defeated mlas
-
IPL 2022: సన్‌రైజర్స్ ఢమాల్
పుణే: సీజన్ తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి...ఆ తర్వాత కోలుకొని చక్కటి ప్రదర్శనతో వరుసగా ఐదు విజయాలు...ఇక ప్లే ఆఫ్స్ దారి సులువే అనుకుంటున్న తరుణంలో మళ్లీ పరాజయాల బాట...విజయాలలాగే వరుసగా ఐదో ఓటమితో అవకాశాలు సంక్లిష్టం! ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. శనివారం జరిగిన కీలక పోరులో హైదరాబాద్ 54 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడింది. తొలుత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. తర్వాత సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 32; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. రసెల్ మెరుపులు... ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (7) త్వరగానే అవుటైనా... నితీశ్ రాణా (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), అజింక్య రహానే (24 బంతుల్లో 28; 3 సిక్సర్లు) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను దారిలో పెట్టారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 55/1 స్కోరు చేసింది. అయితే తన తొలి ఓవర్లోనే నితీశ్, రహానేలను పెవిలియన్ చేర్చిన ఉమ్రాన్ తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15)ను అవుట్ చేశాడు. రింకూ సింగ్ (5) ఎల్బీగా నిష్క్రమించగా, బిల్లింగ్స్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆటలో దూకుడు కనిపించలేదు. 19వ ఓవర్లో చక్కటి బౌలింగ్‌తో భువనేశ్వర్ 6 పరుగులే ఇచ్చినా... వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్లో రసెల్ రెచ్చిపోయాడు. అతను 3 సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. పేలవ బ్యాటింగ్... ముందంజ వేసే అవకాశాలు మెరుగుపడాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అభిషేక్, మార్క్రమ్ మినహా అంతా విఫలమయ్యారు. చెత్త షాట్లతో రైజర్స్ ఆశల్ని ముంచేశారు. విలియమ్సన్ (9), రాహుల్ త్రిపాఠి (9)లతో పాటు మిడిలార్డర్లో పూరన్ (2), సుందర్ (4), శశాంక్ సింగ్ (11) ప్రభావం చూపలేకపోయారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (బి) జాన్సెన్ 7; రహానె (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 28; నితీశ్ (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 26; శ్రేయస్ (సి) త్రిపాఠి (బి) ఉమ్రాన్ 15; బిల్లింగ్స్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 34; రింకూ సింగ్ (ఎల్బీ) (బి) నటరాజన్ 5; రసెల్ నాటౌట్ 49; నరైన్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–17, 2–65, 3–72, 4–83, 5–94, 6–157. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–1, జాన్సెన్ 4–0–30–1, నటరాజన్ 4–0–43–1, సుందర్ 4–0–40–0, ఉమ్రాన్ మలిక్ 4–0–33–3. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) బిల్లింగ్స్ (బి) వరుణ్ 43; విలియమ్సన్ (బి) రసెల్ 9; త్రిపాఠి (సి) అండ్ (బి) సౌతీ 9; మార్క్రమ్ (బి) ఉమేశ్ 32; పూరన్ (సి) అండ్ (బి) నరైన్ 2; సుందర్ (సి) వెంకటేశ్ (బి) రసెల్ 4; శశాంక్ (సి) శ్రేయస్ (బి) సౌతీ 11; జాన్సెన్ (సి) బిల్లింగ్స్ (బి) రసెల్ 1; భువనేశ్వర్ నాటౌట్ 6; ఉమ్రాన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–30, 2–54, 3–72, 4–76, 5–99, 6–107, 7–113, 8–113. బౌలింగ్: ఉమేశ్ 4–0–19–1, సౌతీ 4–0–23–2, నరైన్ 4–0–34–1, రసెల్ 4–0–22–3, వరుణ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ X రాజస్తాన్ రాయల్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
హైకోర్ట్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊరట..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనానికి ముందు తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన వారందరికీ నోటీసులు ఇవ్వాలంటూ హై కోర్టులో వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. పార్టీ మారిన వారిని అనర్హలుగా ప్రకటించాలంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి గతంలో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎల్పీని, టీఆర్ఎస్లో విలీనం చేసే కుట్ర జరుగుతుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, జాజుల సురేందర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు శాసన మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌స్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ షబ్బీర్ అలీ గతంలో హై కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ను కూడా విచారించిన కోర్టు మండలి ఛైర్మన్, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. దాంతో పాటు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎం.ఎస్ ప్రభాకర్‌రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. -
‘వైఎస్ జగన్‌కు ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు’
-
‘వైఎస్ జగన్‌కు ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు’
విశాఖ : పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా సమర్థించుకున్నారు. ఫిరాయింపులు తనకోసం కాదని... రాష్ట్ర భవిష్యత్ కోసం అంటూ కొత్త భాష్యం చెప్పారు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులు కొత్తగా జరిగాయా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. అసలు వైఎస్ జగన్‌కు ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఫిరాయింపులపై ఎలా ఫిర్యాదు చేస్తారని ఆయన ఎదురుదాడి చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. నరేంద్ర మోదీని చూసి చాలామంది యువత బీజేపీలో చేరారని, అలాగే ఇక్కడ తనను చూసి చాలామంది టీడీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇస్తూ...‘గవర్నర్‌ను వైఎస్ జగన్ కలిసిన తర్వాతనే ఆపార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. పార్టీని విభేదించిన వారంతా టీడీపీలోకి వచ్చారు. పార్టీ ఫిరాయింపులు కొత్తగా జరిగాయా?. ఎన్డీయేలో ఎన్ని పార్టీలు ఉన్నాయి?. రాజ్యాంగం ప్రకారం సీఎం ఎవర్ని కోరుకుంటే వారిని మంత్రిగా తీసుకోవచ్చు. అనర్హత అనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. గత చరిత్రలో వాళ్లు ఎన్నిసార్లు మనుషులను తీసుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకోలేదా?. అప్పుడు మీకు ఆనందం, ఇప్పుడు విభేదిస్తే మీకు బాధా?. విలువలు, చట్టాలపై చర్చ చేద్దాం.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. త్వరలో విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి టెండర్లు పిలుస్తామని చంద్రబాబు తెలిపారు. -
అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను
-
అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను: చంద్రబాబు
విశాఖ : పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు నోరు విప్పారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, అది మంచిదే అని ఆయన అన్నారు. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్లోకి వెళ్లేటప్పుడు తాను ఫిరాయింపులపై మాట్లాడానని, అయితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని చంద్రబాబు సమర్థించుకున్నారు. ఫిరాయింపుదారుల రాజీనామాలు స్పీకర్ పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించి తమ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేల్లో సమర్థులు ఉన్నారని, అందుకే వారికి మంత్రి పదవులు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో అందరికి న్యాయం చేయలేకపోయామన్నారు. (కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో నలుగురికి చంద్రబాబు కేబినెట్లో స్థానం కల్పించిన విషయం తెలిసిందే) రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ విస్తరణ జరిగిందన్నారు. మంత్రి పదవులు రానివారు అసంతృప్తికి గురి కావద్దని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రాజకీయాలు కాదని రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్నారు. అలాగే మంత్రుల పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష ఉంటుందన్నారు. ఇవాళ్టి నుంచి మంత్రుల పనితీరుపై పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. సింహాచలం పంచగ్రామల భూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా శనివారం ఆయన సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. అంతకు ముందు సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం... దేవస్థానంలో డార్మిటరీ కమ్ ఫంక్షన్ హాలు, తొలిపావంచా, కల్యాణమండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో విద్యాసంస్థలు, ఆస్పత్రులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారన్నారు. విశాఖను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, విశాఖలాంటి నగరం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. 2019లో నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని చంద్రబాబు అన్నారు. దేశంలోని ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలని, అలాగైతే అభివృద్ధికి ఆటంకం ఉండదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు వెంట మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవిని ఆశించిన బండారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులోనికి రాకుండా అజ్ఞాతంలో ఉన్నారు. జిల్లాలో సీఎం పర్యటనకు కూడా గైర్హాజరు అయ్యారు.