Deer attack
-
నగ్నంగా బీచ్‌లో.. ఊహించని ఘటనతో పరుగో పరుగు
ఒక పక్క కొత్త వేరియెంట్ల విజృంభణ. మరోవైపు లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపు. అనవసరంగా బయట అడుగుపెట్టొద్దనే ఆదేశాలు. అయినా కూడా ఆస్ట్రేలియాలో ఆదేశాల్ని పెడచెవిన పెట్టి నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ విచిత్రమైన ఘటనలో ఇద్దరికి మొట్టికాయలు వేశారు అధికారులు. సౌత్‌వేల్స్: సౌత్ సిడ్నికీ చెందిన ఇద్దరు వ్యక్తులు.. సన్‌బాత్ కోసమని ఆదివారం మధ్యాహ్నాం దగ్గర్లోని బీచ్‌కు చేరుకున్నారు. నగ్నంగా ఒడ్డున కూర్చుని సూర్య కాంతిని ఆస్వాదిస్తున్నారు. ఆ టైంలో ఎటునుంచి వచ్చిందో తెలియదుగానీ.. ఓ దుప్పి వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అంతే.. దానిని చూడగానే వాళ్ల గుండెలు జారిపోయాయి. అక్కడి నుంచి పరుగులు అందుకున్నారు. వాళ్లను తరుముతూ అది వెనకాలే వెళ్లింది. ఆ కంగారులో పక్కనే ఉన్న రాయల్ నేషనల్ పార్క్‌లోకి దౌడు తీశారు వాళ్లిద్దరూ. ఇక వాళ్ల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రంతా గాలించి ఆ వ్యక్తుల్ని (ఒకరి వయసు 30, మరొకరి వయసు 49) ఆచూకీ కనిపెట్టగలిగారు. ఇద్దరూ ఓ చెట్టు మీద దాక్కుని రక్షించమని కేకలు వేస్తున్నారు. ‘ఇలాంటి మూర్ఖులను ఎలాంటి చట్టాలతో అడ్డుకోవాలో అర్థం కావట్లేదు’ అని సౌత్ వేల్స్ పోలీస్ కమిషన్ మిక్ ఫుల్లర్ వ్యాఖ్యానించాడు. కరోనా ఉల్లంఘనల నేరం కింద ఇద్దరికీ 760 డాలర్ల ఫైన్ విధించారు. సౌత్ వేల్స్ స్టేట్‌లో కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సౌత్ వేల్స్లో 40మందికి జరిమానాలు విధించారు అధికారులు. చదవండి: పాత ఎఫైర్.. తన పేషీలోని జాబ్.. మంత్రి రాసలీలలు -
‘లేడీ’ లేడీతో ఢీ అంటోన్న ఫొటో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : నీలి రంగు గౌను ధరించిన పడుచమ్మాయి ఇటీవల లండన్‌లోని రిచ్మండ్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఎండు గడ్డిలో గంతులేస్తోన్న జింకను చూసి ముచ్చటపడ్డారు. సోషల్ మీడియా ‘ఇన్స్టాగ్రామ్’ కోసం ఓ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అది మీదకు దూసుకురావడంతో ఆ అమ్మాయి హఠాత్తుగా వెనుతిరిగారు. ఆమెకు సెల్ఫీ ముచ్చట తీరిందో, లేదోగానీ ఈ దశ్యాన్ని మాత్రం ఫొటో తీసిన రాయల్ పార్క్ పోలీసులు దాన్ని అక్టోబర్ 11వ తేదీన పోస్ట్ చేశారు. ‘పార్క్‌లో తిరుగుతున్న ఆ జింక ‘డిస్నీ’ సిరీస్‌లోని బాంబి క్యారెక్టర్ లాంటిది కాదు. పైగా దానికి ఇప్పుడు ‘మేటింగ్ సీజన్’. అది క్రూరంగా దాడి చేస్తుంది. కనుక జింకలకు కనీసం 50 మీటర్లు దూరంగా ఉండండి’ అంటూ రాయల్ పార్క్ పోలీసులు ఓ హెచ్చరిక చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ ఫొటో కింద హెచ్చరికను చూసే చూసినవారంతా నవ్వుకుంటున్నారు. జింక ఫోజు చూస్తే దాడి చేస్తున్నట్లు లేదు. ఆ కళ్లలో క్రూరత్వం అసలు కనిపించడం లేదు. ఆ అమ్మాయి ఫొటోను చూస్తుంటే భయపడి పోయి బిక్క చచ్చి పోయినట్లు కనిపించడం లేదు. సరదాగే అలా ఫోజించినట్లు కనిపిస్తోంది.. అంటూ సోషల్ మీడియా యూజర్లు వ్యాఖ్యానాలతోపాటు ఉద్దేశపూర్వకంగానే రాయల్ పార్క్ పోలీసులు అలా ఫోటో తీశారేమోననే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. -
జింకల దాడితో.. పంటలు నాశనం
వల్లూరు: రబీలో సాగు చేసిన పంటలపై జింకలు దాడులు చేసి నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు చేసిన పంట మొలకెత్తక ముందే జింకలు తిని వేస్తుండటం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగుచేసిన పంటలు తమ కళ్లెదుటే నాశనమవుతుంటే ఏమి చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో పంటలను సాగు చేయలేక పోయిన రైతులు రబీలో నవంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ధనియాలు, బుడ్డ శనగ , నూగు , పెసర తదితర పంటలను సాగు చేశారు. మూడు మండలాల్లో తీవ్ర ఇబ్బందులు వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన ఈ పంటలపై జింకలు మందలు మందలుగా దాడులు చేసి తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. మొలకెత్తిన వెంటనే పంటను తిని వేస్తుండటంతో పలువురు రైతులు తిరిగి విత్తనం పూడుస్తున్నారు. ఆరేడేళ్లుగా జింకల సమస్య ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా సమస్య మరీ తీవ్రంగా మారింది. ఆ ఆశ అడియాసే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో మూడు మండలాల సరిహద్దుల్లో పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న విమానాశ్రయం ఆవరణలో సైతం జింకల మందలు తిరుగుతుండటంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయని అధికారులు గుర్తించారు. రన్‌వేపై జింకలు తిరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు జింకలను అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గత ఏడాది ప్రకటించారు. దీంతోనైనా తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశపడ్డారు. అయితే విమానాశ్రయం ప్రారంభానికి నోచుకోక పోవడంతో ఆ ఆశలు కూడా అడియాశలుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జింకలను అటవీ ప్రాంతాలలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.