కృష్ణపట్నం లైన్‌కు రెడ్ సిగ్నల్!
⇒ ఆగిన టన్నెల్ నిర్మాణంతో సాగని పనులు
⇒ చేతులె త్తేసిన ముంబయి నిర్మాణ సంస్థ
⇒ మళ్లీ టెండర్లకు సన్నాహాలు
⇒ రూ400 కోట్లతో టన్నెల్ నిర్మాణం అంచనా
రాజంపేట: ఓబులవారిపల్లె- కృష్ణపట్నం రైల్వేలైన్ పూర్తికి టన్నెల్ నిర్మాణమే అడ్డంకిగా మారింది. 8 ఏళ్లుగా ఈ రైల్వే లైను పనులు సాగుతున్నాయి. టన్నెల్ నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఈ మార్గం పూర్తికి గ్ర హణం పట్టింది. కృష్ణపట్నం- ఓబులవారిపల్లె రైలుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మితం కావాల్సి ఉంది. అయితే 18/66 కెఎం వద్ద 5.50 కిలోమీటర్లు, మరికొంత దూరంలో 1.50 కిలోమీటర్ల మేర టన్నెల్ వేయాల్సి ఉంది. 2007లో ముంబాయికు చెందిన దీపికా నిర్మాణ సంస్ధ రూ.400 కోట్ల అంచనాలతో దీని పనులు మొదలుపెట్టింది. పనులు చేసే విషయంలో నిబంధనలకు, వాస్తవ పరిస్థితికి మధ్య తేడాలు రావడంతో ఆ సంస్థ పనులను ఆపేసింది. ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు పాతరేట్లతో పనులు కొనసాగిస్తే తాము నష్టపోతామని ఆ సంస్ధ చేతులెత్తిసింది.
కృష్ణపట్నం రైలుమార్గం తీరు ఇలా..
113 కిలోమీటర్ల మేరకు కలిగిన కృష్ణపట్నం రైల్వేలైన్ 2005-2006లో మంజూరు అయింది. రూ.930కోట్ల అంచనాతో రైల్వేనిర్మాణ పనులు మొదలైంది. ఇప్పుడు అంచనా వ్యయం భారీగానే పెరిగిపోయింది. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ నుంచి నేతివారిపల్లె వరకు రైలుపట్టాలు వేసేందుకు అవసరమైన ఎర్త్ వర్క్‌ను పూర్తిచేశారు. ఇక ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో టన్నెల్ ఉంది. 17 కిలోమీటర్ల మేర ఎర్త్ వర్క్ పనులు పూర్తి చేశారు.
38 చిన్న వంతెనెలు, 8 పెద్ద వంతెనలు పూర్తికావచ్చాయి. ఈ మార్గంలో మొత్తం మూడు రీచ్‌లు ఉన్నాయి. 1-17, 17 -35, 35-97 కిలోమీటర్ల మేర ఈ రీచ్‌లో ఉన్నాయి. 35-97 రీచ్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ రీచ్‌లో పనులు త్వరితగతిని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలో రైలుమార్గానికి సంబంధించి ఎర్త్ పనులు శరవేగంతో జరుగుతున్నా టన్నెల్ పనులు చేపట్టడమే రైల్‌వికాస్‌నిగమ్‌లిమిటెడ్ సంస్ధకు తలకు మించిన భారంగా మారింది.
కాగా చెన్నై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సీపీఎం (చీఫ్‌ప్రాజెక్టు మేనేజరు) ప్రదీప్‌గౌర్ 0-17 కిలోమీటర్ల మధ్య పూర్తికావస్తున్న ఎర్త్‌వర్క్ పనులను ఇటీవల పరిశీలించారు. టన్నెల్ నిర్మాణం పూర్తిచేసేందుకు మళ్లీ టెండర్లను పిలువనున్నట్లు చెప్పారు. ఈ పనులు దక్కించుకునే సంస్ధ అయినా సకాలంలో టన్నెల్ పూర్తి చేయగలితే రెండేళ్లలో కృష్ణపట్నం రైలుమార్గం అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గం పూర్తరుుతే బొగ్గు, ఇనుపరారుు ఎగుమతి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాజధానికి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం మార్గాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.