dcw chairperson
-
Swati Maliwal: ఢిల్లీ పోలీసులకు ఎన్సీడబ్ల్యూ అల్టిమేటం
ఢిల్లీ: దేశ రాజధాని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్‌ను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా తమ ముందు ఉంచాలని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. స్వాతి మలివాల్‌తో తప్పతాగిన ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి పూట అనుచితంగా ప్రవర్తించాడని, కారుతో పాటు కొద్దిదూరం లాక్కెళ్లాడని మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఢిల్లీ కమిషనర్‌కు రేఖా శర్మ లేఖ రాశారు. అంతకు ముందు ఇదే విషయంపై ఆమె ట్వీట్ కూడా చేశారు. కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు! ఇదిలా ఉంటే.. ఢిల్లీలో మహిళ భద్రతను పర్యవేక్షించే క్రమంలో ఎయిమ్స్ గేట్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తన టీంతో నిఘా పెట్టారు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్. అయితే తప్పతాగి కారులో వచ్చిన వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ప్రతిఘటించే సమయంలో ఆమెను కారుతో పాటు లాక్కెళ్లే యత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్.. భగవంతుడి దయతో బయటపడ్డానని, లేకుంటే తాను మరో అంజలి సింగ్‌ను అయ్యేదానిని అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి.. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు కూడా. -
క్షీణించిన మాలివాల్ ఆరోగ్యం
-
మానవత్వమా నీవేక్కడ..?
న్యూఢిల్లీ : మానవత్వం, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. బిడ్డలకు కన్న తల్లిదండ్రులు బరువవుతున్న కాలం ఇది. కడపున పుట్టిన వారే కడవరకూ చూస్తారనే నమ్మకంలేని కాలంలో తోడబుట్టిన వారి నుంచి ఇలాంటి ఆప్యాయతను ఆశించడం అత్యాశే అవుతోంది. మతి స్థిమితం లేని సోదరి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడో అన్న. తోబుట్టువుగా కాదు కదా కనీసం మనిషి అనే విషయాన్ని మరిచి ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. చివరకూ ఢిల్లీ మహిళా కమీషన్ చొరవతో బాధితురాలు ఆ నరకం నుంచి బయటపడ్డారు. హృదయవిదారకమైన ఈ ఘటన వివరాలు.. ఢిల్లీకి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇద్దరూ సొదరులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు మరణించే వరకూ వారితో పాటు ఉన్న బాధితురాలిని రెండేళ్ల క్రితం ఆమె సోదరుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అతడు తన భార్యతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసిస్తున్నారు. ఆమెకు సరైన తిండి కాదు కదా అసలు భోజనం పెట్టడమే మానేశారు. నాలుగు రోజులకు ఒకసారి ఒక బ్రెడ్డు మాత్రమే ఇస్తున్నారు. బాధితురాలు మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె తన పనులను స్వయంగా చేసుకోలేదు. సోదరుడు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె తన మలమూత్రాల మధ్యనే అత్యంత జుగుప్సాకరమైన పరిసరాల్లో జీవనం గడుపుతోంది. బాధితురాలికి మరో సోదరుడు ఉన్నాడు. కానీ ఆమె ప్రస్తుతం ఉంటున్న సోదరుడు ఆమెను చూడటానికి ఎవ్వరిని అనుమతిచ్చేవాడు కాదు. దాంతో బాధితురాలి రెండో సోదరుడు ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచరం అందించాడు. అధికారులు బాధితురాలి సోదరుని ఇంటికి వచ్చినప్పుడు, అతడు వారిని తిట్టడమే కాక ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డాడు. దాంతో సదరు అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లి అక్కడ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బాధితురాలిని అంబేద్కర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ మాట్లాడుతూ ‘బాధితురాలి వయసు కేవలం 50 ఏళ్లు ఉండోచ్చు.. కానీ సరైన పోషణ అందకపోవడంతో 90 ఏళ్ల వయసు వ్యక్తిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చాం. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆశ్రమానికి మారుస్తాం. ప్రజలు కూడా తమ చుట్టు పక్కల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు మాకు తెలియజేయండి. బాధితులకు సాయం చేయండి’ అని కోరారు. -
ఢిల్లీ మహిళా కమిషన్‌పై అత్యాచారం -స్వాతి
సాక్షి, న్యూఢిల్లీ: నెలల పసికందుపై జరిగిన దురాగతంపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది ఢిల్లీ మహిళా కమిషన్‌పై జరిగిన అత్యాచారంగా అభివర్ణించారు. ఏదైనా అత్యాచార సంఘటన జరిగిన ఆరునెలలలోపు నేరస్తులకు శిక్ష విధించాలని పదే పదే తాను విజ్ఞప్తి చేస్తున్నా... ఫలితం లేదన్నారు. ఈ రోజు జాతిపిత గాంధీజీ వర్ధంతి.. ఇలాంటి దేశాన్నా తాను స్థాపించిందీ అని గాంధీ ఆశ్చర్య పోతారన్నారు. అన్నెం పుణ్యం ఎరుగని ఎనిమిది నెలల పాపపై దారుణం..ఇదేమి రామరాజ్యం అంటూ ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్, భగత్, అష్ఫాకుల్లా లాంటి మహా యోధుల త్యాగం వృధా అయిపోయింది... సమాజం, వ్యవస్థ పూర్తిగా చచ్చిపోయిందంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని నగరంలో పసిగుడ్డుపై అత్యాచార ఘటన తరువాత దేశ పతాకం విశ్వంలో ఎలా ఎగురుతుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీనుద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసు వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారు వీఐపీ డ్యూటీలోమునిగితేలుతున్నారనీ, నేరస్తులకు పోలీసుల భయం అస్సలు లేదని విమర్శించారు. ఎనిమిది నెలల పసిపాపపై ఇంత అఘాయిత్యం జరుగుతోంటే.. ఢిల్లీ నగరం ఎలా నిద్ర పోయిందంటూ తీవ్రమైన తన మరో ట్వీట్లో ఆవేదనను వ్యక్తం చేశారు. ఘటన అనంతరం ఆసుపత్రిని సందర్శించిన ఆమె వరుస ట్వీట్లలో ఈ సంఘటనపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాదు గౌరవం కోసం పాఠశాల బస్సుపై దాడి చేసిన సేన ఎక్కడ ఉంది అని ఆమె ప్రశ్నించారు. ఈ దారుణం గురించి విన్న వెంటనే తాను నిర్ఘాంత పోయాననీ, ఆపాప ముఖం చూడాలంటేనే భయంగా ఉందంటూ ట్వీట్ చేశారు. బాధిత శిశువును స్వాతి మలీవాల్ నిన్న (సోమవారం) పరామర్శించారు. శస్త్రచికిత్స తర్వాత పాప ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, త్వరలోనే వైద్యులు ఆమెను డిశ్చార్చ్ చేస్తారని తెలిపారు. పాప తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే పేదవారైన పాప తల్లిదండ్రులకు రూ.50వేల సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అంశంలో శిశువుకు తాత్కాలిక నష్టపరిహారం అందించాల్సిందిగా కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నారు. What to do? How can Delhi sleep today when 8 month baby has been brutally raped in Capital? Have we become so insensitive or we have simply accepted this as our fate? Where is the sena which attacked a school bus to 'protect honour'? No one to ask questions from the system now? — Swati Jai Hind (@SwatiJaiHind) January 29, 2018 DCW shall give Rs 50,000 to parents of the 8 month old rape survivor today itself to support them. Her parents r v poor daily wage labourers & need imm financial support. Further, we have filed an application in court today seeking interim compensation for baby in the matter. — Swati Jai Hind (@SwatiJaiHind) January 30, 2018 -
స్వాతీ.. ఇదేం పని?
స్వయంగా ఏసీబీ కేసులో చిక్కుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్.. పాత చైర్పర్సన్లపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తన పదవీ కాలం ముగిసిన ఇన్నాళ్ల తర్వాత తనపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం ఏంటని మాజీ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ ప్రశ్నించారు. ఏసీబీ విచారణ అంటే తాను భయపడేది లేదని ఆమె చెప్పారు. మహిళా కమిషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఇబ్బడి ముబ్బడిగా నియమించడం, అందులోనూ అక్రమాలకు పాల్పడటంతో స్వాతి మలివాల్‌పై ఇటీవలే ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. మహిళా కమిషన్‌లో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోందని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని బర్ఖా శుక్లా సింగ్ అన్నారు. అక్రమాలు జరిగితే.. తనపై ఆమె అప్పుడే కేసు పెట్టాల్సిందని చెప్పారు. బర్ఖాతో పాటు అంతకుముందు పనిచేసిన కిరణ్ వాలియా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల ఏసీబీ అధికారులు వాళ్లందరినీ అరెస్టుచేసి జైలుకు పంపాలని స్వాతి మలివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి చేసినవన్నీ నిరాధార ఆరోపణలని, అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని కిరణ్ వాలియా అన్నారు. ముగ్గురు మహిళలు చేసిన అక్రమాలకు ఆధారాలు కూడా చూపిస్తానంటూ 128 పేజీల పత్రాన్ని స్వాతి మలివాల్ ఏసీబీకి సమర్పించారు.