december 31st party
-
కొత్త ఉత్సాహం..!
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్‌ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.ఈ వెంట్స్‌కి ఫుల్ డిమాండ్.. షామీర్పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్‌కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పోలీసు నిబంధనలివే.. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు. వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి. సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు. కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు. డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు. పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అనుమతులు తప్పనిసరి.. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..
You can enjoy your New Year's eve in these best possible ways కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు చివరి రోజు కూడా వచ్చేసింది. ఐతే న్యూ ఇయర్ రోజును ఎలా జరుపుకోవాలబ్బా? అని ప్రతి ఒక్కరూ బుర్రలు గోక్కుంటున్నారు కదా! మీ కోసం మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. అవేంటంటే.. హౌస్ పార్టీ మీ ఇంటి టెర్రస్ పై కానీ, ఇంట్లోనైనా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదా సరదాగా చేసుకోవచ్చు. టెర్రస్ పై ప్లాన్ చేస్తే చలి కాలం కాబట్టి చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇష్టమొచ్చినంత సమయం ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తారా మరి? టాప్ రేటెడ్ హోటల్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పార్టీ ఇది. ఐతే స్పెషల్ అకేషన్‌ను ఇంకా స్పెషల్‌గా జరుగుకోవాలనే వారికోసం న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. లగ్జరియస్ డ్రింక్స్, ఫుడ్స్‌తోపాటు డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. మీ నూతన సంవత్సరాన్ని రాయల్‌గా ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఇటువంటి హోటల్స్‌లో టేబుల్‌ను బుక్ చేసుకుంటే సరి. పార్టీ ప్లాన్ రెడీ అయిపోయినట్టే! రెస్టారెంట్ ట్రీట్ భోజన ప్రియులకు ఇది బెస్ట్ ఐడియా. న్యూ ఇయర్ సందర్భంగా చాలా రెస్టారెంట్లు బఫే డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బఫెట్ డిన్నర్లో రకరకాల డిసర్ట్ను మీ ప్లేట్ సర్దేసుకుని మీ నోటిని తీపి చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలోకి తియ్యతియ్యగా అడుగుపెట్టవచ్చు. ఐతే టేబుల్ ముందే బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే! లాంగ్ డ్రైవ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఇది కూడా మంచి ఐడియానే. సొంత వెహికల్లో, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ, మీకిష్టమైన వారితో అలా.. లాంగ్ డ్రైవ్ కెళ్లారంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా! ఐతే ఇద్దరు, ముగ్గురు సన్నిహితులతోనే ఇలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది సుమా! బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలనుకునే వారు ఓపెన్ ప్లేస్ (బహిరంగ ప్రదేశాలకు)లకు వెళ్లడం ఉత్తమం. మ్యూజిక్ ఎంత సౌండ్‌తో విన్నా మిమ్మల్ని వారించేవారెవ్వరూ ఉండరు. లగ్జరీ డెకరేషన్, లైట్ల వెలుగులో సన్నిహితులతో నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఐడియా. బార్బెక్యూ డిన్నర్ కూడా మంచి ఎంపికే. పై మార్గాల్లో మీకు నచ్చిన ఐడియాని ఫాలో అవ్వండి. చెప్పనలవి కానంత ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ఐతే గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు! చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
2022 ప్రారంభ వేడుక... ఇంట్లోనే న్యూ ఇయర్ ఇలా..!
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఎందుకు అన్నారో గాని ఈ కాలంలో ఆ మాట పదేపదే వల్లె వేసుకోవాల్సి వస్తోంది. గుడి కన్నా ఇల్లు పదిలం అని కూడా అనుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు మనం ఉంటున్న ఇంటివైపే కన్నెత్తి కొత్తగా చూడాలి. కొత్తగా అలంకరించుకోవాలి. కొత్తగా కొత్త సంవత్సరానికి ఇంట్లో ఉంటూ ఆహ్వానం పలకాలి. ఎలా చేస్తే బాగుంటుంది? మళ్లీ కొత్త వేరియంట్ అంటున్నారు. బయటకు వెళ్లొద్దంటున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. పార్టీలను అవాయిడ్ చేయమంటున్నారు. కొన్నిచోట్ల డిసెంబర్ 31న నైట్ కర్ఫ్యూలు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్నేల? న్యూ ఇయర్ పార్టీని ఇంట్లోనే ఉండి చేసుకోవడం మేలని నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు, హితవరులు హితవు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్‌కి ఏ గోవాకో, కేరళకో వెళ్లడం ఆనవాయితీ. ఈసారి మానేస్తే ఏం పోతుంది? లేదంటే కారులో బయలుదేరి సొంత ఊరుకు వెళ్లడం పరిపాటి. వద్దు అనుకోవడం మంచిదే కదా. సిటీలోని ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకొని ఇండియన్ ఐడల్ కొత్త సింగర్స్ పాడే పాటలకు నాలుగు డాన్స్‌లు చేయాలని కోరిక ఉంటుంది. ఈసారి నో అనుకుంటే సరిపోదా? ‘జాన్ హైతో జహా హై’ అని సామెత. అంటే ‘ప్రాణాలు ఉంటే ప్రపంచం’ ఉంటుంది అని అర్థం. ప్రాణాలు ఉండాలేగాని భవిష్యత్తులో బోలెడన్ని న్యూ ఇయర్ పార్టీలు బయట చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వెల్కమింగ్ పార్టీకి బెస్ట్ ప్లేస్ ఇల్లే అనుకుందాం ఈసారి. సరిగ్గా ట్రై చేస్తే ఇంట్లోనే మంచి పార్టీ చేసుకోవచ్చు. కొత్త హుషారు తెచ్చుకోవచ్చు. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పొచ్చు. ఏం చేద్దాం. ఒకటి రెండు కుటుంబాల్ని ఎంచుకోండి బయట పార్టీ వద్దన్నారు కానీ ఇంట్లో స్నేహితులతో వద్దు అనుకోలేదు. ఏ ఇంటి పార్టీ అయినా మనకు మనం చేసుకుంటే అంత బాగుండదు. మీకు బాగా ఇష్టమైన ఒకటి రెండు కుటుంబాలను పిల్చుకోండి. చాలా రోజులుగా రాని కొడుకు వచ్చినా కూతురు వచ్చినా మరీ మంచిది. బంధువుల కన్నా స్నేహితుల వల్లే సరదా అనుకున్నా సరే. ఆ గెస్ట్‌లను పిలవడం పూర్తి కాగానే పార్టీ పనుల్లో దిగండి. లైట్లు వెలిగించండి లైట్లు కొత్త వెలుతురును కాంతిని తెస్తాయి. బయట రెడిమేడ్ సీరియల్ సెట్లు దొరుకుతాయి. అవి తెచ్చి ఇంటి గేటు కు, కాంపౌండ్ వాల్‌కు, ముంగిలిలో ఉన్న చెట్లకు, మొక్కలకు, మిద్దెకు వేలాడ దీసి వెలిగించండి. కొనలేకపోతే ఏ ఎలక్ట్రీషియన్‌కు చెప్పినా ఒక రాత్రికి ఇంతని అద్దె తీసుకొని వేసి పోతాడు. అవి ఒక్కసారి మిలమిలమని వెలగడం ప్రారంభిస్తే ఇంటికి కొత్త కళ పార్టీ కళ వచ్చేస్తుంది. పెరడు ఉంటే అక్కడ రెండు ఫ్లాష్లైట్లు వెలిగించండి. వంట పనులకు కూడా పనికి వస్తుంది. దీనికి ముందు ఇల్లు నీట్‌గా సర్దుకోండి. కొత్త కర్టెన్లు వేలాడగట్టినా మంచాల మీద కొత్త దుప్పట్లు పరిచినా కొత్త కళ వచ్చేస్తుంది. షామియానా వేయండి షామియానా వేస్తే వచ్చే కళ వేరు. ఇంటి ముందు బుజ్జి షామియానా వేయించండి. పెరడు ఉంటే అక్కడ కూడా చిన్న షామియానా వేస్తే ఆ షామియానా కింద కుర్చీలు వేసుకుని కూచోబుద్ధవుతుంది. ఆ షామియానా కిందే వంట పనులు చేసుకుంటే ఆ హుషారే వేరు. అతిథులు డిసెంబర్ 31 మధ్యాహ్నానికే చేరుకుంటే సాయంత్రం నుంచి వంటలు మొదలెట్టుకోవచ్చు. అందరూ కలిసి సరదాగా వండొచ్చు. పార్టీలో పానీయాలు ఉంటే స్టార్టర్లు, పిల్లలకు స్నాక్స్, మెయిన్ కోర్సు, డిన్నర్ తర్వాత డిజర్ట్లు, సరిగ్గా 12 గంటలకు కోయడానికి కేక్ ఇవన్నీ సిద్ధం చేసుకోవడమే ఒక పార్టీ. అదంతా ఎంజాయ్ చేయండి. అదే సమయంలో డైనింగ్ టేబుల్ని కూడా అందంగా అలకరించండి. అందమైన ప్లేట్లు బయటకు తీయండి. ఆ పార్టీ... ఆ భోజనం రెండూ గుర్తుండిపోవాలి. ఫొటో కార్నర్ ఇంట్లో ఏ ప్రాంతంలో మంచి ఫోటోలు వస్తాయో అక్కడ ఒక ఫోటో కార్నర్ ఏర్పాటు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 అని రాసిన ఫ్రేమ్ తయారు చేసి దాని వెనుక నిలబడి ఫొటోలు దిగవచ్చు. లేదా అలాంటి అక్షరాలు హ్యాంగ్ చేసిన గోడ దగ్గర అయినా సరే. ఫొటోలు బాగా వచ్చే సెల్‌ఫోన్‌నే వాడండి. అందరూ నవ్వుతూ సంతోషంగా ఫొటోలు దిగండి. రోజులు గడిచిపోతాయి. కాని ఫోటోలు నిలిచిపోతాయి. మన ఇంటి పెద్దలతో తప్పక గ్రూప్ ఫోటో దిగండి. ఫోన్లు చేయండి పార్టీ ఒక వైపు నడుస్తుంటుంది. మీరు మీ అయిన వారికి ఆత్మీయులకు వీడియో కాల్స్ చేస్తూ మీ దగ్గరే వారు కూడా ఉన్నట్టు వారి దగ్గర మీరూ ఉన్నట్టు ఫీల్ రానివ్వండి. కెమెరాను ఇల్లంతా జూమ్ చేస్తూ పార్టీ హడావిడి చూపించండి. వారి హడావిడి చూస్తూ జోక్స్ కట్ చేయండి. చాలా రోజులుగా పలకరించని మిత్రులను పలకరించండి. కొత్త సంవత్సరం మన బంధాలు మరింత గట్టి పడాలని కోరుకోండి. ప్రార్థన చేయండి కొత్త సంవత్సర ఘడియలు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా కూచుని ప్రార్థన చేయండి. ప్రార్థన వంటి పదాలు నచ్చని వారు ఈ విశ్వంలోకి పాజిటివ్ ఆలోచనలు పంపండి. అందరూ బాగుండాలని అంతా మంచే జరగాలని కోరుకోండి. మీరు ఎంత గట్టిగా కోరుకుంటే ఈ విశ్వం అంత బాగుంటుంది. న్యూ ఇయర్ పార్టీకి ఈ పద్ధతిలో రెడీ అయిపోండి. హ్యాపీగా జరుపుకోండి. సురక్షితంగా జరుపుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. మ్యూజిక్ అండ్ డాన్స్ పార్టీలో మ్యూజిక్ లేకపోయినా డాన్స్ లేకపోయినా అస్సలు బాగోదు. అద్దెకు బాక్సులు దొరుకుతాయి. తెచ్చుకోండి. లేదా సొంతవి ఉంటే రెడీ చేసుకోండి. రకరకాల మ్యూజిక్ యాప్‌లు ఉన్నాయి. వాటి నుంచి మంచి డాన్స్ నంబర్లు ప్లే చేయండి. షామియానా కిందో, ఇంటి డాబా పైనో చిన్న స్టేజ్ కట్టుకుంటే అందరి నృత్యకౌశలం చూసి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు ఫస్ట్ సెకండ్ అని పోటీ పెట్టకండి. వారు ఏ చిన్న కళ ప్రదర్శించినా ఒక బహుమతి ఇవ్వండి. మన ఇంటి పాట వీధికి కళ తెస్తుంది. వీధికి కళ వస్తే ఊరికి వస్తుంది. అలాగని మరీ పెద్దగా సౌండ్ పెట్టకండి. మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి. డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా కాదు. -
మందుబాబులు మూడింతలు
సాక్షి ముంబై: నగరంలో వారం రోజుల ముందు నుంచే ‘థర్టీ ఫస్ట్’ పార్టీలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఎక్కువశాతం మంది మద్యం సేవిస్తున్నారు. దీంతో తాగుబోతుల సంఖ్య మూడింతలు పెరిగిందని ‘ది అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం వేడుకల్లో యువకులు మద్యం సేవించే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. డిసెంబర్ 31ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున జరుపుకునే వేడుకల్లో మద్యం సేవించడం మూడింతలు పెరిగిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. మన దేశంలో 18 సంవత్సరాలపై ఉన్న వారు మద్యం సేవించాలన్న నిబంధన ఉన్నా అది సరిగ్గా అమలవుతున్నట్టు ఎక్కడా కన్పించడం లేదు. 14 ఏళ్ల బాలురు కూడా మద్యం సేవిస్తున్నారు. ముంబైలో 14 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల బాలురు, యువకులను పలు ప్రశ్నలు అడిగి, వారిచ్చిన సమాధానాలతో రూపొందించిన నివేదికలో ఈ విషయాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారు ఎక్కువగా మద్యం చేస్తున్నారని తేలిందని వెల్లడించింది. ఈ వయస్సు గల యువకుల్లో 60 శాతం మంది మద్యం సేవించిన తర్వాత అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారనే విషయం తేలింది. వీరు ఇలాగే వ్యవహరిస్తే ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంటుందని సంస్థ ఆరోగ్య విభాగ చైర్మన్ బి.కె.రావ్ తెలిపారు. పిల్లలు ముందు రుచి చూడటం కోసం ఫ్రూట్ ఫ్లేవర్డ్ ఉన్న మద్యం సేవిస్తారు. ఆ తర్వాత మగ్ బీర్, వోడ్కా లాంటి తీవ్ర మత్తు కలిగించే మద్యం సేవించడం ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. 20 నుంచి 29 సంవత్సరాలలోపు గల యువకుల్లో 69 శాతం మంది నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారని, అందులో అందరు మద్యం సేవించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించిందన్నారు. 15 నుంచి 18 వయస్సు గల వారు ‘తాము మద్యం సేవిస్తున్నామని’ గర్వంగా చెబుతున్నారని రావ్ అన్నారు. ‘దేశంలో 1958 సంవత్సరంలో 28 సంవత్సరాల వయస్సు గల యువకులు మాత్రమే మద్యం సేవించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ఆ వయస్సు సంఖ్య 18కు దిగిపోవడం గమనార్హమ’ని ఆయన తెలిపారు. మందుబాబులపై ట్రాఫిక్ శాఖ దృష్టి... ఇదిలాఉండగా సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం రానుండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నియంత్రించడానికి నగర ట్రాఫిక్ శాఖ సిద్ధమవుతోంది. వేడుకల్లో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మందుబాబులపై చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరంలోని అనేక చోట్ల నాకాబందీలు, ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కొంతమేర అయినా తగ్గే అవకాశముందని నగర పోలీసులు అంటున్నారు.