రూ.272.3 కోట్లతో ఏడీబీ రోడ్డు విస్తరణ
కోటపాడు (రంగంపేట) :
జిల్లాలో రాజానగరం హైస్కూల్ నుంచి రంగంపేట మీదుగా సామర్లకోట బ్రిడ్జి వరకూ 30 కిలోమీటర్ల ఏడీబీ
రోడ్డును రూ.272.3 కోట్లతో విస్తరిస్తున్నట్టు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్ అండ్ బీ) డీఈ వై.రవీంద్ర తెలిపారు. కోటపాడు గ్రామంలో ఏడీబీ రోడ్డు విస్తరణ కొలతలను మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మొత్తం 33 మీటర్ల వెడల్పుతో ఏడీబీ రోడ్డును విస్తరిస్తామన్నారు. కొలతలను పరిశీలించేందుకు వచ్చిన పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా కొలతలు పరిశీలించి, పండ్లతోటలు, ఇళ్లు, దుకాణాలు ఎంత మేర పోతున్నాయి? ఎంత మేర నష్టం జరుగుతుందనే విషయాలను సేకరిస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా కొలతల పరిశీలన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.రామారావు, పెద్దాపురం డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ఏకాశి, మండల సర్వేయర్ రమణమూర్తి, ఆర్అండ్బీ జేఈ బి.ఎ.ఆదినారాణ, వీఆర్వో దొరబాబు, చైన్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.