-
ఆహా అనిపిస్తున్న కార్ల ముస్తాబు
-
ట్రాకింగ్, ఆన్‌డ్రాయిడ్ సదుపాయాలు
-
అదరగొట్టేమ్యూజిక్‌సిస్టమ్స్
కరీంనగర్ బిజినెస్ : కారు ఉంటే ఆ స్టేటస్ వేరు. అయితే ఆ కారులో అందమైన వస్తువులను ఏర్పాటు చేసుకుంటే ఆ స్టేటస్ మరింత పెరుగుతుంది. కుషన్‌లా సీటు కవర్లు..బోర్ కొడితే మ్యూజిక్..సెల్‌ఫోన్ చార్జింగ్ లేకుంటే చార్జర్స్..మనస్సుకు నచ్చే పర్‌ఫ్యూమ్స్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి. సీట్ కవర్స్ నుంచి రివర్స్ కెమెరా విత్‌మానిటర్ వరకు ప్రతీది ప్రత్యేకమే.
సీటు కవర్ల నుంచి మెుదలుకొని సెంట్రల్‌లాకింగ్, రివర్స్‌కెమెరా విత్ మానిటర్, ఆండ్రాయిడ్ మానిటరింగ్ సిస్టం, ట్రాకింగ్ సిస్టం వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అవసరాల కోసం కొన్ని, సౌకర్యవంతం కోసం మరికొన్ని వస్తువులు వాడుతున్నారు. లక్షలు విలువ చేసి కార్లు కొనుకున్నవారు దానికి తగ్గట్టుగా లుకింగ్ ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డోర్ వ్యాండిల్స్, వీల్ క్యాప్స్, గ్రాఫిక్ స్టిక్కర్లు, పాలీష్‌క్లాత్స్.. ఇలా బయట నుంచి చూడ్డానికి అందంగా కనిపించే పలు వస్తువులను కారులో ఉంచుకుంటున్నారు.
సౌకర్యవంతంగా
కారు డెకార్స్‌కి సంబంధించిన వాటిలో ముఖ్యమైనవి సీట్‌కవర్స్, సెంట్రల్‌లాకింగ్ సిస్టమ్, పవర్‌విండోస్ సిస్టమ్, మెుబైల్ చార్జర్, ట్రాకింగ్‌సిస్టం వంటివి ఉండడం ద్వారా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కంపెనీ నుంచి వచ్చిన కారుకు మనకు నచ్చిన రంగుల సీట్‌కవర్స్ వేసుకోవచ్చు. కారు ఆగిన ప్రతీసారి అన్ని డోర్లు లాక్ చేసే ఇబ్బందిలేకుండా సెంట్రల్ లాకింగ్‌సిస్టమ్‌తో ఒకే లాక్ చేసుకోవచ్చు. పవర్ విండోస్ సిస్టమ్‌తో అన్ని డోర్ల విండోస్ ఒకేసారి పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. మొబైల్ చార్జర్ ద్వారా ప్రయాణించే సమయంలోనూ సెల్‌ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ సిస్టం ద్వారా మొబైల్‌లో లభించే సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ట్రాకింగ్ డివైస్ ద్వారా అందులో ఉన్న సిమ్‌కార్డు సాయంతో కారు ఏ ప్రదేశంలో ఉంది, ఎక్కడి నుంచి ఎటు ప్రయాణిస్తుందనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మ్యూజిక్.. మ్యాజిక్
దూరప్రయాణాలు చేసే సమయంలో బోర్‌గా ఫీల్‌కాకుండా ఉండేందుకు అధునాతన మ్యూజిక్ సిస్టమ్స్ వచ్చాయి. మ్యూజిక్ వింటూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయెుచ్చు.
పర్‌ఫ్యూమ్స్
కారులో ప్రయాణించేటప్పుడు చెమట, సీట్ల వాసన రాకుండా ఉండేందుకు బోలెడన్నీ పర్‌ఫ్యూమ్స్ అందుబాటులోకి వచ్చాయి. కారు ఆగి ఉన్నప్పుడ విండోస్ మూసి ఉంటే తెరవగానే దుర్వాసన వస్తుంటుంది. ఇదే కాకుండా వర్షం, ఉబ్బరపోత ఉన్న పరిస్థితుల్లోనూ దుర్వాసన రావడం సహజం. ఇలాంటి సమయంలో పర్‌ఫ్యూమ్స్ వాడుతున్నారు. నచ్చిన ఫ్లేవర్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు.
రివర్స్ కెమెరా మానిటర్
కారు వెనుకకు వెళ్లినప్పుడు వెనుకవైపు ఉన్న వస్తువులను చూడడం చాలా కష్టం. ఇలాంటి కష్టాలను తొలగించేందుకు రివర్స్‌కెమెరా విత్ మానిటర్ అందుబాటులోకి వచ్చాయి. లక్షలు ఖర్చుపెట్టి కారుకొనుగోలు చేసి వెనుకకు తీసినప్పుడు పొరపాటున దేనికైనా తాకితే పాడయిపోతుందనే భయం లేకుండా ఎంచక్కా మానిటర్‌లో చూస్తూ రివర్స్ తీసుకోవచ్చు. గతంలో సాధరణమైనవి లభించగా.. ప్రస్తుతం హె చ్‌డీ క్లారిటీ మానిటర్లు అందుబాటులోకి వచ్చాయి.
ఎన్నో వస్తువులు
స్పీకర్స్, ప్లేయర్స్, ఆటోగ్రాఫిక్స్, మొబైల్‌చార్జర్, పాలీష్‌క్లాత్, సీట్‌బెల్ట్స్, డోర్‌గాడ్స్, షోప్లాగ్స్, ఫర్‌ప్యూమ్స్, వూఫర్ ఆంప్లిఫయర్, గాడ్ ఐడిల్స్, హారన్‌లు, మ్యాక్‌వీల్స్, బాడీకవర్స్, సీడీ, డీవీడీప్లేయర్స్, వీల్‌క్యాప్స్, రివర్స్‌కెమెరా విత్ మానిటర్, సెంట్రల్‌లాకింగ్, ట్రాకింగ్ సిస్టం, త్రీడీ డోర్‌మ్యాట్స్ పలు రకాల వస్తువులు లభిస్తున్నాయి.
డెకొరేషన్ అవసరం
–ఎస్‌కే ఖాద్రీ, అల్‌తాజ్ కార్‌డెకార్స్ యజమాని
కార్లకు డెకొరేషన్ తప్పనసరి. మార్కెట్‌లోకి కొత్తగా చాలా వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ట్రాకింగ్ సిస్టం, ఆండ్రాయిడ్, హెచ్‌డీ రివర్సింగ్ మానిటర్, వూఫర్‌సిస్టమ్స్ కొత్తవి మార్కెట్లోకి వచ్చాయి. కార్ల వాడకం ఎక్కువవడంతో అందరికీ అవసరం పెరిగిపోతుంది.