December 10
-
పాత రూ.500 నోటుపై మరిన్ని ఆంక్షలు
న్యూఢిల్లీ : పాత రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ నెల 10వరకే రైల్వేలు, మెట్రోలు, బస్సుల్లో రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. డిసెంబర్ 10 తర్వాత ఈ నోట్లు వారి దగ్గర చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. ముందస్తు మార్గదర్శకాల మేరకు, డిసెంబర్ 15వరకు అన్ని వినియోగ బిల్లు చెల్లింపులతో రైల్వే టిక్కెట్ కౌంటర్లలోనూ, బస్ టిక్కెట్ల కొనుగోలుకు పాత రూ.500 నోట్లు వాడకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ తుదిగడువును రైల్వేలు, మెట్రోలు, బస్టిక్కెట్ల కొనుగోళ్లలో ప్రభుత్వం కుదించింది. కాగ, 2016 డిసెంబర్ 3 నుంచి పాత రూ.500 నోట్లను పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లలో, విమానయాన టిక్కెట్ల కొనుగోళ్లలో రద్దుచేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 8న ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం కేవలం 72 గంటలే ఈ నోట్లు పలు వినియోగ చెల్లింపులకు వాడుకోవచ్చని తెలిపింది. కానీ ఈ గడువును వినియోగదారుల సౌకర్యార్థం ప్రభుత్వం రెండు సార్లు పొడిగించింది. ఈ పొడిగింపులో భాగంగా డిసెంబర్ 15వరకు పాత రూ.500 నోట్లు విద్యుత్, మంచినీళ్లు, పాఠశాలల ఫీజులు, ప్రీపెయిడ్ మొబైల్ బిల్లులు, ఇంధన కొనుగోళ్లకు, విమానయాన టిక్కెట్ బుకింగ్స్ వంటి వినియోగ బిల్లులకు వాడుకోవచ్చని తెలిపిన విషయం విదితమే. -
ఓయూలో బీఫ్‌పై రాజకీయ దుమారం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీఫ్‌కు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న చర్యలకు నిరసనగా డిసెంబర్ 10న యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. బీఫ్ ఫెస్టివల్‌కు అనుమతించొద్దని కోరుతూ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ యూనివర్సిటీ వీసీకు లేఖ రాశారు. యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ విషయంలో సీఎం కేసీఆర్, హోంమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని హిందూ జానజాగృతి సమితి నేతలు విజ్ఞప్తిచేశారు. గోవులను పూజించే సంస్కృతి ఉన్న దేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చట్టపరిధిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తామని నేతలు చెప్పారు. రాజాసింగ్ లేఖపై విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని చెప్పుతున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లను బీజేపీ అడ్డుకుంటోందని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిసెంబర్ 10 వరకు ఓటర్ల నమోదు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటర్ల నమోదు కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూత న ఓటర్ల నమోదుకు దరఖాస్తులతోపాటు మార్పులు చేర్పులకు 6, 7, 8, 8 ఏ దరఖాస్తు లు సమర్పించవచ్చని చెప్పారు. ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం ప్రచురించామన్నారు. ఇందులో ఉన్న పొరపాట్లను సరి చేయాలన్నారు. ఈ నెల 24, డిసెంబర్ 1,8 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి బీఎల్వోలు క్లెయిమ్ లు స్వీకరిస్తారని చెప్పారు. ఆ క్లైయిమ్లతోపాటు ఇతర సమస్యలను డిసెంబర్ 28న పరిష్కరించాలన్నారు. 2014 జనవరి 10న మొత్తం వివరాలు అప్ లోడ్ చేసి సప్లిమెంటరీ జాబితా తయారు చేయాలని, 16న తుది జాబితా ప్రచురించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలకు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామని వెల్లడించారు. పై-లీన్ తుపా ను, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాల వివరాలను వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. రచ్చబండలో వచ్చే ఆర్జీల వివరాలను ప్రజావాణిలో నమోదు చేయాల న్నారు. 7వ విడత భూ పంపిణీని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టాతోపాటు టైటిల్ డీడ్, కంప్యూటరైజ్డ్ అడంగల్, వెబ్ అడంగల్, ఎఫ్ఎంబీ కాపీ అందించాలని స్పష్టం చేశారు. బంగారు తల్లి పథకం వర్తింపజేసేందుకు ఈ ఏడాది మే 1వ తేదీ తర్వాత జన్మించిన బాలికల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ తేదీ తర్వాత జిల్లాలో 16 వేల మంది జన్మించగా 3 వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, వచ్చే సోమవారం నాటికి కనీసం 5 వేల మంది వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. నేడు టాయిలెట్ దినోత్సవం మంగళవారం టాయిలెట్ దినోత్సవం నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు ఇతర అంశాలపై చర్చించాలని సూచించారు. డీఎంహెచ్ఓ గీతాంజలి, ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.