Debt ridden man
-
Bhopal Mass Suicide: నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు..వాళ్లని వదిలిపెట్టొద్దు!
మధ్యప్రదేశ్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అప్పుల వేధింపులు తట్టుకోలేక గత గురువారం విషంతాగి మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసందే. ఐతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చివరి వ్యక్తి కూడా సోమవారం ఉదయం మృతి చెందడంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని పిపలానీ ప్రాంతానికి చెందిన సంజీవ్ జోషి (47), అతని తల్లి నందిని (67), భార్య అర్చన (45), వారి సంతానం గ్రీష్మ (21), పూర్వి (16) కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని నవంబర్ 25 (గురువారం) రాత్రి సేవించారు. ఆటోమొబైల్ విడిభాగాల దుఖానం నడిపే జోషి వాట్సాప్ లైవ్ స్ట్రీమ్‌లో తమ మరణాలకు కారణమైనవారి పేర్లను తెలుపుతూ కుటుంబంగా విషంతీసుకోవడాన్ని వీడియో తీసి వాట్సప్‌లో పంపించాడు. సూసైడ్‌నోట్‌ను ఇంటి గోడపై అంటించారు కూడా. ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా సూసైట్ నోట్లను వాట్సప్‌లో పంపారు. సైంటిస్ట్ అవ్వడం తన కలని ఒకరు, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్నట్లు మరొకరు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తమ కలలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయని కూడా నోట్లో తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించగా.. వేర్వేరు సమయాల్లో కుటుంబం మొత్తం మృతి చెందారని ఒక పోలీస్ అధికారి స్థానిక మీడియాకు తెలియజేశారు. కాగా ఈ కేసు విచారణలో అప్పులిచ్చిన వారిలో నలుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు, మిగిలిన వారినికూడా అదుపులోకి తీసుకుంటామని ఏఎస్పీ రాజేష్ సింగ్ భదౌరియా మీడియాకు తెలిపారు. చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!! -
దయచేసి ఎవరూ ఇలా చేయకండి
-
దయచేసి ఎవరూ ఇలా చేయకండి..
చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. లాటరీ విషయంలో మోసపోయిన ఓ కుటుంబం గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తమ చావుకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఓ వీడియో తీసిమరీ తనువు చాలించారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. సితేరికరై ప్రాంతంలో నివసిస్తున్న అరుణ్(33) వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాజాగా వ్యాపారంలో నష్టం రావడంతో అధిక సొమ్ము వెచ్చించి.. అక్రమంగా నిర్వహిస్తున్న లాటరీకి సంబంధించిన టికెట్లు కొనుగోలు చేశాడు. కాగా లాటరీ విషయంలో కూడా మోసపోవడంతో చివరికి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా తమ ముగ్గురు పిల్లలకు సైనేడ్ ఇచ్చి... అనంతరం భార్య, భర్తలిద్దరూ కూడా చనిపోయారు. చనిపోయే ముందు అరుణ్ తీసిన వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది. వీడియోలో.. ‘‘లాటరీ టిక్కెట్లు కొనడం వల్ల అప్పులపాలయ్యాను. సమాజంలో న్యాయం, చట్టం ఏవీ లేవు. నా ముగ్గురు పిల్లలకు విష గుళికలు ఇచ్చాను. నా కూతుళ్లు నా కళ్ల ఎదుటే చనిపోయారు. కాసేపట్లో మేము కూడా విషం తీసుకోనున్నాం. మేము బతికి ఉండాలని కోరుకోవడం లేదు. మాకోసం ఎవరూ ఏం చేయకండి. మేము ఎవరికి భారం కావాలని అనుకోవడం లేదు. మీరైనా సంతోషంగా జీవించండి. మాలాగా అవ్వకండి. అలాగే అక్రమంగా జరిగే లాటరీ అమ్మకాలను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేయడం వల్ల మాలాంటి అనేక మంది ఇలాంటి అప్పుల బాధ నుంచి తప్పించుకోగలరు’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియోను చనిపోయే కొన్ని క్షణాల ముందు తన స్నేహితులకు వాట్సాప్ చేయగా.. వీడియో చూసిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపు కుటుంబంలోని అయిదుగురు (అరుణ్, భార్య శివగామి, కూతుళ్లు.. ప్రియదర్శిని, యువశ్రీ, భారతి) అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులను పోలీసులు విచారించగా అరుణ్‌కు దాదాపు రూ. 30 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తేలింది. ఇక వీరి మరణంతో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ లాటరీ అమ్మకాల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఏడాది రాష్ట్రంలో 200 కంటే ఎక్కువ అక్రమ లాటరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. -
‘నా చావుకు కారణం నరేంద్ర మోదీయే’...
యావత్మాల్, మహారాష్ట్ర : ప్రభుత్వాలు ఎన్ని మారిన రైతు బతుకుచిత్రం మాత్రం మారదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న తన కుటుంబాన్ని పోషించలేని నిస్సహాయ స్థితిలో బలవంతంగా తనువు చాలిస్తున్నాడు. మన బ్యాంకులు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం దాటే బడా బాబులకు అప్పులిస్తాయి కానీ పదిమందికి అన్నం పెట్టే రైతుకు రుణం ఇవ్వాలంటే మాత్రం ముందుకు రావు. చేసేదేమి లేక వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక ఈ నేలతో వారి రుణానుబంధాన్ని తెంచుకుని వెళ్తున్నారు. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం ఆదుకోక మరో దారి లేక తనువు చాలిస్తున్న రైతన్నల మరణాలకు కారకులేవరు..? సమాధానం దొరకని ఈ ప్రశ్నకు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు మాత్రం తన చావుకు ముమ్మాటికి ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కారణం అంటున్నాడు . యవంతాల్ జిల్లా రాజుర్వాడి గ్రామానికి చెందిన శంకర్ భౌరవ్ చైరే(50) అనే రైతు వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వ సొసైటీ వద్ద రూ.90వేలు, బయట వడ్డీ వ్యాపారీ వద్ద రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తంతో తన భూమిలో పత్తి పంటను సాగు చేశాడు. కానీ బోలుపురుగు వ్యాపించి పంట పూర్తిగా దెబ్బతిన్నది. బోలు పురుగు వ్యాప్తి వల్ల ఈ సంవత్సరం విదర్భ ప్రాంతంలో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పుల భారం పెరగడంతో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా ధర్నా నిర్వహించారు. దిగి వచ్చిన ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది. కానీ ఈ రుణమాఫీ ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. శంకర్ భౌరవ్ సొసైటీ నుంచి తీసుక్ను తొంభై వేల రుణం మాఫీ అయ్యింది, కానీ ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న మూడు లక్షల రుణం అలానే ఉంది. అంత పెద్ద మొత్తాన్ని తీర్చడం తన వల్ల కాదని భావించాడు. తనకు అవసరమయిన మొత్తాన్ని బ్యాంకులు ఇచ్చి ఉంటే తనకు పూర్తి రుణమాఫీ వర్తించేది, అలా జరగలేదు కనుక దీనంతటికి కారణం ప్రస్తుత ప్రభుత్వము, ప్రధాని మోదీనే కారణం అని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వమే కారణం అని రెండు పేజీల ఉత్తరాన్ని రాశాడు. అనంతరం పురుగుల మందు తాగి పొలంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన ఇతర రైతులు శంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ ఈ లోపే శంకర్ చనిపోయాడు. శంకర్ మృతితో ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వం వచ్చి తమకు న్యాయం చేసేంతవరకూ మృతదేహాన్ని కదలనిచ్చేదిలేదని ఆందోళన చేశారు. దాంతో ‘వసంత్‌రావ్ నాయక్ శెటి స్వావలంభన మిషన్’(ఎస్‌ఎన్‌ఎస్‌ఎస్‌ఎం) ప్రెసిడెంట్ కిషోర్ తివారీ సంఘటన స్థలాన్ని సందర్శించి తక్షణ సాయంగా లక్ష రూపాయలను మంజూరు చేశారు. వారి కుటుంబంలో చదుదవుకుంటున్న వారు ఉన్నట్లయితే ఇక మీదట వారి చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. ఒక వేళ వారి చదువులు పూర్తి అయితే వారికి తగిని జీవనోపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు. మరణించి శంకర్‌కు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. ఒక్క కుమార్తేకు మాత్రమే వివాహం అయ్యింది. -
'లక్ష రూపాయలకు నా భార్యను అమ్మేస్తా'
- ఫేస్బుక్లో ఓ ప్రబుద్ధుడి నిర్వాకం ఇండోర్: ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంలోనే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఓ వికృత ఘటన చోటుచేసుకుంది. అప్పుల పాలైన ఓ 30 ఏళ్ల వ్యక్తి.. వాటిని తీర్చుకోవడానికి తన భార్యను అమ్మడానికి సిద్ధమయ్యాడు. లక్ష రూపాయలు ఇస్తే తన భార్యను అమ్మేస్తానంటూ ఏకంగా ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. అతని నిర్వాకంతో నివ్వెరపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త దిలీప్ మాలిపై ఐపీసీ సెక్షన్ 509 (మాటలు, చర్యలు, చేష్టలతో మహిళలను కించపరచడం) ఎరోద్రోమ్ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు దిలీప్ సింగ్ తన భార్య, రెండేళ్ల కూతురు ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఆ పోస్టులో తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. తన భార్యను అమ్మాలనుకుంటున్నాని హిందీలో ఈ పోస్టులో పేర్కొన్నాడు. 'వేర్వేరు వ్యక్తుల వద్ద నేను తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. అందుకే నా భార్యను లక్ష రూపాయలకు అమ్మేస్తాను. ఎవరైనా కొనేందుకు ఆసక్తిగా ఉంటే నా ఫోన్ నంబర్‌కు సంప్రదించండి' అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు. తన బంధువుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అతని భార్య షాక్ తింది. తనను, తన కుటుంబసభ్యులను అవమానపరిచేందుకు అతను ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్ మాలితో ఆమెకు మూడేళ్ల కిందట పెళ్లయింది. వివాహం అనంతరం ఈ జంట ఇండోర్‌లో స్థిరపడింది. అక్కడ తెలిసినవారందరి దగ్గరా అప్పులు చేసిన దిలీప్.. వాటిని తీర్చలేక తన పూర్వీకుల ఊరికి పరారయ్యాడు. దీంతో చేసేదేమీ లేక తాముంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి అతని భార్య, రెండేళ్ల కూతురు తమ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.