సబ్-కలెక్టర్ హరిచందన బదిలీ
కొత్త సబ్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి
విజయవాడ : విజయవాడ సబ్-కలెక్టర్ డి. హరిచందన బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఇక్కడ నుంచి ఆమెను బదిలీ చేసి ఆంధ్రప్రదేశ్ జి.ఏ.డి.లో రిపోర్టు చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. హరిచందన 20-03-2013న విజయవాడ సబ్-కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ పొందారు. సబ్-కలెక్టర్‌గా ఆమె పదవీ కాలం పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా ఆమె తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు కావటంతో త్వరలో ఆమె ఆ రాష్ట్ర కేడర్‌లోకి వెళతారని చె బుతున్నారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత రిలీవ్ అవుతారా, లేదా వెంటనే రిలీవ్ అవుతారా అనే విషయం ఇంకా తేలలేదు. హరిచందన సబ్-కలెక్టర్‌గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. గతేడాది దసరా ఉత్సవాలను, భవానీ దీక్షలను నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలను నిర్వహించారు.
పెనమలూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా పని చేశారు. సబ్-కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో హరిచందన అనేక సమస్యలను చాకచ క్యంగా పరిష్కరించారు. ఎంతో కాలంగా మరుగున పడివున్న జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ఇళ్ల ప్లాట్లను కేటాయించారు. ఇబ్రహీంపట్నంలో 35 ఎకరాల సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. 17నెలల కాలంలో విజయవాడ డివిజన్లో 9,900 టైటిల్ డీడ్లను రైతులకు అందించారు. రెవెన్యూ రికార్డులను ఆన్లైన్ చేయించడంలో ముందంజలో ఉన్నారు. ఆధార్‌లో 91శాతం రేషన్ కార్డులకు సీడింగ్ చేయించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమె ఓ ప్రణాళికను అమలు చేశారు.
అందరికీ థ్యాంక్స్ ...
తాను పని చేసిన కాలంలో సహకరించిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో తాను విధులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించానని చెప్పారు. అవకాశం ఉన్నంతవరకు ప్రజలకు సేవలందించానని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో పనిచేయడం తన సర్వీసులో మధురానుభూతిగా మిగులుతుందన్నారు.
కొత్త సబ్ కలెక్టర్ నాగలక్ష్మి ...
కొత్తగా విజయవాడ సబ్-కలెక్టర్‌గా ఎస్. నాగలక్ష్మి నియమితులయ్యారు. ఆమె 2012 ఐఏఎస్ బ్యాచ్‌లో ఎంపికయ్యారు. 2013-14 బ్యాచ్‌లో ఆమె విజయవాడకు మొదటి పోస్టింగ్‌లో సర్వీసులో చేరనున్నారు. త మిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరుకు చెందిన ఆమె త్వరలో సబ్-కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ట్రైనింగ్‌లో భాగంగా గతంలో ఆమె అనంతపురం, రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల విధులను నిర్వహించారు.