delhi ministers
-
సీఎం కేజ్రీవాల్‌కు శాఖ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం హస్తిన పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ తన కేబినెట్లోని ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది. తాను మాత్రం ఎటువంటి శాఖ తీసుకోలేదని సమాచారం. గత మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలక భూమిక పోషించిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లకు మళ్లీ కేబినెట్ పదవులు దక్కాయి. గత కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనీశ్ సిసోడియా.. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈసారి ఆయనకు ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాల శాఖ కేటాయించినట్టు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు 1. మనీశ్ సిసోడియా: ఆర్థిక, ప్రణాళిక, పర్యాటకం, భూమి-భవనాలు, విజిలెన్స్, సర్వీసెస్, కళలు, సంస్కృతి, భాషలు 2. ఇమ్రాన్ హుస్సేన్: అడవులు, ఆహార సరఫరా, ఎన్నికలు 3. కైలాస్ గహ్లోత్: రవాణా, రెవెన్యూ, న్యాయ, శాసన వ్యవహారాలు, ఐటీ, కార్యనిర్వాహక సంస్కరణలు 4. గోపాల్ రాయ్: పర్యావరణం 5. రాజేంద్ర పాల్ గౌతమ్: మహిళా, శిశు సంక్షేమం 6. సత్యేందర్ జైన్: ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) చదవండి: మోదీ ఆశీస్సులు కావాలంటున్న కేజ్రీవాల్ -
సైకిళ్లు, బస్సులు ఎక్కనున్న మంత్రులు!
⇒ కార్పూలింగ్లో వెళ్తానన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ⇒ రోజూ 10 లక్షల వాహనాలకు విశ్రాంతి ⇒ సరి-బేసి ప్రయోగంతో తగ్గనున్న ఢిల్లీ కాలుష్యం న్యూఢిల్లీ దేశరాజధాని నగరంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన సరి-బేసి కార్ల ప్రయోగంతో దాదాపు పది లక్షల వాహనాలకు విశ్రాంతి లభించనుంది. వీవీఐపీలకు మినహాయింపు ఉన్నా, స్వయంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రులు కూడా కార్ల వాడకాన్ని తగ్గించేందుకు కార్ పూలింగ్, ఇతర పద్ధతులు అవలంబిస్తున్నారు. సీఎం కేజ్రీవాల్.. తన సహచర మంత్రులు గోపాల్ రాయ్, సత్యేంద్ర జైన్‌లతో కలిసి ఒకే కారులో వెళ్లారు. సీఎం లైసెన్సు ప్లేటు నెంబరు బేసి సంఖ్యతో ముగుస్తుంది. దాంతో ఆయన తన కారును శుక్రవారం ఉపయోగించుకోవచ్చు. శనివారం మాత్రం ఆ కారు బయటకు తీయకూడదు. మరికొందరు మంత్రులు విభిన్న మార్గాలు అవలంబిస్తూ సచివాలయానికి వెళ్లనున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా సైకిల్ మీద వెళ్తానన్నారు. పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆటోలో ప్రయాణిస్తారు. సాంఘిక శాఖ మంత్రి సందీప్ కుమార్ బస్సులో గమ్యం చేరుకుంటారు. సరి-బేసి ప్రయోగం కారణంగా గమ్యాలకు చేరుకోవడం ఎవరికైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసేందుకు రెండు హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అవి.. 011-42400400, 011- 41400400. దాంతోపాటు @transportdelhi అనే ఐడీకి ట్విట్టర్ ద్వారా కూడా సందేశం పంపచ్చు. రాబోయే రెండు వారాల పాటు రోజు విడిచి రోజు మాత్రమే కార్లను బయటకు తీయాలి. ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే మహిళలు, వీవీఐపీలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్లు కాక.. తమకు కేటాయించని రోజులో ఎవరైనా వాహనం తీసినట్లు తెలిస్తే.. రూ. 2వేల జరిమానా విధిస్తారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులతో పాటు దాదాపు 7,500 మంది వలంటీర్లు కూడా ట్రాఫిక్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. -
ఢిల్లీ మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. తన మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖ, విద్యుత్, ప్రణాళిక, ఉన్నత విద్య, ఆర్థిక, సేవలు, విజిలెన్స్ శాఖలు చూస్తారు. ఇక ఆయన నమ్మిన బంటు, కుడిచేయి లాంటి మనీష్ సిసోదియాకు విద్య, ఉన్నత విద్య, ప్రజాపనుల శాఖ, పట్టణాభివృద్ధి, స్థానికసంస్థలు అప్పగించారు. సోమనాథ్ భారతికి పరిపాలనా సంస్కరణలు, న్యాయ, పర్యాటక, కళలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖలు ఇచ్చారు. సౌరభ్ భరద్వాజ్‌కు రవాణా, ఆహార సరఫరా, పర్యావరణ శాఖలు కేటాయించారు. మంత్రివర్గంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన రాఖీ బిర్లాకు మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, భాషల శాఖలు ఇచ్చారు. దాంతోపాటు జాతీయ రాజధానిలో మహిళల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసే బాధ్యతను కూడా ఆమెకే అప్పగించారు. గిరీష్ సోనీకి ఎస్సీ ఎస్సటీ సంక్షేమం, ఉద్యోగావకాశాలు, అభివృద్ధి, కార్మిక శాఖలు ఇచ్చారు. సత్యేంద్ర జైన్‌కు ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా ఎన్నికల శాఖలు అప్పగించారు.