ఆసియాకప్-2023లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌ల ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు.
పాకిస్తాన్ 342 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో బాబర్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ త్వరగా ఔటైనప్పటికీ బాబర్.. ఇఫ్తికర్ అహ్మద్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్ చిత్తు చేసింది.
బాబర్‌పై ప్రశంసల జల్లు..
ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజంపై భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా ప్రశంసల వర్షం కురిపించాడు. దీప్ దాస్‌గుప్తా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో దీప్‌దాస్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. "బాబర్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటాడు. కానీ అతడు బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అతడొక కవి లాంటి వాడు. కవి ఎలా అయితే తన రిథమ్‌ను కొనసాగిస్తాడో ఆజం కూడా అంతే.
అతడు నేపాల్ వంటి చిన్న జట్టుపై సెంచరీ చేశాడని మనం తక్కువగా చూడకూడదు. ఎందుకంటే వారు కూడా 40వ ఓవర్ వరకు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముల్తాన్ వికెట్ కూడా అంత ఈజీగా లేదు. వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. ఇటువంటి పరిస్ధితుల్లో బాబర్ చాలా కష్టపడ్డాడు. అతడు తీవ్రంగా శ్రమించి సెంచరీ సాధించాడు. బాబర్ ఏజట్టుతో అయినా ఒకే విధంగా ఆడుతాడు. అతడికి పరుగులు చేయాలనే ఆకలి ఎక్కువ అని దీప్‌దాస్ గుప్తా పాక్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు బిగ్‌షాక్! ఇక అంతే సంగతి
Comments
Please login to add a commentAdd a comment