా సరే డీసీసీబీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని టీడీపీ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వచ్చింది. అంతా సవ్యంగా సాగుతోంది.. చైర్మన్ పదవి సొంతం చేసుకోవచ్చని భావిస్తున్న దశలో కోర్టు తీర్పుతో వారిలో టెన్షన్ పెరిగింది. డెరైక్టర్ల పదవులు రద్దయిన ఇరువుర్ని అర్హులుగా హైకోర్టు నిర్ణయించింది. వారిలో ఒకరైన డెరైక్టర్ చిన్న ఓబులేసు ఆకస్మికంగా మృతి చెందారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ మద్దతుదారులైన డెరైక్టర్లు 8 మంది ఉండగా, టీడీపీకి మద్దతుగా 7 మంది నిలుస్తున్నారు. డీసీసీబీ ఛైర్మన్‌గా ఉన్న ఇరగంరెడ్డి తిరుపేలురెడ్డిని అధికార యంత్రాంగం అనూహ్యంగా పదవీచ్యుతున్ని చేసింది. అధికారపార్టీ నేతల ఒత్తిడి మేరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తిరుపేలురెడ్డి కనీస వివరణ కోరకుండా గంటల్లో నిర్ణయాలను అమలు చేశారు. అదే రీతిలో వైస్ ఛైర్మన్ ఆంజనేయులు మరో డైరె క్టర్ చిన్న ఓబులేసుల పదవులు రద్దు చేస్తూ డీసీఓ పోమేనాయక్ ఉత్తర్వులు ఇచ్చారు. వారు డీసీఓ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోఆ ఇరువురు డెరైక్టర్లు ఛైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నెన్నో మలుపులు.. డీసీసీబీ ఛైర్మన్‌గా తిరుపేలురెడ్డి ఎన్నికయ్యేనాటికి ఆయనతోసహా 20 మంది డెరైక్టర్లు ఉన్నారు. వారిలో జమ్మలమడుగు చెందిన ఓ డెరైక్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మిగిలిన 19 మందితో పాలకమండలి కొనసాగుతూ వచ్చింది. వారిలో తిరుపేలురెడ్డి పదవిని అధికార యంత్రాంగం రద్దు చేసింది. ఉన్న 18 మందిలో ఇరువురి పదవుల్ని రద్దు చేస్తూ డీసీఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఇరువుర్ని అర్హులుగా హైకోర్టు ప్రకటించింది. వారిలో ఒకరైన సరస్వతిపల్లె సొసైటీకి చెందిన డెరైక్టర్ చిన్న ఓబులేసు ఆకస్మికంగా బుధవారం మృతి చెందారు. మిగిలిన 17మంది డెరైక్టర్లలో 6 మంది మాత్రమే టీడీపీ మద్దతుదారులుగా ఉన్నారు. ఓబులవారిపల్లెకు చెందిన ఒక డెరైక్టర్ టీడీపీ శిబిరంలో చేరిపోయారు. దాంతో వారి సంఖ్య 7కు పెరిగింది. వారంతా కర్నూలు జిల్లాలో ప్రత్యేక శిబిరంలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ మద్దతుదారులు 10 మంది డెరైక్టర్లు ఉన్నారు. 8 మంది ఇప్పటికే ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. ఇరువురు డెరైక్టర్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి అనుచరులు. ఆ ఇరువురు ఆయన పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావాల్సిన మెజార్టీ డెరైక్టర్లు ఇప్పటీకి తమ ఆధీనంలో ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రేపే ఛైర్మన్ ఎన్నిక... డీసీసీబీ ఛైర్మన్ తిరుపేలురెడ్డి పదవి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎన్. ఆంజనేయులు యాదవ్ డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సహకారశాఖ చట్టంలోని లొసుగుల ఆధారంగా ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఆంజనేయులు పదవిని రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పాలకమండలిని ఏర్పాటు చేయాలని కోరడంతో ఆమేరకు మే 2న (శనివారం) ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంజనేయులు యాదవ్ హైకోర్టును ఆశ్రయించడంతో ఛైర్మన్ ఎన్నికలో ఓటింగ్‌కు అర్హత కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. శనివారం ఛైర్మన్ ఎన్నికలను నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వ్రతంచెడ్డా ఫలితం దక్కుతుందా అన్న ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు ఈ ఎన్నికల్లో మరోమారు బహిర్గతం కానున్నట్లు పరిశీలకులు వివరిస్తున్నారు.