డిగ్రీలో సీఈసీ చదివాను!
► ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటర్వ్యూ వీడియో వైరల్
కర్నూలు: డిగ్రీలో సీఈసీ చదివానంటూ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరువక ముందే.. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిగ్రీలో సీఈసీ చదివానని చెప్పడం హాస్యాస్పదమైంది. ఓ చానెల్‌కు ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించి పోస్ట్ చేసిన ప్రొమో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇంటర్లో ఏ కోర్సు చేశారు అన్న ప్రశ్నకు.. ‘‘ఇంటర్లో మామూలుగా సివిక్స్, సివిల్.. మామూలుగా జనరల్. అప్పుడు ఎంపీటీసీలు, ఎంపీసీలు ఇవన్నీలేవు. జనరల్‌గా ఉండేది ఇంటర్మీడియట్. అప్పుడు ఇంటర్లో సీఈసీ లేదు. నేను డిగ్రీకి వచ్చాక సీఈసీ చేశాను’’ అని మోహన్‌రెడ్డి జవాబిచ్చారు. దీంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి డిగ్రీలో సీఈసీ ఉండదనడంతోనే.. ఎస్వీ మోహన్‌రెడ్డికి చెమటలు పట్టి టవల్‌తో తుడుచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంటర్, డిగ్రీలో ఏ సబ్జెక్టులుంటాయో తెలియని వ్యక్తులు మనకు నాయకులయ్యారా! అని చర్చించుకుంటున్నారు.