ఆస్పత్రిని సందర్శించిన డీసీహెచ్ఎస్
రామన్నపేట : మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని మంగళవారం జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్) పద్మజ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్లు, సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సమయపాలన పాటించాలని, ఆస్పత్రిలోని వార్డులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోశారు. ఆమె వెంట ఆస్పత్రి సూపరిండెంట్ సిద్ధార్థ, వైద్యులు విజయలక్ష్మి, చిన్నూనాయక్, సిబ్బంది రావీటి సతీష్, ఉమ, సువర్ణ తదితరులు ఉన్నారు.