Deep Das Gupta
-
'బాబర్ చాలా సింపుల్‌గా ఉంటాడు.. కానీ బ్యాటింగ్ మాత్రం అద్భుతం'
ఆసియాకప్-2023లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌ల ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. పాకిస్తాన్ 342 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో బాబర్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ త్వరగా ఔటైనప్పటికీ బాబర్.. ఇఫ్తికర్ అహ్మద్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్ చిత్తు చేసింది. బాబర్‌పై ప్రశంసల జల్లు.. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజంపై భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా ప్రశంసల వర్షం కురిపించాడు. దీప్ దాస్‌గుప్తా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో దీప్‌దాస్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. "బాబర్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటాడు. కానీ అతడు బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అతడొక కవి లాంటి వాడు. కవి ఎలా అయితే తన రిథమ్‌ను కొనసాగిస్తాడో ఆజం కూడా అంతే. అతడు నేపాల్ వంటి చిన్న జట్టుపై సెంచరీ చేశాడని మనం తక్కువగా చూడకూడదు. ఎందుకంటే వారు కూడా 40వ ఓవర్ వరకు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముల్తాన్ వికెట్ కూడా అంత ఈజీగా లేదు. వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. ఇటువంటి పరిస్ధితుల్లో బాబర్ చాలా కష్టపడ్డాడు. అతడు తీవ్రంగా శ్రమించి సెంచరీ సాధించాడు. బాబర్ ఏజట్టుతో అయినా ఒకే విధంగా ఆడుతాడు. అతడికి పరుగులు చేయాలనే ఆకలి ఎక్కువ అని దీప్‌దాస్ గుప్తా పాక్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు బిగ్‌షాక్! ఇక అంతే సంగతి -
WC 2022: ఓపెనర్‌గా పంత్, ఇషాన్.. సూర్య కాదు! అతడే సరైనోడు!
T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు పంపాల్సిన జట్ల ఎంపిక విషయంలో ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కసరత్తులు చేస్తున్నాయి. ఇక యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వేళ భారత జట్టు ఎంపిక.. సెలక్టర్లకు పెద్ద తలనొప్పిలా మారిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీపై పెద్ద చర్చే నడుస్తోంది. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడంతో ఇటీవలి సిరీస్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగారు. మరోవైపు.. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్‌తో వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ సైతం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ స్థానానికి పోటీలో ఉండనే ఉన్నారు. అతడే సరైనోడు! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్- రాహుల్ జోడీకి థర్డ్ ఛాయిస్ ఓపెనర్‌గా పృథ్వీ షా పేరును అతడు సూచించాడు. ప్రతిభ, అద్బుత నైపుణ్యాలు అతడి సొంతమని.. కాబట్టి అతడిని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు. ఈ మేరకు క్రిక్‌ట్రాకర్‌తో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘టీ20 వరల్డ్‌కప్‌నకు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్- రోహిత్ శర్మకే నా మొదటి ప్రాధాన్యం. మూడో ఓపెనర్‌గా పృథ్వీ షా వంటి ప్రతిభ గల ఆటగాడు ఉంటే బెటర్. వైవిధ్యమైన ఆటతో ఆకట్టుకుంటాడు. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. 70,80, 100 బాదకపోయినా.. శుభారంభం మాత్రం అందించగలడు’’ అని దీప్‌దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు. పాపం.. ఏడాది అవుతోంది! స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఆటగాడు పృథ్వీ షా గతేడాది శ్రీలంక పర్యటనలో ఆఖరి సారిగా టీమిండియా తరఫున ఆడాడు. ఏడాది కాలంగా అతడికి ఏ సిరీస్‌లోనూ సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ టోర్నీలో ముంబైకి సారథిగా వ్యవహరించిన పృథ్వీ షా.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా 10 మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేశాడు. అయినప్పటికీ బీసీసీఐ నుంచి మాత్రం అతడు పిలుపు అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో దీప్‌దాస్ గుప్తా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తరచుగా ఓపెనర్లను మార్చడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. రానున్న ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగానే ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపాడు. చదవండి: SreeShankar Won Silver CWG 2022: మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్? -
IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే!
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడితే కాసుల వర్షం కురవడమే కాదు.. ఒక్కసారి తమను తాము నిరూపించుకుంటే జాతీయ జట్టు తరఫున ఆడే ఛాన్స్ వస్తుందన్న నమ్మకాన్ని ఆటగాళ్లలో నింపింది. ఇక ప్రతి ఏడాది సీజన్ ముగింపు సమయంలో టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచిన యువ క్రికెటర్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారన్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ సహా అక్షర్ పటేల్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ తదితర భారత ఆటగాళ్లు ఈ అవార్డు అందుకున్నారు. ఇక గత రెండు సీజన్లలో దేవ్‌దత్ పడిక్కల్(2020), రుతురాజ్ గైక్వాడ్(2021) వరుసగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. అదే విధంగా ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న ఒకే ఒక విదేశీ ప్లేయర్‌గా ముస్తాఫిజుర్ రెహమాన్(2016) తన పేరును పదిలం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్-2022 సీజన్లో ఆయుష్ బదోని, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, అనూజ్ రావత్ తదితర ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎవరు నిలుస్తారన్న అంశంపై అంచనా వేశాడు. ఈ మేరకు క్రిక్‌ట్రాకర్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ ఈ ఏడాదితో ఐపీఎల్‌ను మొదలుపెట్టిన ఆటగాళ్లనే పరిగణనలోకి తీసుకుంటాను. తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం రాణిస్తున్నాడు. అయితే అతడు ఎప్పటి నుంచో ఆడుతున్నాడు కాబట్టి పక్కన పెడుతున్నా. నా అభిప్రాయం ప్రకారం ఆయుష్ బదోని ఈసారి ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలుస్తాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బదోని.. 8 మ్యాచ్‌లలో కలిపి 134 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 54. గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 41 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. అంతేగాక ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడతున్న అతడు ఇప్పటి వరకు 272 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2022లో ముంబై బ్యాటర్లలో ఇప్పటి వరకు అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. కాగా మెగా వేలం-2022లో భాగంగా లక్నో బదోనిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేయగా.. ముంబై తిలక్ కోసం ఏకంగా 1.7 కోట్లు ఖర్చు చేసింది. చదవండి👉🏾RCB Vs RR: మొన్న 68 పరుగులకే ఆలౌట్.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ధోనీ కోసం గంగూలీని పది రోజులు బతిమాలాను..
ముంబై: టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కోసం నాటి ఈస్ట్ జోన్ సారధి సౌరవ్ గంగూలీని పది రోజుల పాటు బతిమాలానని భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే వెల్లడించాడు. 2003-04 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దీప్‌దాస్ గుప్తా బదులు ధోనీని ఆడించేందుకు చాలా ప్రయాసపడ్డానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ, దీప్‌దాస్ గుప్తా ఇద్దరు బెంగాల్‌కు చెందిన వారే అని తెలిసి కూడా గంగూలీని ఒప్పించేందుకు ప్రయత్నించానని, చివరకు గంగూలీ ఒప్పుకోవడం.. ధోనీ జట్టులోకి రావడం చకచకా జరిగిపోయాయని పేర్కొన్నాడు. అంతకుముందు ఓ స్నేహితుడు చెప్పడంతో ధోనీ ఆటను చూడటానికి తాను ప్రత్యక్షంగా వెళ్లానని, ఆ మ్యాచ్‌లో జట్టు మొత్తం 170 పరుగులు చేస్తే, ధోని ఒక్కడే 130 పరుగులు సాధించాడని మోరే తెలిపాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్లపై ధోనీ విరుచుకుపడిన తీరు చూసి చాలా ముచ్చటేసిందని, అందుకే అతన్ని దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఎలాగైనా ఆడించాలని కంకణం కట్టుకున్నాని వివరించాడు. ఎట్టకేలకు గంగూలీని ఒప్పించాక ఫైనల్స్ బరిలో దిగిన ధోనీ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 పరుగులు చేసి సత్తా చాటాడన్నాడు. దీంతో ఆ వెంటనే ధోనీని ఇండియా ఎ తరఫున కెన్యాలో జరిగిన ట్రయాంగిల్ టోర్నీకి పంపించామని, ఆ టోర్నీయే అతని కెరీర్‌ను మలుపు తిప్పిందని మోరే చెప్పుకొచ్చాడు. అందులో ధోనీ ఏకంగా 600 పరుగులు సాధించి, జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడని వెల్లడించాడు. ఆ సమయంలో (2003 వన్డే ప్రపంచకప్ తర్వాత) టీమిండియాకు రెగ్యులర్ వికెట్ కీపర్ లేకపోవడం ధోనీకి మరింత కలిసొచ్చిందని, అందివచ్చిన అవకాశాలకు అతను ఒడిసి పట్టుకుని భారత దేశం గర్వించే స్థాయికి ఎదిగాడంటూ ధోనీపై మోరే ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడానికి నాటి చీఫ్ సెలక్టర్ మోరే చాలా సహయపడ్డాడని ధోనీ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. చదవండి: ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు.. -
సెలక్టర్‌గా దీప్‌దాస్ గుప్తా!
న్యూఢిల్లీ : భారత మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా భారత జట్టు సెలక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈస్ట్‌జోన్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సాబా కరీం పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. అతడి స్థానంలో ఈసారి ఈస్ట్ జోన్ తరఫున సెలక్టర్ అభ్యర్థిని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో రేసులో దీప్‌దాస్ గుప్తా గట్టి అభ్యర్థిగా ఉండగా... మరోవైపు బెంగాల్ మాజీ కెప్టెన్ దేవాంగ్ గాంధీ పేరు కూడా పరిశీలనలో ఉంది. దాల్మియా, గంగూలీ కలిసి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.