ddl
-
దిల్వాలే దుల్హనియా లేజాయేంగే @ 20
మామూలుగా ఓ సినిమా వంద రోజులు ఆడితే హిట్. అదే సినిమా 150 రోజులు ఆడితే సూపర్ హిట్, అంతకు మించి ఆడితే బ్లాక్ బస్టర్. అలాంటిది ఓ సినిమా ఏకంగా 20 సంవత్సరాల పాటు ఒకే థియేటర్లో ఆడితే.. అలాంటి సినిమాను చరిత్ర అంటారు. అలా వెండితెర మీద ఆవిష్కరించబడిన అద్భుతమే దిల్వాలే దుల్హనియా లేజాయేంగే. 1995 అక్టోబర్ 20న రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇప్పటికీ ముంబై మరాఠా మందిర్ రోజూ ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరిస్తూనే ఉన్నారు. షారూక్ ఖాన్, కాజోల్ హీరో హీరోయిన్లుగా అనుపమ్ ఖేర్, అమ్రీష్ పూరి లాంటి మహానటులు నటించిన ఈ సినిమాను ఆదిత్య చోప్రా తొలిప్రయత్నంగా డైరెక్ట్ చేశాడు. ఎటువంటి అనుభవం లేకపోయిన భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే అద్భుత ప్రేమకథను వెండితెర మీద ఆవిష్కరించాడు. అందుకే ఏకంగా పది ఫిలిం ఫేర్ అవార్డ్‌లతో పాటు బెస్ట్ పాపులర్ ఫిలింగా నేషనల్ అవార్డ్ కూడా సాధించింది దిల్వాలే దుల్హనియా లేజాయేంగే. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ఇచ్చిన ఇన్సిపిరేషన్‌తో ఇప్పటికీ ఇదే లైన్‌తో ఇండియన్ సినిమాలో ఎన్నో చిత్రాలు తెరకెక్కుతూనే ఉన్నాయి. మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇంతటి ఘనవిజయం సాధించిన దిల్వాలే దుల్హానియా లేజాయేంగే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ఓ స్పెషల్ వీడియో రూపొందించింది. ఈ వీడియోను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు షారూఖ్. మరోసారి కాజోల్ తో కలిసి దిల్వాలే సినిమాలో నటిస్తున్న షారూఖ్, డిడిఎల్ తరహాలోనే రూపొందించిన పోస్టర్‌ను ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు. Want to thk Team Rohit Shetty & Red Chillies for doing this last minute.All looked happy that I picked Kajol again pic.twitter.com/AioOeaCPkL— Shah Rukh Khan (@iamsrk) October 19, 2015Celebrated enough tonite with Dilwale team.But amidst mad shooting Rohit has a made a video for u all for DDLJ.Yrf will upload it soon.— Shah Rukh Khan (@iamsrk) October 20, 2015 -
ఏడేళ్ల విరామం తరువాత..
బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఏడేళ్ల విరామం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నాడు. 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని మలుపు తిప్పిన ఆదిత్యచోప్రా, 2008లో షారూఖ్, అనుష్క శర్మ జంటగా రబ్నే బనాదే జోడి సినిమాను తెరకెక్కించారు. ఆ తరువాత యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యవహారాలు మాత్రమే చూస్తూ వస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత 'బేఫికర్' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు ఆదిత్య చోప్రా. తన తండ్రి బాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్ యాష్ చొప్రా జయంతి సందర్భంగా ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేశారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాను లో బడ్జెట్ తో తెరకెక్కించాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. -
'దిల్ వాలే' అభిమానులకు శుభవార్త
-
'దిల్ వాలే' అభిమానులకు శుభవార్త
ముంబై: భారతీయ సినీ చరిత్రలో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా బాలీవుడ్ లో రికార్డ్ సాధించిన చిత్రం దిల్ వాలే దుల్హనియా లే జాయింగే. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన దిల్వాలే దుల్హానియా లేజాయింగే (డీడీఎల్) నగరంలోని మరాఠా మందిర్‌లో గత 20 ఏళ్లుగా (1009 వారాలు) నిత్యం ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని శుక్రవారం నాటి నుంచి నిలిపివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం, చిత్రం పంపిణీ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ గురువారం ప్రకటించాయి. అయితే ప్రదర్శనను కొనసాగించాల్సిందిగా వేలాది మంది ఈ సినిమా అభిమానుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌కు వారు తలొగ్గక తప్పలేదు. 1995లో విడుదలైన నాటి నుంచి డీడీఎల్ను మరాఠా మందిర్ ప్రదర్శిస్తోంది. కొన్నేళ్లపాటు అన్నీ ఆటల్లోనూ ప్రదర్శితమైన ఈ చిత్రం ఆ తర్వాత మార్నింగ్ షోగా మాత్రమే ఉదయం 9.15 గంటల సమయానికి ప్రదర్శితమౌతూ వచ్చింది. ప్రదర్శనను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించిన థియేటర్ యాజమాన్యం ఈ రోజు నుంచి మార్నింగ్ షో వేళను 11.15 గంటలకు మార్చింది. థియేటర్ సిబ్బంది సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై వినోద పన్నును రద్దు చేసిన కారణంగా కేవలం 20 రూపాయలకే ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.