ఐదేళ్లలో తొలిసారి డీజిల్ | Diesel for the first time in five years | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో తొలిసారి డీజిల్

Published Wed, Sep 17 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

Diesel for the first time in five years

35 పైసలు తగ్గే అవకాశం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో దేశంలో డీజిల్ ధర గత ఐదేళ్లలో తొలిసారిగా లీటర్‌కు 35 పైసల చొప్పున తగ్గే అవకాశముంది. ఇందుకు ప్రభుత్వ చమురు సంస్థలు సుముఖంగా ఉన్నాయి. కానీ డీజిల్ ధరపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేత అంశం ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండటంతో  నిర్ణయం కోసం వేచిచూస్తున్నాయి.

కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన తిరిగొచ్చాక అలాగే పెట్రోల్ ధరను లీటర్‌కు 54 పైసల చొప్పున పెంచాల్సి ఉన్నా త్వరలో జరగనున్న మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ధరను పెంచలేదు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement