dealerships
-
మారుతి సుజుకిపై భారీ జరిమానా విధించిన సీసీఐ
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 27 మిలియన్ డాలర్ల(₹200 కోట్ల) జరిమానా విధించింది. 2019లో మారుతి తన డీలర్లను వారు అందించే డిస్కౌంట్లను పరిమితం చేయాలని బలవంతం చేస్తుందనే వచ్చిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిశీలిస్తుంది. మారుతి సుజుకి చర్య వల్ల డీలర్ల మధ్య పోటీని సమర్థవంతంగా అణచివేస్తుంది, డీలర్లు స్వేచ్ఛగా పనిచేస్తే వినియోగదారులు తక్కువ ధరలకు కార్లను పొందే అవకాశం ఉంటుందని రాయిటర్స్ నివేదించింది.(చదవండి: రూ.9 వేలకే రియల్మీ ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్) దర్యాప్తు తర్వాత సీసీఐ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఇక నుంచి అటువంటి విధానాలకు పాల్పడకుండా "నిలిపివేయాలి/విరమించుకోవాలని" మారుతిని కోరింది. అలాగే, జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని కంపెనీని కోరింది. ఈ విషయంపై మారుతి సుజుకి యాజమాన్యం ఇంకా స్పందించలేదు. దీంతో మారుతి సుజుకి షేర్లు నేడు పడిపోయి బిఎస్ఈలో ₹6,835.00(0.23%) వద్ద ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మొత్తం ఉత్పత్తి సంవత్సరానికి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం కాలంలో కంపెనీ మొత్తం 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసిందని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. -
అమాత్యా.. పరాభవం తప్పదా..?
బలవంతుడను నాకేమని విర్రవీగిన వారికి పరాభవం తప్పనట్టు ఇన్నాళ్లూ అరాచకాలు, అణచివేతలతో జిల్లాను పాలించిన ఇద్దరు మంత్రులకూ ఓటమి భయం వెంటాడుతోంది. నీరు– చెట్టు పనులు, ఉచిత ఇసుక పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగి.. తనతోపాటు అనుచరగణం కోసం బరితెగించిన అచ్చెన్నాయుడికి ఈసారి గుణపాఠం చెప్పడానికి ప్రజానీకం ఎదురుచూస్తోంది. మరోపక్క తన ఎదుగుదల కోసం ఎదుటివారిని అణగదొక్కి పబ్బం గడుపుకునే కళా వెంకటరావుకు బుద్ధి చెప్పడానికి వ్యతిరేక వర్గం కంకణం కట్టుకుంది. ఈ దఫా ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న భయంతో ఇద్దరు మంత్రులకు నిద్ర కరువైంది. సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సుమారు పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటూ ఒక్కసారిగా అధికారం రాగానే మంత్రి అచ్చెన్నాయుడు కక్షసాధింపు చర్యల్లో రేషన్ డీలర్లు బలైపోయారు. 22 మంది రేషన్ డీలర్లను అకారణంగా తొలగించి, పందికొక్కుల్లా రేషన్ సరుకులు తింటున్నారు. స్వయం శక్తి సంఘాల ముసుగులో టీడీపీ కార్యకర్తలకు రేషన్ డీలర్ బాధ్యతలు అప్పగించి ఇష్టారాజ్యంగా పేదల సరుకులను బొక్కేస్తున్నారు. కొంత మంది హైకోర్టు ఉత్తుర్వులు తెచ్చుకున్నా మంత్రి పెత్తనం ముందు దిగదుడుపుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామం టూ బాధిత డీలర్లు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. మంత్రి కక్షసాధింపునకు బలి టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి మండలాల్లో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కక్షసాధింపు చర్యలకు మొత్తం 22 మంది రేషన్ డీలర్లు బలైపోయారు. టెక్కలి మండలంలో సీతాపురం, తిర్లంగి, బొరిగిపేట, పోలవరం, భగవాన్‌పురం, బన్నువాడ, బూరగాం, పాతనౌపడ, నందిగాం మండలంలో నందిగాం, హరిదాసుపురం, నౌగాం, దేవుపురం, రాంపురం, దిమిలాడ, నరేంద్రపురం, పెద్దతామరాపల్లి, కోటబొమ్మాళి మండలంలో సరియాపల్లి, కొత్తపల్లి, చీపుర్లపాడు, కోటబొమ్మాళి, కురుడు, దంత తదితర గ్రామాల్లో రేషన్ డీలర్లపై అడ్డగోలుగా దాడులు చేయించి వారిని విధుల నుంచి తప్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీ పర్వానికి తెర తీశారు. ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు అసమ్మతి సెగ వెంటాడుతోంది. టీడీపీలో కీలక నాయకులు ఏకమైన వ్యూహాత్మకంగా ఈయన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలు, పార్టీ అంతర్గత విభేదాలు ప్రస్తుతం కళాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో కీలక నాయకుడు కావటం వల్ల ఎన్నికల్లో విజయావకాశాలు ప్రభావం చూపుతాయని అనుకున్నారు. అయితే పరిస్థితులు ఒక్కసారిగా ప్రతికూలంగా మారాయి. వ్యతిరేక వర్గమంతా ఏకమై... సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేస్తున్న మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతికి ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కకుండా చేశారు. అవకాశవాది, తన రాజకీయ ప్రత్యర్థి కోండ్రు మురళీ మోహన్‌కు టీడీపీ రాజాం టిక్కెట్ ఇవ్వటం ఈమె జీర్ణించుకోలేకపోతున్నారు. 1983 నుంచి 1999 వరకు సుదీర్ఘకాలం ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజాంలో తన ఓటమికి కళా కారణం అన్న అంశం సైతం ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రధాన కారణంగా మారుతోంది. మరోవైపు కళా వెంకటరావు తనకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, పట్టుబట్టి మరీ మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడుని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో జి.సిగడాం మండలంలో ఆ పార్టీ నాయకులు లోలోన రగిలిపోతున్నారు. ఇదే కారణంతో ఓట్లు ప్రభావితం చేయగల టీడీపీ నాయకులు వాండ్రంగి మాజీ సర్పంచి బూరాడ వెంకటరమణ, జాడ మాజీ సర్పంచి కోరాడ అచ్చారావు, కొప్పరాం మాజీ సర్పంచ్ ఎర్రబోలు సింహాచలం, ఏవీఆర్పురం నాయకుడు మీసాల గోవిందరావు పార్టీ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. జెడ్పీ చైర్పర్సన్ వర్గం కూడా మరోవైపు జెడ్పీ చైర్పర్సన్ చౌదిరి ధనలక్ష్మి వర్గానికి కళాకు ఎప్పట్నుంచో శత్రుత్వం ఉంది. వీరిని పార్టీలో ఎదగకుండా కళా అణిచివేతకు ప్రయత్నించారు. మరోవైపు ఆర్థిక ప్రగతిని దెబ్బతీసేలా వీరికి కాంట్రాక్టు వచ్చిన ఇసుక రీచ్ రద్దు చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మద్దతుతో వీరు నెగ్గుకు వస్తున్నారు. వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న కళా వ్యతిరేక పోస్టర్లు ప్రదర్శన సైతం ఏడాది క్రితం కలకలం రేపింది. కళా ప్రోత్సాహంతో ఒక పోలీస్ అధికారి దర్యాప్తు చేయగా టీడీపీ నాయకుల ప్రమేయంతో పోస్టర్లు అతికించినట్లు బయటపడింది. పోస్టర్లు అంటించిన వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ వారం రోజులపాటు తిప్పి చివరకు విడిచి పెట్టారు. అదేవిధంగా 2009 టీడీపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నాయని సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో చేరి కళా ఓటమి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కళా అసమ్మతి పద్మవ్యూహంలో చిక్కుకున్నారన్నది రాజకీయ విశ్లేషకులి మాట! మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు మా గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు రేషన్ డీలర్షిప్ ఇవ్వడానికి అన్యాయంగా నన్ను తొలగించారు. బలవంతంగా సెలవు పెట్టించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడుకు భయపడి నాకు డీలర్ షిప్ ఇవ్వలేదు. ఐదేళ్లుగా మా కుటుంబం నడిరోడ్డున పడింది. – రేగు గాసయ్య, బాధిత రేషన్ డీలర్, బూరగాం, టెక్కలి మండలం రాజకీయ కక్షతో తొలగించారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయకక్షతో నా డీలర్‌షిప్‌ను తొలగించారు. నేను 1991 నుంచి దేవుపురంలో డీలర్‌గా పనిచేస్తున్నాను. నాపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా తొలగించడం మంత్రి అధికార దుర్వినియోగానికి నిదర్శనం. – కంచరాన కృష్ణమూర్తి, దేవుపురం, నందిగాం మండలం అన్యాయంగా డీలర్షిప్ తొలగించారు టీడీపీ అధికారంలోకి రాగానే అన్యాయంగా నా రేషన్ దుకాణంపై దాడులు చేయించి డీలర్ షిప్‌ను తొలగించారు. దీనిపై హైకోర్టు మాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ డీలర్ షిప్ ఇవ్వలేదు. ఆ తర్వాత జేసీ కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన మంత్రి అడ్డుకుంటున్నారు. – నడుపూరు అమ్మాలు, బాధిత డీలర్, తిర్లంగి, టెక్కలి మండలం -
హీరో కొత్త గ్లామర్.. ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీయ ఆటో దిగ్గజం హీరో... తన గ్లామర్ బైక్ కు మరింత గ్లామర్ అద్దింది.. కొత్త స్టైల్ లో గ్లామర్ ను అప్ డేట్ చేసింది. బీఎస్-4 కంప్లియంట్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ తో హీరో తన కొత్త గ్లామర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బైకు అమ్మకాలను భారత్ లో ప్రారంభించింది. ఈ కొత్త మోటారో సైకిల్ ను కంపెనీ ఈ ఏడాది మొదట్లో అర్జెంటీనా ఈవెంట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇవి డీలర్ షిప్ ల వద్ద అందుబాటులో ఉన్నాయి. రెండు వేరియంట్లలో ఇది డీలర్ షిప్ వద్ద అందుబాటులో ఉంది. ఒకటి డ్రమ్ బ్రేక్, రెండు డిస్క్ బ్రేక్. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.57,755(ఎక్స్ షోరూం, ఢిల్లీ) కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ మోటార్ సైకిల్ ధర 59,755 రూపాయలు. ఈ కొత్త గ్లామర్ బైకు గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కేవలం బైకు తయారీ డీలర్ షిప్స్ మాత్రమే దీనిపై స్పందిస్తున్నారు. కేవలం భారత్ మార్కెట్లోనే కాక, దక్షిణ అమెరికా లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. కొత్త స్టైల్ లో తీసుకొచ్చిన గ్లామర్ ను, ఆటో గ్రాఫిక్స్ దగ్గర నుంచి ఎల్లాయ్ వీల్స్ వరకు మొత్తం లుక్‌నే మార్చేసింది హీరో. బ్లాక్ కోటెడ్ హ్యాండిల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, కొత్త ఎల్లాయ్ వీల్స్, స్టైలిస్ టెయిల్ డిజైన్, కొత్త మీటర్ కన్సోల్ దీనిలో ప్రధాన ఆకర్షణ. -
తమ్ముళ్లే.. ఇక డీలర్లు!
చౌక దుకాణాల డీలర్ షిప్పులు కట్టబెట్టేందుకు యత్నాలు సాక్షి, కర్నూలు : జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు చౌక దుకాణాల డీలర్‌షిప్పులను కట్టబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఇన్చార్జీల పాలనలో ఉన్న రేషన్‌షాపులకు నోటిఫికేషన్ ఇచ్చి శాశ్వత డీలర్ల నియామకం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన తమ్ముళ్ల రుణం తీర్చుకునేందుకు అధికారపార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా ఎక్కువ షాపుల డీలర్‌షిప్పులను చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,411 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అవకతవలకు పాల్పడిన కొందరు రేషన్ డీలర్లను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, బనగానపల్లె, నందికొట్కూరులో పలు చౌకధరల దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేశారు. వీటిని సమీపంలోని కొందరు డీలర్లకు అప్పగించారు. ఇప్పుడు వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి శాశ్వత ప్రాతిపదికన డీలర్లకుఅప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి అర్హులను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా గత సెప్టెంబరు నెలలో ఖాళీలుగా ఉన్న రేషన్‌షాపులకు డీలర్లను భర్తీ చేసే ప్రక్రియకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అప్పటి వరకూ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న రేషన్‌షాపులను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ నేతలు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఫలితంగా ఆ నోటిఫికేషన్‌ను ఉన్నతాధికారులు తాత్కాలికంగా నిలిపివేయడం.. వెనువెంటనే కొందరి డీలర్లపై కక్షపూరిత చర్యలకు ఉపక్రమించడం.. మాటవినని వారిపై అక్రమ కేసులు బనాయించడం.. మరు క్షణమే ఆయా డీలర్లను సస్పెండ్ చేయడం వంటి ప్రక్రియలు చకచకా జరిపోయాయి. ఒక్క ఆదోని డివిజన్‌లోనే ఈ విధంగా దాదాపు 100 మంది డీలర్లను సస్పెండ్ చేసి.. సమీపంలోని మరో డీలరుకు ఆ దుకాణాలను అప్పగించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 400 వరకు దుకాణాలు ప్రస్తుతం ఇన్చార్జుల పాలనలో ఉన్నాయి. తాజా మళ్లీ తెరపైకి నోటిఫికేషన్.. గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన నోటిఫికేషన్‌ను మరోసారి జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు పనిలోపనిగా నోటిఫికేషన్ జారీ అయ్యేలోగా మరికొందరి డీలర్లపై అక్రమ కేసులు నమోదు చేయించి వాటిని కూడా తమ్ముళ్లకే అప్పగించాలని కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ మాట వినని డీలర్ల జాబితాను సిద్ధం చేసి వారిపై కేసులు బనాయించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే సమీప డీలర్లకు అప్పగించి రేషన్ షాపులను తెలుగు తమ్ముళ్లకు అధికారులు తాత్కాలిక కేటాయింపుల కింద అప్పగించారు. అయితే రేషన్ దుకాణాలు తాత్కాలిక కేటాయింపులు చేయకూడదనే ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇటీవల వంద మందికి అక్రమంగా దుకాణాలు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా చౌకధరల దుకాణాల కేటాయింపు అధికారం ఆర్డీవోలకు ఉంది. వీటికి నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపులు చేయకూడదు. కానీ కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో దుకాణాలను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై జిల్లాలో దూమారం రేగుతోంది.