December 3
-
National Crime Records Bureau: అయినా భర్త మారలేదు
ఎన్ని కథలు రాసినా..ఎన్ని సినిమాలు తీసినా..ఎన్ని చట్టాలు చేసినా హింస వల్ల భార్యాభర్తల బంధానికి ఎంత గట్టి దెబ్బ తగులుతుందో వార్తల ద్వారా నిత్యం చదువుతున్నా భర్త మాత్రం మారడం లేదు. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) డిసెంబర్ 3న విడుదల చేసిన తాజా నివేదికలో భార్యల మీద భర్తల హింస 2021తో పోలిస్తే 2022లో ఇంకా పెరిగిందని తెలిపింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడే రోజున వచ్చిన ఈ నివేదిక ఎన్ని ప్రభుత్వాలు మారినా మగాణ్ణి మార్చలేకపోతున్నాయన్న కఠోర సత్యాన్ని ముందుకు తెచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న డిసెంబర్ 3వ తేదీన ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. 2022లో జరిగిన అన్ని నేరాల్లో భార్యలపై భర్తలు నెరపిన హింసాత్మక చర్యల కేసులే ప్రథమ స్థానంలో నిలిచాయని ఈ నివేదిక చెప్పింది. అంటే పెద్ద చదువులు, భారీ జీతాల ఉద్యోగాలు, చట్టాలు, సంఘపరమైన మర్యాదలు... ఏవీ మగాణ్ణి మార్చలేకపోతున్నాయని అతడు రోజురోజుకూ మరింత తీసికట్టుగా తయారవుతున్నాడని ఈ నివేదిక వల్ల అర్థమవుతోంది. తానే సర్వాధికారి అన్నట్టుగా ఇంటి యజమాని స్థానంలో ఉంటూ భార్యతో హింసాత్మకంగానే వ్యవహరిస్తున్నాడు. ‘ఇది మగ సమాజం’ అని మగవాడు భావించడమే ఇందుకు కారణం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎంత మంది స్త్రీలకు సీట్లు దక్కాయో, ఎంతమంది స్త్రీలు గెలిచారో గమనిస్తే అవును.. ఇది మగసమాజం అనుకోకుండా ఉండగలరా ఎవరైనా? కాబట్టి ఎన్నికల ఫలితాల రోజే ఈ నివేదిక వెలువడటం యాదృచ్చికం కాదు. పిల్లలూ బాధితులే ఈ నివేదికలో మరో బాధాకరమైన వాస్తవం ఏమిటంటే దేశంలో 2022లో స్త్రీల తర్వాత అత్యధికమైన కేసులు నమోదైనవి బాలలకు జరిగిన హానిపై నమోదైనవే. 2022లో పిల్లలపై హింసకు సంబంధించి 1,62,449 కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికి సగం కిడ్నాపులు. మిగిలినవి పోక్సో కేసులు. వీటిలో పిల్లలపై జరిగిన లైంగిక అసభ్యతతో పాటు అత్యాచారాలు కూడా ఉన్నాయి. గమనించాల్సిన సంగతి ఏమిటంటే భార్యాభర్తల మధ్య హింస చోటు చేసుకుంటున్నప్పుడు పిల్లలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువ. లేదా తల్లిదండ్రుల తగాదాలను చూసి ఇల్లు వీడే పిల్లలు, ఇంట్లో ఉండలేక వేరే చోట ఆడుకోవడానికి వెళ్లి లైంగిక దాడులకు గురయ్యే పిల్లలు అధికంగా ఉంటారు. అంటే గృహహింస వల్ల కేవలం స్త్రీలే కాక పిల్లలు కూడా బాధితులవుతున్నారని తెలుసుకోవాలి. 2022లో స్త్రీలపై, పిల్లలపై జరిగిన నేరాల తర్వాత 60 ఏళ్లు దాటిన వృద్ధులపై ఎక్కువ నేరాలు జరిగాయి. అంటే మన దేశంలో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారు. భర్తలూ మారాలి వివాహం అంటే స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన సమాన వేదిక అనే భావన ఇంకా పురుషుడికి ఏర్పడకపోవడమే స్త్రీలపై నేరాలకు ప్రధాన కారణం. పెళ్లి ద్వారా తనకు భార్య అనే బానిస లేదా సేవకురాలు లేదా తాను అదుపు చేయదగ్గ మనిషి అందుబాటులోకి రాబోతున్నదని పురుషుడు భావిస్తూనే ఉన్నాడు. పైగా ‘ఇదంతా మామూలే. తాతలు తండ్రులు చేసిందే నేనూ చేస్తున్నాను’ అని తాను నమ్మడమే కాక ‘మీ నాన్న మీ తాత చేస్తున్నదే నేనూ చేస్తున్నాను’ అని భార్యతో అంటున్నాడు. ఇందుకు భార్య అభ్యంతరం పెడితే, తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే, మరొక అభిప్రాయం కలిగి ఉంటే ఆమెపై హింస జరుగుతున్నది. భర్త హింస చేయకపోతే అతని సంబంధీకులు ఇందుకు తెగబడుతున్నారు. గాయపరచడం నుంచి హత్య చేయడం వరకు ఈ దాడులు ఉంటున్నాయి. నమోదైనవి మాత్రమే ఎన్.సి.ఆర్.బి. ఈ నివేదికను నమోదైన కేసుల ఆధారంగానే ఇస్తుంది. మన దేశంలో ఎంతమంది భార్యలు కేసుల వరకూ వెళతారో ఊహించవచ్చు. పది శాతం స్టేషన్ దాకా వెళితే 90 శాతం ఇంట్లోనే ఉంటూ ఈ హింసను అనుభవిస్తుంటారు. పురుషులను మార్చడానికి సాహిత్యం, సినిమా, సామాజిక చైతన్యం ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే పురుషుడు మారకపోతే ఎలా? కాఫీ చల్లారిందని, కూర బాగలేదని, కట్నం పేరుతోనో, ఉద్యోగం చేయవద్దనో, మగ పిల్లాణ్ణి కనలేదనో, పుట్టింటికి తరచూ వెళుతోందని, అత్తింటి వారిని అసలు పట్టించుకోవడం లేదనో ఏదో ఒక నెపం వెతికి హింసకు తెగబడితే ఎలా? భర్తలూ ఆలోచించండి. 4,45,256 కేసులు 2022లో స్త్రీలకు జరిగిన హానిపై దేశవ్యాప్తంగా 4,45,256 కేసులు నమోదయ్యాయి. 2021 కంటే 2022లో ఈ నేరాలు 4 శాతం పెరిగాయి. అయితే ఈ మొత్తం నాలుగున్నర లక్షల కేసుల్లో ప్రథమస్థానం వహించినవి భార్య మీద భర్త, అతని సంబంధీకులు చేసిన హింసకు సంబంధించినవే కావడం గమనార్హం. రెండవ స్థానం వహించిన కేసులు స్త్రీల కిడ్నాప్. మూడవ స్థానంలో నిలిచిన కేసులు స్త్రీ గౌరవానికి భంగం కలిగించే చర్యలు. నాల్గవ స్థానంలో నిలిచినవి అత్యాచారాలు. అంటే భర్త, కుటుంబ సభ్యుల సంస్కార స్థాయి మెరుగ్గా ఉండి స్త్రీని గౌరవించే విధంగా ఉంటే దాదాపు సగం కేసులు ఉండేవే కావు. -
‘నాన్న కూచి’లు గెలిచేనా..!
సాక్షి, హైదరాబాద్ : ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు. వారి ఆశయాలను తాము నిజం చేస్తామంటూ ఆ ముగ్గురు అమ్మాయిలు ఎన్నికల బరిలో ఉన్నారు. తమని గెలిపిస్తే తమ తండ్రులు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. ఎన్నికల ప్రచాంరలో ముగ్గురూ దూసుకుపోతున్నారు. పైగా ముగ్గురు అమ్మాయిల నాన్నలకు సమాజంలో వారి వారి నియోజక వర్గాల్లో చాలా మంచి పేరే ఉంది. అందుకే తమ విజయాలపై ముగ్గురూ ధీమాగా ఉన్నారు. డిసెంబరు మూడున తాము ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్నారు. ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో ముగ్గురు అమ్మాయిలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ ముగ్గురూ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. మరో అమ్మాయి తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కీలక నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోఉన్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల తండ్రులూ కాలం చేశారు. జీవించి ఉన్న సమయంలో ఈ అమ్మాయిలు తమ తండ్రులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న నడవడిక.. ఆయన వ్యవహారశైలిని దగ్గరగా గమనించారు. ఇపుడు వారి వారసులుగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచాక వారి ఆశాయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయాలని భావిస్తున్నారు. కంటోన్మెంట్ నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి గెలిచిన సాయన్న ఆ తర్వాత 1999,2004 ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ నుంచి వరుస విజయాలు సాధించారు. 2009 ఎన్నికల్లో నాలుగోసారి గెలిచారు. 2014 లోనూ టీడీపీ తరపున బరిలో దిగి నాలుగోసారి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్వగా విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర ఆనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయన కూతురు లాస్య నందితను సాయన్న జీవించి ఉండగానే రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. ఇపుడు ఆమె బీఆర్ఎస్ అభ్యర్ధిగా తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచే బరిలో ఉన్నారు. తన తండ్రి మిగిల్చి పోయిన అభివృద్ధి పనులు తాను పూర్తి చేస్తానని.. పేదలకు ఎప్పుడూ అండగా ఉండాలన్న తన తండ్రి ఆశయాకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె అంటున్నారు. కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ గుమ్మడి వెన్నెల పోటీ చేస్తున్నారు. ఈమె పరిచయం అవసరంలేని ప్రజాగాయకుడు గద్దర్ కూతురు. తన పాటతో మావోయిస్టు ఉద్యమానికి ఊపు తెచ్చిన గద్దర్ దశాబ్ధాల పాటు విప్లవ ఉద్యమంలో ఉన్నారు. జననాట్యమండలి సభ్యుడిగా ఉంటూ జానపదాలతో జనాన్ని కదిలించారు. ఉద్యమం వైపు ఉరికించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గద్దర్‌కు వీరాభిమానులు ఉన్నారు. సాయుధ పోరాట నినాదంతో ఉద్యమంలో అడుగు పెట్టిన గద్దర్ చివరకు బులెట్ కాదు బ్యాలెటే బెటరని నిర్ణయించుకుని సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆయన కూతురు వెన్నెల తన తండ్రి కలలు కన్న ప్రజాసంక్షేమం కోసం పాటు పడాలని భావిస్తున్నారు. ఆమెను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక రేసులో ఉన్న మూడో అమ్మాయి పి.విజయారెడ్డి. ఖైరతాబాద్ దివంగత ఎమ్మెల్యే పి.జనార్ధన రెడ్డి గారాల పట్టి విజయారెడ్డి. ఖైరతాబాద్ నియోజక వర్గంలోనే కాదు గ్రేటర్ పరిధిలో కార్మిక సంఘాల్లో పీజేఆర్‌కు చాలా పట్టుంది. జననేతగా పేరు గడించారు. 1985లో మొదటి సారి ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచిన పీజేఆర్ ఆ తర్వాత వరుసగా 1989,1994 ఎన్నికల్లోనూ విజయభేరి మోగించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం 26 మంది మాత్రమే గెలిస్తే అందులో పీజేఆర్ ఒకరు కావడం విశేషం. అప్పుడు అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఆయనే వ్యవహరించారు. 1999లో ఓటమి చెందిన పీజేఆర్ తిరిగి 2004లో మరోసారి గెలిచారు. నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆయన కూతురు పి. విజయారెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ నుంచి బరిలో ఉన్న లాస్య నందిత- వెన్నెల లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఖైరతాబాద్‌లో విజయారెడ్డి గెలిచే అవకాశాలు బానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అదే విధంగా కంటోన్మెంట్లో సాయన్న వారసురాలిగా లాస్య నందిత కూడా గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు . మొత్తానికి నాన్నల వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ ముగ్గురు అమ్మాయిల భవితవ్యం ఎలా ఉంటుందో డిసెంబరు మూడున తేలిపోతుంది. -
సంకల్పమే శ్వాసగా!
డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినం జీవితానికి ఒక ప్రణాళిక ఉండాలి. లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని జయించాలనే తపన ఉండాలి.ఆ తపన లేని వారికి అణువంత సమస్య కూడా కొండంత కనిపించి వెనక్కి తగ్గుతారు. తపన ఉన్నవాళ్లకు కొండంత సమస్య కూడా అణువంతైనా ప్రభావం చూపదు! ఈ కోవకు చెందిన వ్యక్తి అహ్మదాబాద్(గుజరాత్)కు చెందిన హరీష్ కుమార్. పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు హరీష్ (కుడి చేయి దిగువభాగం పుట్టుకతోనే లేదు). తనకు రెండు చేతులు లేకపోవడం గురించి హరీష్‌కు బాధగా ఉండేది. అయితే అది కొంతకాలం వరకు మాత్రమే... ఆ తరువాత దాన్ని అధిగమించాడు. చదువులో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఐఐటి, ఢిల్లీ నుంచి యంటెక్ పూర్తిచేశాడు. ఆ తరువాత... పద్దెనిమిది సంవత్సరాల పాటు టెలికామ్ సెక్టార్లో జనరల్ మేనేజర్‌తో సహా రకరకాల హోదాల్లో పనిచేశాడు. ఒకసారి మిత్రుడు ఒకరు హరీష్‌కు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకంలో దీపా మాలిక్ గురించి చదివి ఉత్తేజితుడయ్యాడు హరీష్. సై్పన్ సర్జరీ జరిగిన దీపా మాలిక్ డ్రైవింగ్‌లో రికార్డులు సృష్టించారు. రోజువారి యాంత్రిక జీవితంలో పడి తనకు ఇష్టమైన డ్రైవింగ్‌ను మరిచిపోయిన విషయం హరీష్‌కు అప్పుడు గుర్తుకువచ్చింది. మనసు మళ్లీ డ్రైవింగ్ వైపు లాగింది. తాను కూడా దీపామాలిక్ మాదిరిగా రికార్డ్ సృష్టించాలనే కోరిక పెరిగింది. అలా... తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు హరీష్. 28 రాష్ట్రాల గుండా 15,963 కిలోమీటర్ల దూరాన్ని 29 రోజులలో ఒక మామూలు కారులో కవర్ చేసిన ‘ఫస్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్’గా డ్రైవింగ్‌లో నేషనల్ రికార్డ్ సృష్టించాడు. ఆ తరువాత... 6,000 కిలోమీటర్లను (అహ్మదాబాద్- ఢిల్లీ- కోల్‌కతా-చెన్నై- ముంబాయి-అహ్మదాబాద్) 129 గంటల్లో పూర్తిచేసి మరో రికార్డ్ నెలకొల్పాడు. ఈ రెండూ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుచేసుకున్నాయి. ఈ రెండు విజయాలు తన మనసుకు ఎంతో తృప్తినిచ్చాయి. ఆ తరువాత మళ్లీ... కార్పొరేట్ ప్రపంచంలోకి ప్రవేశించాడు హరీష్ కుమార్. ఆ సమయంలో చాలామంది వికలాంగులు హరీష్‌ను సంప్రదించారు.‘‘మీలాగే రికార్డ్‌లు నెలకొల్పాలని ఉంది. డ్రైవింగ్ అంటే ఇష్టం. కానీ డ్రైవింగ్ రాదు. నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో సమస్యలు వచ్చేవి. అవమానాలు ఎదురయ్యేవి.’’ అనేవారు. వారి ఆవేదన హరీష్‌ను ఆలోచింపచేసింది. వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. డ్రైవింగ్ లెసైన్స్ కోసం తాను ఎంత ఇబ్బంది పడింది, ఎందరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది... ఒక్కటొక్కటిగా గుర్తుకొచ్చింది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి, డ్రైవింగ్ లెసైన్స్ పొందడానికి ఎవరూ ఇబ్బందులు, అవమానాలు పడొద్దు అని... వికలాంగుల కోసం మన దేశంలో తొలి డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాడు. దీనికి ముందు ప్రభుత్వ అధికారులను కలుసుకున్నాడు. వారు చెప్పిన విషయం షాకింగ్‌గా అనిపించింది. వికలాంగుల కోసం మన దేశంలో ఒక్క డ్రైవింగ్ స్కూలు కూడా లేదు!‘ఇది సిగ్గుపడాల్సిన విషయం’ అనిపించింది. ఏమైతేనేం... హరీష్ కోరికను మన్నించి వికలాంగుల కోసం ‘డ్రైవింగ్ స్కూల్’ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మొదటిసారి 150 మంది చేరి డ్రైవింగ్ నేర్చుకొని లెసైన్సులు కూడా పొందారు. వికలాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ‘ఎబిలిటీ ఆన్ వీల్స్’ అనే పుస్తకం కూడా రాశాడు హరీష్ కుమార్. ఈ పుస్తకంలో... స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నవారి పట్టుదల, నైపుణ్యాల గురించి వివరంగా రాశాడు. మరిన్ని నగరాలలో వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్లు ఏర్పడాలని, ఏర్పాటు చేయాలనుకునేవారికి తన సహయ సహాకారాలు ఉంటాయంటున్నారు హరీష్ కుమార్.హరీష్ కుమార్ ‘డ్రైవింగ్ స్కూల్’ వినూత్న ఆలోచన ఎందరిలోనో ఆత్మవిశ్వాసం నింపడమే కాదు...ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.‘డ్రైవింగ్’ అనేది మనకు సంబంధించిన విషయం కాదనుకునేవారిని దగ్గరికి తీసుకొని వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ‘మేము సైతం’ అంటూ అణువణువూ సంకల్పబలాన్ని నింపుతుంది. -
SMS : పైలాపచ్చీస్
వోడాఫోన్లో పనిచేసే ఇంజనీర్ నీల్ పాప్‌వర్త్ 1992 డిసెంబర్ 3న ‘మెర్రీ క్రిస్మస్’ అంటూ తొలి ఎస్ఎంఎస్ను తన కొలీగ్‌కు పంపాడు. తొలి ఎస్ఎంఎస్ విజయవంతం కావడానికి దాదాపు దశాబ్దం ముందు నుంచే ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చే పరిశోధనలు, ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. జర్మన్ ఇంజనీర్ ఫ్రీడ్హెల్మ్ హీల్బ్రాండ్, ఫ్రెంచి ఇంజనీర్ బెర్నార్డ్ గిల్లెబార్ట్ 1984లోనే ఎస్ఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రమాణాలకు రూపకల్పన చేశారు. కొత్త సహస్రాబ్ది ప్రారంభమయ్యే నాటికి మొబైల్ ఫోన్లు మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఏడాది ఏడాదికీ మొబైల్ ఫోన్ల మోడళ్లలో రకరకాల మార్పులు వచ్చాయి. వాటికి కెమెరాలు, వాయిస్ రికార్డింగ్ హంగులు వచ్చి చేరాయి. ఇవెన్ని వచ్చినా ఎస్ఎంఎస్ల జోరు ఆగలేదు సరికదా మరింత పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ఎస్ఎంఎస్లు ఫోన్లు మారుతున్నాయి. ఎస్ఎంఎస్ల వినియోగంలో కుర్రకారుదే జోరెక్కువని అంతర్జాతీయ గణాంకాలు చెవి‘సెల్లు’ కట్టుకుని మరీ చెబుతున్నాయి. సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మనుషులు ఒకరినొకరు కలుసుకోవడం తగ్గింది. మాటా మంతీ అంతా సెల్లోనే అనే పద్ధతి మొదలైంది. ఎస్ఎంఎస్ల వాడుక పెరగడంతో పాటు స్మార్ట్ఫోన్లలో రకరకాల యాప్‌ల ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు పంపే వెసులుబాటు అందుబాటులోకి రావడంతో సంక్షిప్త సందేశాలదే రాజ్యంగా మారింది. దశాబ్దం కిందట సెల్ఫోన్లలో సంభాషణల సగటు నిడివి 3.5 నిమిషాలు ఉండేది. టెక్స్ట్ మెసేజ్‌ల జోరు పెరగడంతో సంభాషణల సగటు నిడివి 2. 2 నిమిషాలకు పరిమితమైందని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ఎస్ఎంఎస్లు మనుషుల మధ్య మాటా మంతిని బొత్తిగా కరువు చేసేస్తున్నాయని, మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయని వాపోతున్న వారు లేకపోలేదు. అయితే, టెక్స్ట్ మెసేజ్‌ల దూకుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. క్రిస్మస్ శుభాకాంక్షలతో తొలి ఎస్ఎంఎస్