breaking news
deceased families
-
అధైర్యపడొద్దు..
పూంచ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ పట్టణంలో పర్యటించారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ దాకా పాకిస్తాన్ సైన్యం దాడు ల్లో మృతిచెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. గంటకుపైగా బాధితులతో మాట్లాడారు. వారి ఆవేదన విని చలించిపోయారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. బాధితుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని, అందరికీ తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నియంత్రణ రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంచ్ టౌన్లో క్రిస్ట్ స్కూల్‌ను రాహుల్ సందర్శించారు. మే 7న ఉదయం పాక్ సైన్యం దాడుల్లో ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. అయాన్, అరూబా అనే 13 ఏళ్ల ఇద్దరు కవలలు, రమీజ్ ఖాన్ అనే మరో విద్యార్థి మరణించాడు. తమ మిత్రులు దూరం కావడాన్ని ఈ స్కూల్ విద్యార్థులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. రాహుల్ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతా త్వర లోనే సర్దుకుంటుందని అన్నారు. ‘‘మీకు ఎదురైన సమస్యలకు ప్రతిస్పందనగా చదువులపై దృష్టి పెట్టండి’’అని సూచించారు. చక్కగా చదువుకోవాలని, చక్కగా ఆడుకోవాలని, ఎంతోమంది స్నేహితులను సంపాదించుకోవాలి అంటూ విద్యార్థులను ఓదార్చారు. పూంచ్ నుంచి ఓ కుటుంబం కారులో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతుండగా పాకిస్తాన్ క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో కారులో ఉన్న 13 ఏళ్ల బాలుడు విహాన్ భార్గవ్ ప్రాణాలు కోల్పోయాడు. విహాన్ భార్గవ్ కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శించారు. -
మాది చేతల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపత్తుల సమయాన గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా అమలు చేయలేదని.. తమది చేతల ప్రభుత్వం కావడంతో గత హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదలతో రూ.5,438 కోట్లు నష్టం జరిగినందున తక్షణమే సాయం చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు. కేంద్రం స్పందించకున్నా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు.మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారని.. తమతో పాటు ఆ పారీ్టకీ రాష్ట్రంలో ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచి్చనందున వారు కేంద్రం తరఫున రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలని సూచించారు. మంగళవారం ఉదయం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్లతో కలిసి సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మేం ఇళ్లలో కూర్చోలేదు.. ‘వరదలు, వర్షాలు వచ్చిన సమయంలో మేము ఇళ్లలో కూర్చోలేదు. మా మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేం పర్యటించినప్పుడు ప్రజలు కోపగించుకున్నా ఫర్వాలేదు.. ఓటు వేసిన వారు మమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు.. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న వారిని అడగలేరు కదా.. ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా నష్టంపై అంచనా వేసి శాశ్వత సాయం అందజేస్తాం. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.2 వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే బాధితులకు ఇంకా ఎక్కువ సాయం చేయొచ్చు..’అని సీఎం వ్యాఖ్యానించారు. ఆక్రమణలతోనే అనర్థాలు ‘నీళ్లలోకి మనం వెళ్లి ఇళ్లు కట్టుకుంటే నీళ్లు ఇళ్లలోకి వస్తాయి. ఖమ్మంలో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పాత చెరువులు ఆక్రమించుకున్న వారిని వదిలేసి కొత్తగా చెరువులను నిర్మించడం ఎందుకు? కొత్త చెరువులకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అది కమీషన్ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది నిజమే అయితే ఇప్పుడు చెరువులు ఎందుకు తెగుతున్నాయి? మిషన్ కాకతీయ అనేది కమీషన్ కాకతీయ అని గతంలో నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. నాటి ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు దీన్ని కమీషన్ కాకతీయగా మార్చారు..’అని సీఎం ఆరోపించారు. రిటైనింగ్ వాల్‌పై ఇంజనీర్లతో చర్చిస్తాం ‘మున్నేరుపై రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపు అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి టెండర్లు ఆహా్వనించాం. కానీ ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచి్చంది. ఇప్పుడు జరిగిన పరిణామాల ఆధారంగా సాంకేతికంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం..’అని రేవంత్ తెలిపారు. వెంటనే స్పందించాం.. ‘రాష్ట్రంలో వర్షాలతో ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించాం. 42 సెం.మీ. వర్షం గత 75 ఏళ్లలో ఎన్నడూ కురవలేదు. ఆ స్థాయిలో వర్షం పడినా తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో బయటపడ్డామంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం. మా మంత్రులు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా నిలిచింది. జిల్లాపై తమకు ఉన్న బాధ్యతతోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తనతో సహా ఇక్కడికి తరలి వచి్చంది. ఈ జిల్లాకు నష్టం జరగనివ్వం. పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది కాలనీల్లో బురద శుభ్రం చేయడానికి ట్యాంకర్లను పంపాం. పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. ప్రజలను ఆదుకోవడానికి పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది..’అని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్ అన్నారు. సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి న్యాయం చేస్తా కారేపల్లి: వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ వరదలో కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమని.. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో అశ్విని, మోతీలాల్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అశ్విని తల్లి నేజీతో మాట్లాడారు. బిడ్డ కొత్త జీతంతో ఇల్లు కట్టుకుందామని మొదలుపెడితే ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఆమె రోదించారు. సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి వస్తే చర్చించి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.రూ.10 వేలు దేనికి సరిపోతాయి? సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద ముంపు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని, సామగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సా యంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి దేనికి సరిపోతాయంటూ బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరి ఇళ్లు కొట్టుకుపోగా, మరికొందరి ఇళ్లు కూలిపోయాయి.మరికొన్ని దెబ్బతిన్నాయి. ఇవికాకుండా ఒక్కో కుటుంబం సగటున రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామగ్రి కోల్పోయారు. ప్రభుత్వం అందించే రూ.10 వేల తక్షణ సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక నష్టాన్ని అంచనా వేసి సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని, సర్వే ఎప్పుడు పూర్తవుతుంది?, పరిహారం ఎప్పుడు అందుతుందని ప్రశ్నిస్తున్నారు. -
విషాదం: ఐదు రోజులు గడుస్తున్నా..
సాక్షి, పశ్చిమగోదావరి: ఈ నెల 18న గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబ సభ్యుల మృతదేహాలు ఇంకా లభించలేదు. కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన ఇంటి యజమాని నరసయ్యకు కరోనా సోకి మృతి చెందడంతో మనస్తాపానికి గురై కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.. మృతులు భార్య సునీత, కుతూరు అపర్ణ, కుమారుడు ఫణికుమార్లుగా గుర్తించారు. ఐదు రోజులు గడుస్తున్న మృతదేహాలు లభించకపోవడంతో గోదావరి పరివాహక పోలీస్స్టేషన్లకు కొవ్వూరు పోలీసులు సమాచారం అందించారు. ('మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం') గత మంగళవారం రాత్రి ఇంటి నుంచి ముగ్గురూ కారులో బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకుని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నరసయ్య ఇంట్లోని లక్ష్మి అపర్ణ డైరీలో ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ లేఖలో ‘మా అందరి కోరిక నిహారిక ఓణీల ఫంక్షన్ బాగా చేయాలి. దొరబాబు మావయ్య మమ్మల్ని క్షమించు. తాతయ్య.అమ్మమ్మల ఆరోగ్యం జాగ్రత్త. మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం’’అంటూ లక్ష్మి అపర్ణ రాసినట్టు ఉన్న లేఖ లభ్యమైంది. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
కావలిఅర్బన్ : హైదరాబాదులోని ఫిలింనగర్లో నాసిరకంగా నిర్మిస్తున్న భవనం కూలి ఆదివారం మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జలదంకి కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక లత సినీ థియేటర్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఫిలింనగర్లో సినీ అసోషియేషన్ భవనం నిర్మాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, నాశిరకంగా నిర్మించడం వల్లే అది కూలిపోయిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కర్నాటకకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. భవనాన్ని నాశిరకంగా నిర్మిస్తుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు అధికారులు భవన నిర్మాణాల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ట్రెజరర్ కోదండరామయ్య, గౌరవాధ్యక్షుడు మార్తాటి శ్రీరాములు, మల్లిఖార్జున, మాల్యాద్రి, శిల్పి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.