Delhi High Court notices
-
సందిగ్ధంలో ‘నిర్భయ’ దోషుల ఉరి
-
సందిగ్ధంలో ‘నిర్భయ’ దోషుల ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన అమలు కావాల్సిన ఉరిశిక్ష సందిగ్ధంలో పడింది. చట్టపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు నోటీసులు పంపింది. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ హైకోర్టు చేపట్టనున్న విచారణపైనే అందరి దృష్టి పడింది. ఇదే కేసులో దోషి అక్షయ్ వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. (జైల్లో లైంగికంగా వేధించారు) నిర్భయ దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా(సైన్ డై) వేయాలంటూ వారి తరఫున లాయర్ ఏపీ సింగ్ ఢిల్లీ హైకోర్టును కోరారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు అక్షయ్‌కు అవకాశముందని పేర్కొన్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించినందున నిబంధనల ప్రకారం మరో దోషి ముకేశ్‌కు మాదిరిగానే ఇతడికీ 14 రోజుల గడువివ్వాలని, అందుకు ఉరిశిక్షను వాయిదా వేయాలని కోరారు. నాలుగో దోషి పవన్ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయాల్సి ఉందన్నారు. ప్రత్యేక జడ్జి ఏకే జైన్ ఈ పిటిషన్‌పై 31వ తేదీ ఉదయం 10 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. (వంశంలో చివరి తలారి) మీరట్ నుంచి వచ్చిన తలారి ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత కొనసాగుతుండగానే మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ జల్లాద్ గురువారం తీహార్ జైలుకు చేరుకున్నారు. ఉరి సంబంధ సామగ్రిని పరిశీలించి, ఏర్పాట్లు చేసుకుంటాడని జైలు అధికారులు చెప్పారు. దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాలంటూ దిగువ కోర్టు వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. (ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి) -
ఎందుకు పింఛన్లు ఆపేశారు..
న్యూఢిల్లీ: వివిధ వర్గాలకు చెందిన సుమారు 45 వేల మందికి పింఛన్లను ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ృద్ధాప్య పింఛన్లను ఎంతమందికి మంజూరు చేశారు..వాస్తవానికి ఎంతమందికి అందుతున్నాయనే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆజ్ఞాపించింది. వివరాలిలా ఉన్నాయి. ఈడీఎంసీ పరిధిలో సుమారు 45 వేల మంది లబ్ధిదారులకు పింఛన్లను నిలిపివేస్తూ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. బాధితుల్లో ృద్ధులు, వితంతువులు, వికలాంగులు సైతం ఉన్నారు. కార్పొరేషన్ నిర్ణయంతో వీరికి పింఛను అందక ఇబ్బందులపాలవుతున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కోర్టు అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు.. ఎంతమందికి పింఛన్లు మంజూరయ్యాయి.. ఎంతమందికి అందుతున్నాయి.. తదితర వివరాలతో మార్చి 11వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఈడీఎంసీకి కోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే ఇదే విషయమై దక్షిణ, ఉత్తర కార్పొరేషన్లకు సైతం నోటీసులు జారీచేశామని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా, తమ వద్ద నిధులు లేకపోవడంతో పింఛన్ల చెల్లింపులు నిలిపివేసినట్లు కోర్టుకు ఈడీఎంసీ నివేదించింది. తాము పథకాన్ని నడపాల్సి ఉన్నప్పటికీ నిధుల లేమితో దాన్ని నడపలేకపోతున్నామని వివరించింది. 2013 ఏప్రిల్ వరకు మాత్రమే పింఛన్లను చెల్లించగలిగామని పేర్కొంది. నిధుల కోసం హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని తెలిపింది. కాగా, ఈడీఎంసీ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. వారి వాదనలు కంటితుడుపు చర్యలుగా ఉన్నాయని పేర్కొంది. అసలు ప్రస్తుతం ఎవరికి పింఛను చెల్లిస్తున్నారో వివరాలు ఇవ్వండి..’ అని కోర్టు ఆదేశించింది. కాగా, పిల్ వేసిన స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది అగర్వాల్ మాట్లాడుతూ.. నగరంలోని పత్పర్గంజ్, శశి గార్డెన్ సమీపంలోని మురికివాడను తమ సభ్యులు సందర్శించినప్పుడు.. పింఛను అందడం లేదని పలువురు ృద్ధులు, వితంతువులు, అంగ వికలాంగులు ఫిర్యాదుచేశారన్నారు. ఏడాదిగా తమకు పింఛన్లు రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, అసలు పింఛన్లు ఎందుకు ఆపేశారో కూడా తెలియని పరిస్థితి అని వారు వాపోయారని కోర్టుకు వివరించారు. కాగా, మొత్తం వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 11 వ తేదీకి వాయిదా వేసింది. డ్రగ్స్తోపట్టుబడిన వ్యక్తికి పదేళ్ల జైలు అర కిలో బరువైన హెరాయిన్‌ను తరలిస్తు పట్టుబడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ..అక్షరధామ్ మెట్రో స్టేషన్ సమీపంలో 2012 సెప్టెంబర్ 4 వ తేదీన అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అయిన జాకీర్ ను నార్కో టీం సభ్యులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అరకిలో బరువైన హెరాయిన్ పట్టుబడింది. దాంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవే శపెట్టగా న్యాయమూర్తి సదరు నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు. కాగా, తనపై పోలీసులు తప్పుడు కేసు బనాయించారన్న నిందితుడి వాదనను కేసు తిరస్కరించింది. -
ఏటీఎం పరిమితులపై ఆర్బీఐకి కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఏటీఎంలలో ఉచిత లావాదేవీలపై పరిమితుల విషయంలో రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎస్బీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులు తమ సొంత ఖాతాదారులపై అనవసర పన్నులు మోపుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ సహా ఆరు మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్ ఉచిత లావాదేవీలను బ్యాంకులు అయిదింటికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాతి అగర్వాల్ అనే అడ్వకేట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కొన్ని బ్యాంకులు, ఐబీఏ విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షమైనదని, సంస్కరణల స్ఫూర్తికి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు దేశాల్లో ఖాతాదారుల సొంత బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవని వివరించారు. దీంతో హైకోర్టు తాజా నోటీసులు ఇచ్చింది. ‘సొంత ఖాతాదారులపై అనవసర భారం ఎందుకు మోపుతున్నారు? తదుపరి విచారణ తేదీలోగా మీ వివరణ ఇవ్వండి’ అంటూ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.