decorates
-
ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే.. ఇల్లు సర్దండిలా..
సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో గడపడం ఎక్కువైపోయింది. హ్యాపీగా కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. ఇంటి వాతావరణం ఆహ్లాదభరితంగా లేకుంటే ఇంటి అందం పాడవటమే కాకుండా మనిషి మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేయకుండా.. అందంగా సర్దుకోవాలి. (చదవండి: పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్లు.. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడ) ► చిన్నారుల ఆట వస్తువులు, రిమోట్ కంట్రోల్, మొబైల్ ఫోన్లు.. ఇలాంటి చిన్న చిన్న వస్తువులను సర్ది అందమైన బుట్టలో వేసేయండి. ఇలా చేస్తే ఇల్లంతా చెల్లాచెదురుగా ఉండదు. రంగు రంగుల బుట్టలతో ఇంటికి కొత్త అందం వస్తుంది. ► పసుపు, నారింజ, ఆలివ్ రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటా యి. వీటిని గోడలకు వేసుకుంటే కాంతివంతంగా కనిపిస్తాయి. తెల్లటి రంగు చల్లటి వాతావరణాన్ని అందిస్తుంది కాబట్టి ఎంచక్కా దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ► కిటికీలు, తలుపులకు కొత్త అందాన్ని తెచ్చేవి పరదాలే. కాబట్టి చక్కటి వాటిని చూసి ఎంపిక చేసుకోవాలి. ఆకుపచ్చటి రంగువి ఎంచుకుంటే ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే అనిపిస్తుంది. అలాగే పరదాల ఎంపిక సమయంలో సోఫా రంగులను కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. లేదంటే గది అందం పోతుంది. ► ఎండాకాలంలో ఇంటికి కొత్త కళను తేవాలనుకుంటే వెదురు, కొబ్బరి పీచుతో తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి కంటికి చల్లదనంతో పాటు కొత్త లుక్ను ఇస్తాయి. (చదవండి: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్ విషయానికి వస్తే..!) -
ఫినిషింగ్ టచ్
వంట తయారుచేయడం ఒక కళ అయితే, తయారుచేసిన వంటను కంటికింపుగా అలంకరించడం మరో కళ. రుచిగా వండిన వంటకాన్ని అందంగా అలంకరించి వడ్డిస్తే, ఆ ఆహారాన్ని ఇష్టంతో తింటారు. గార్నిషింగ్ అనేది ‘గార్నిర్’ అనే ఫ్రెంచి పదం నుంచి రూపొందింది. ఈ పదానికి అలంకరించడం అని అర్థం. అలంకరిచండానికి ఉపయోగించే వస్తువులు కూడా తినడానికి అనువుగా ఉండేవాటినే ఉపయోగించాలి. వంటకం మీద కాని, వంటకం చుట్టూ కాని గార్నిషింగ్ చేయడం ప్రధానం. ఇలా చేయడం వల్ల వంటకానికి కొత్త రంగులు, కొత్త అందం సమకూరుతాయి. వంటల పరిభాషలో గార్నిషింగ్ అంటే ‘వంటకాన్ని మరింత అందంగా రుచి చూడటం’ అని అర్థం. పాటించవలసిన మెలకువలు ♦ వంటకంలో ఉపయోగించిన వాటితోనే తయారైన వంటకం మీద గార్నిషింగ్ చేస్తే బాగుంటుంది. అలా చేయడం వల్ల వారు ప్లేట్లో పదార్థాన్ని కొద్దిగా కూడా మిగల్చకుండా గార్నిషింగ్ చేసినది సైతం కలిపి తినేస్తారు. ♦ గార్నిష్ చేయడానికి ముందు కాయగూరలను తప్పనిసరిగా నీళ్లతో శుభ్రం చేయాలి. ♦ గార్నిషింగ్ చేయడం వల్ల వంటకం మరింత అందంగా కనపడాలే కాని, వంటకాన్ని డామినేట్ చేసేలా ఉండకూడదు. ♦ గార్నిషింగ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ చూసుకోవడం ప్రధానం. ♦ ఎంత అందంగా, జాగ్రత్తగా అలంకరిస్తే, అంత బాగా ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు. గార్నిషింగ్ ఇలా ఉంటే బాగుంటుంది... ♦ సింపుల్గా, సహజంగా, తాజాగా ఉండాలి. ♦ వంటకానికి తగినట్టుగా ఉండాలి ♦ మంచి ఫ్లేవర్తో ఉండాలి. గార్నిషింగ్కి కొన్ని సూచనలు... ♦ అందంగా అలంకరించాలనే శ్రద్ధ ఉండాలి. ♦ టొమాటో సూప్ వంటివి తయారుచేసినప్పుడు, తాజా క్రీమ్ను కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా వేసి అలంకరిస్తే బాగుంటుంది. ♦ ఐస్ క్రీమ్స్ మీద క్రంచీ వేఫర్స్, డ్రై నట్స్ తరుగుతో అలంకరిస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. ♦ కెబాబ్స్, స్టార్టర్స్లను కీర, క్యారట్, ఉల్లి చక్రాలు, నిమ్మ చెక్కలు, ఉల్లికాడల వంటి కూరలతో అలంకరించాలి. వీటితో కలిపి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. – డా. బి. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్) చోలే పనీర్ మసాలా కావలసినవి: కాబూలీ సెనగలు – ఒక కప్పు; బిర్యానీ ఆకు – ఒకటి; దాల్చిన చెక్క – చిన్న ముక్క; నల్ల ఏలకులు – 2; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఎండు ఉసిరిక – మూడు ముక్కలు; చోలే పనీర్ గ్రేవీ కోసం కావలసినవి... ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ముప్పావు కప్పు; పనీర్ – 150 గ్రా.; పచ్చి మిర్చి – 3; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; కసూరీ మేథీ – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. గార్నిషింగ్ కోసం... కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క తయారీ: ♦ కాబూలీ సెనగలను ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి ♦ నానిన సెనగలను మరుసటి రోజు రెండు మూడు సార్లు బాగా కడిగి, తగినన్ని నీళ్లు, ఉప్పు, ఏలకులు, దాల్చిన చెక్క, ఎండు ఉసిరిక, బిర్యానీ ఆకు, అల్లం ముద్ద జత చేసి కుకర్లో ఉంచి పది విజిల్స్వ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ♦ మూత తీశాక ఎండు ఉసిరిక ముక్కలను వేరు చేయాలి. పనీర్ మసాలా తయారీ: ♦ స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ♦ అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ♦ టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడేవరకు బాగా కలపాలి ♦ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరప కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపాలి ♦ ఉడికించిన సెనగలను జత చేసి మరోమారు బాగా కలిపి, పచ్చి మిర్చి తరుగు, ఒక కప్పుడు ఉడికించిన సెగనల నీరు పోసి బాగా కలపాలి ∙ ♦ గ్రేవీ బాగా చిక్కబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ♦ (కొన్ని సెనగలను గరిటెతో మెత్తగా అయ్యేలా చిదిమితే, గ్రేవీ త్వరగా చిక్కబడుతుంది) ♦ పనీర్ ముక్కలు, కసూరీ మేథీ, ఆమ్ చూర్ పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి ♦ కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలతో గార్నిష్ చేయాలి ♦ రోటీలు, పూరీలు, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. -
హాయిగా.. షి‘కారు’గా..!
ఆహా అనిపిస్తున్న కార్ల ముస్తాబు ట్రాకింగ్, ఆన్డ్రాయిడ్ సదుపాయాలు అదరగొట్టేమ్యూజిక్సిస్టమ్స్ కరీంనగర్ బిజినెస్ : కారు ఉంటే ఆ స్టేటస్ వేరు. అయితే ఆ కారులో అందమైన వస్తువులను ఏర్పాటు చేసుకుంటే ఆ స్టేటస్ మరింత పెరుగుతుంది. కుషన్లా సీటు కవర్లు..బోర్ కొడితే మ్యూజిక్..సెల్ఫోన్ చార్జింగ్ లేకుంటే చార్జర్స్..మనస్సుకు నచ్చే పర్ఫ్యూమ్స్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి. సీట్ కవర్స్ నుంచి రివర్స్ కెమెరా విత్మానిటర్ వరకు ప్రతీది ప్రత్యేకమే. సీటు కవర్ల నుంచి మెుదలుకొని సెంట్రల్లాకింగ్, రివర్స్కెమెరా విత్ మానిటర్, ఆండ్రాయిడ్ మానిటరింగ్ సిస్టం, ట్రాకింగ్ సిస్టం వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అవసరాల కోసం కొన్ని, సౌకర్యవంతం కోసం మరికొన్ని వస్తువులు వాడుతున్నారు. లక్షలు విలువ చేసి కార్లు కొనుకున్నవారు దానికి తగ్గట్టుగా లుకింగ్ ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డోర్ వ్యాండిల్స్, వీల్ క్యాప్స్, గ్రాఫిక్ స్టిక్కర్లు, పాలీష్క్లాత్స్.. ఇలా బయట నుంచి చూడ్డానికి అందంగా కనిపించే పలు వస్తువులను కారులో ఉంచుకుంటున్నారు. సౌకర్యవంతంగా కారు డెకార్స్కి సంబంధించిన వాటిలో ముఖ్యమైనవి సీట్కవర్స్, సెంట్రల్లాకింగ్ సిస్టమ్, పవర్విండోస్ సిస్టమ్, మెుబైల్ చార్జర్, ట్రాకింగ్సిస్టం వంటివి ఉండడం ద్వారా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కంపెనీ నుంచి వచ్చిన కారుకు మనకు నచ్చిన రంగుల సీట్కవర్స్ వేసుకోవచ్చు. కారు ఆగిన ప్రతీసారి అన్ని డోర్లు లాక్ చేసే ఇబ్బందిలేకుండా సెంట్రల్ లాకింగ్సిస్టమ్తో ఒకే లాక్ చేసుకోవచ్చు. పవర్ విండోస్ సిస్టమ్తో అన్ని డోర్ల విండోస్ ఒకేసారి పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. మొబైల్ చార్జర్ ద్వారా ప్రయాణించే సమయంలోనూ సెల్ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ సిస్టం ద్వారా మొబైల్లో లభించే సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ట్రాకింగ్ డివైస్ ద్వారా అందులో ఉన్న సిమ్కార్డు సాయంతో కారు ఏ ప్రదేశంలో ఉంది, ఎక్కడి నుంచి ఎటు ప్రయాణిస్తుందనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మ్యూజిక్.. మ్యాజిక్ దూరప్రయాణాలు చేసే సమయంలో బోర్గా ఫీల్కాకుండా ఉండేందుకు అధునాతన మ్యూజిక్ సిస్టమ్స్ వచ్చాయి. మ్యూజిక్ వింటూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయెుచ్చు. పర్ఫ్యూమ్స్ కారులో ప్రయాణించేటప్పుడు చెమట, సీట్ల వాసన రాకుండా ఉండేందుకు బోలెడన్నీ పర్ఫ్యూమ్స్ అందుబాటులోకి వచ్చాయి. కారు ఆగి ఉన్నప్పుడ విండోస్ మూసి ఉంటే తెరవగానే దుర్వాసన వస్తుంటుంది. ఇదే కాకుండా వర్షం, ఉబ్బరపోత ఉన్న పరిస్థితుల్లోనూ దుర్వాసన రావడం సహజం. ఇలాంటి సమయంలో పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు. నచ్చిన ఫ్లేవర్లో ఏర్పాటు చేసుకోవచ్చు. రివర్స్ కెమెరా మానిటర్ కారు వెనుకకు వెళ్లినప్పుడు వెనుకవైపు ఉన్న వస్తువులను చూడడం చాలా కష్టం. ఇలాంటి కష్టాలను తొలగించేందుకు రివర్స్కెమెరా విత్ మానిటర్ అందుబాటులోకి వచ్చాయి. లక్షలు ఖర్చుపెట్టి కారుకొనుగోలు చేసి వెనుకకు తీసినప్పుడు పొరపాటున దేనికైనా తాకితే పాడయిపోతుందనే భయం లేకుండా ఎంచక్కా మానిటర్లో చూస్తూ రివర్స్ తీసుకోవచ్చు. గతంలో సాధరణమైనవి లభించగా.. ప్రస్తుతం హె చ్డీ క్లారిటీ మానిటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో వస్తువులు స్పీకర్స్, ప్లేయర్స్, ఆటోగ్రాఫిక్స్, మొబైల్చార్జర్, పాలీష్క్లాత్, సీట్బెల్ట్స్, డోర్గాడ్స్, షోప్లాగ్స్, ఫర్ప్యూమ్స్, వూఫర్ ఆంప్లిఫయర్, గాడ్ ఐడిల్స్, హారన్లు, మ్యాక్వీల్స్, బాడీకవర్స్, సీడీ, డీవీడీప్లేయర్స్, వీల్క్యాప్స్, రివర్స్కెమెరా విత్ మానిటర్, సెంట్రల్లాకింగ్, ట్రాకింగ్ సిస్టం, త్రీడీ డోర్మ్యాట్స్ పలు రకాల వస్తువులు లభిస్తున్నాయి. డెకొరేషన్ అవసరం –ఎస్కే ఖాద్రీ, అల్తాజ్ కార్డెకార్స్ యజమాని కార్లకు డెకొరేషన్ తప్పనసరి. మార్కెట్లోకి కొత్తగా చాలా వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ట్రాకింగ్ సిస్టం, ఆండ్రాయిడ్, హెచ్డీ రివర్సింగ్ మానిటర్, వూఫర్సిస్టమ్స్ కొత్తవి మార్కెట్లోకి వచ్చాయి. కార్ల వాడకం ఎక్కువవడంతో అందరికీ అవసరం పెరిగిపోతుంది.