న్యూఢిల్లీ: వివిధ వర్గాలకు చెందిన సుమారు 45 వేల మందికి పింఛన్లను ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ృద్ధాప్య పింఛన్లను ఎంతమందికి మంజూరు చేశారు..వాస్తవానికి ఎంతమందికి అందుతున్నాయనే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆజ్ఞాపించింది. వివరాలిలా ఉన్నాయి. ఈడీఎంసీ పరిధిలో సుమారు 45 వేల మంది లబ్ధిదారులకు పింఛన్లను నిలిపివేస్తూ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. బాధితుల్లో ృద్ధులు, వితంతువులు, వికలాంగులు సైతం ఉన్నారు. కార్పొరేషన్ నిర్ణయంతో వీరికి పింఛను అందక ఇబ్బందులపాలవుతున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కోర్టు అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు.. ఎంతమందికి పింఛన్లు మంజూరయ్యాయి..
ఎంతమందికి అందుతున్నాయి.. తదితర వివరాలతో మార్చి 11వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఈడీఎంసీకి కోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే ఇదే విషయమై దక్షిణ, ఉత్తర కార్పొరేషన్లకు సైతం నోటీసులు జారీచేశామని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా, తమ వద్ద నిధులు లేకపోవడంతో పింఛన్ల చెల్లింపులు నిలిపివేసినట్లు కోర్టుకు ఈడీఎంసీ నివేదించింది. తాము పథకాన్ని నడపాల్సి ఉన్నప్పటికీ నిధుల లేమితో దాన్ని నడపలేకపోతున్నామని వివరించింది. 2013 ఏప్రిల్ వరకు మాత్రమే పింఛన్లను చెల్లించగలిగామని పేర్కొంది. నిధుల కోసం హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని తెలిపింది. కాగా, ఈడీఎంసీ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
వారి వాదనలు కంటితుడుపు చర్యలుగా ఉన్నాయని పేర్కొంది. అసలు ప్రస్తుతం ఎవరికి పింఛను చెల్లిస్తున్నారో వివరాలు ఇవ్వండి..’ అని కోర్టు ఆదేశించింది. కాగా, పిల్ వేసిన స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది అగర్వాల్ మాట్లాడుతూ.. నగరంలోని పత్పర్‌గంజ్, శశి గార్డెన్ సమీపంలోని మురికివాడను తమ సభ్యులు సందర్శించినప్పుడు.. పింఛను అందడం లేదని పలువురు ృద్ధులు, వితంతువులు, అంగ వికలాంగులు ఫిర్యాదుచేశారన్నారు. ఏడాదిగా తమకు పింఛన్లు రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, అసలు పింఛన్లు ఎందుకు ఆపేశారో కూడా తెలియని పరిస్థితి అని వారు వాపోయారని కోర్టుకు వివరించారు. కాగా, మొత్తం వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 11 వ తేదీకి వాయిదా వేసింది.
డ్రగ్స్‌తోపట్టుబడిన వ్యక్తికి పదేళ్ల జైలు
అర కిలో బరువైన హెరాయిన్‌ను తరలిస్తు పట్టుబడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ..అక్షరధామ్ మెట్రో స్టేషన్ సమీపంలో 2012 సెప్టెంబర్ 4 వ తేదీన అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అయిన జాకీర్ ను నార్కో టీం సభ్యులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అరకిలో బరువైన హెరాయిన్ పట్టుబడింది. దాంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవే శపెట్టగా న్యాయమూర్తి సదరు నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు. కాగా, తనపై పోలీసులు తప్పుడు కేసు బనాయించారన్న నిందితుడి వాదనను కేసు తిరస్కరించింది.
ఎందుకు పింఛన్లు ఆపేశారు..
Published Wed, Jan 21 2015 11:38 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement