Decline in oil prices
-
తగ్గిన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర
ముంబై: దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్ ధర తగ్గిందని కంపెనీ పేర్కొంది. లీటరు ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్ను గరిష్టంగా రూ.140లు, అంతకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో లీటరు వంట నూనె ధర దాదాపు రూ.180 స్థాయికి చేరింది. నాటి నుంచి ధరల అదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పరిస్థితులకు తగ్గట్లు సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు తగ్గిస్తూ వచ్చింది. దీంతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు దిగివచ్చాయి. -
ఐదేళ్లలో తొలిసారి డీజిల్
35 పైసలు తగ్గే అవకాశం న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో దేశంలో డీజిల్ ధర గత ఐదేళ్లలో తొలిసారిగా లీటర్‌కు 35 పైసల చొప్పున తగ్గే అవకాశముంది. ఇందుకు ప్రభుత్వ చమురు సంస్థలు సుముఖంగా ఉన్నాయి. కానీ డీజిల్ ధరపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేత అంశం ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండటంతో నిర్ణయం కోసం వేచిచూస్తున్నాయి. కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన తిరిగొచ్చాక అలాగే పెట్రోల్ ధరను లీటర్‌కు 54 పైసల చొప్పున పెంచాల్సి ఉన్నా త్వరలో జరగనున్న మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ధరను పెంచలేదు.