Delhi Polic
-
చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్
ఢిల్లీ: ఊపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత) చట్టం కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్లను దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ప్రత్యేక సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. అనంతరం న్యూస్క్లీక్తో సంబంధాలు ఉన్న జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్‌తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 30 స్థావరాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చైనా నిధులు.. న్యూస్‌క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే న్యూస్‌క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్‌కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్‌క్లిక్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. భారీగా విదేశీ నిధులు న్యూస్ క్లిక్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు -
Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ ఈ నెల 4 నుంచి పరారీలో ఉన్నాడు. సుశీల్ సన్నిహితులను విచారించడంతో పాటు అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ ఆచూకీ తెలిపినవారికి రూ. 1 లక్ష బహుమతిగా అందిస్తామని తాజాగా పోలీసులు ప్రకటించారు. సుశీల్ సహచరుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి కూడా రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దలాల్ ఫోన్లో షూట్ చేసిన వీడియో రికార్డింగ్‌లో సుశీల్ కూడా కొందరిని కొట్టడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారం కూడా ఇదే. -
సుశీల్ కుమార్ ఎక్కడ?
న్యూఢిల్లీ: రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ పరారీ వ్యవహారం సీరియస్‌గా మారింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యోదంతానికి సంబంధించి సుశీల్‌పై ఢిల్లీ పోలీసులు ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ‘లుక్ అవుట్’ నోటీసు ఇచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్ఐఆర్లో సుశీల్ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామని వారు చెప్పారు. ఢిల్లీ–ఎన్సీఆర్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుశీల్ కోసం వెతికామని వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. ఛత్రశాల్ స్టేడియం పార్కింగ్ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. ఆ సమయంలో సుశీల్ అక్కడే ఉన్నాడని సాక్షులు చెప్పారు. తన గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడుతున్న రాణాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని ఇంటినుంచి లాక్కొని వచ్చి మరీ సుశీల్, అతని అనుచరులు కొట్టారని కూడా మరికొందరు సాక్ష్యమిచ్చారు. రెజ్లింగ్ పరువు పోయింది: డబ్ల్యూఎఫ్ఐ రెండు ఒలింపిక్ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ ఇప్పుడు హత్య కేసులో పరారీలో ఉండటం దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో భారత రెజ్లింగ్ స్థాయిని పెంచి ఎందరితో ఆదర్శంగా నిలిచిన సుశీల్ ఇలా కావడం బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఘటన సుశీల్‌కు వ్యక్తిగతంగానే కాకుండా భారత రెజ్లింగ్ మొత్తానికి చెడ్డ పేరు తెచ్చిందని తోమర్ అభిప్రాయ పడ్డారు. రెజ్లర్లు అంటే గూండాలనే భావన మళ్లీ నెలకొంటుందని తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎఫ్బీ అలర్ట్.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్ సాయం, పోలీసుల కృషి 27 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడాయి. కొద్ది క్షణాల్లో ఆత్మహత్యకు పాల్పడబోతున్న వ్యక్తిని రెండు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా కృషి చేసి పట్టుకొని అతని ఆత్మహత్య ఆలోచనను చంపేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ 27 వ్యక్తి కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో పంచుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఫేస్బుక్ సిబ్బంది ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ అన్యేష్ రాయ్‌కి మెయిల్ ద్వారా తెలియజేసింది. రాత్రి 8గంటల ప్రాంతంలో మెయిల్ రావడంతో అప్రమత్తమైన డీసీపీ... ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసి అడ్రస్ కనుకున్నారు. (చదవండి : తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య; అల్లుడి అరెస్ట్) అయితే అక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది. ఆ నెంబర్ తన భర్తది అని ఓ మహిళ తెలియజేసింది. తనతో గొడవపడి భర్తతో ఎక్కడికో వెళ్లాడని, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని ఆమె చెప్పింది. ఆయన నెంబర్‌ను తాను వినియోగిస్తున్నానని, అతనికి మరో నెంబర్ ఉందని అది వారికి ఇచ్చింది. గతంలో ఆయన ముంబైలోని ఓ చిన్న హోటల్లో కుక్‌గా పనిచేసేవాడని పేర్కొంది. దీంతో ఢిల్లీ డీసీపీ వెంటనే ముంబై డీసీపీ రష్మి కరాండికర్‌ను సంప్రదించారు. కొత్త ఫోన్ నెంబర్‌ను వారికి ఇచ్చి ట్రేస్ చేయాలని కోరారు. ముంబై పోలీసులు ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా.. కలవలేదు. వెంటనే ముంబై పోలీసులు అతని తల్లిని సంప్రదించారు. ఆమెకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసినట్లు గుర్తించి ఆ నెంబర్‌ను ట్రేస్ చేశారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ముంబై పోలీసులు అతని అడ్రస్ కనుగొన్నారు. అతన్ని ఫోన్ చేసి మాటల్లో పెట్టిన ముంబై పోలీసులు.. లోకేషన్ ట్రేస్ చేసి అతన్ని పట్టుకున్నారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. -
‘జేఎన్‌యూ’ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి దేశద్రోహం కేసులో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర నిందితులపై ఢిల్లీ పోలీసులు సోమవారం అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలను పోలీసులు మోపారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు వర్ధంతిని జేఎన్‌యూ క్యాంపస్‌లో 2016 ఫిబ్రవరి 9న కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు నిర్వహించడంతో వారిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మూడేళ్ల తర్వాత పోలీసుల చేత బీజేపీ ఈ పని చేయిస్తోందని నిందితులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, అభియోగపత్రంలో కశ్మీరీ విద్యార్థులు అఖీబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీయా రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 36 మందిలో సీపీఐ నేత డి. రాజా కూతురు అపరాజిత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, బానోజ్యోత్స్న లాహిరి, రమా నాగ తదితరులున్నారు. బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిశీలించనుంది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫుటేజీతోపాటు పలు పత్రాలను కూడా పోలీసులు అభియోగపత్రంతోపాటు కోర్టుకు సమర్పించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసేలా కన్హయ్య కుమారే అక్కడున్న గుంపును రెచ్చగొట్టాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితమే: కన్హయ్య ఇన్నాళ్ల తర్వాత చార్జిషీట్ వేయడం తమకు మంచిదేననీ, కేసు విచారణ పూర్తయితే నిజానిజాలు ఏంటో బయటకొస్తాయని కన్హయ్య అన్నారు. సీపీఐ నేత డి. రాజా మట్లాడుతూ రాజకీయ కారణాలతోనే ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేస్తున్నారనీ, దీనిపై తాము కోర్టులోనూ, కోర్టు బయట రాజకీయంగానూ పోరాడతామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కేసులో మరో నిందితుడు ఉమర్ ఖలీద్ ఆరోపించారు. షెహ్లా రషీద్ మాట్లాడుతూ ఇది నకిలీ కేసు అనీ, నిందితులందరూ నిర్దోషులుగా కేసు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9: పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి రోజున అతనిని పొగుడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ ఫిబ్రవరి 10: దీనిపై క్రమశిక్షణా విచారణకు జేఎన్‌యూ యంత్రాంగం ఆదేశం. ఫిబ్రవరి 11: బీజేపీ ఎంపీ మహేశ్ గిరి, ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 12: కన్హయ్య కుమార్ అరెస్ట్.. భారీ ఆందోళనలకు దిగిన విద్యార్థులు ఫిబ్రవరి 15: కన్హయ్య కేసు విచారణకు ముందు పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, పాత్రికేయులు, అధ్యాపకులను దేశ వ్యతిరేకులుగా పేర్కొంటూ న్యాయవాదుల దాడి. ఫిబ్రవరి 25: తీహార్ జైలుకు కన్హయ్యను పంపిన కోర్టు మార్చి 3: కన్హయ్యకు ఆరు నెలల బెయిలు ఆగస్టు 26: కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్లకు సాధారణ బెయిలు 2019 జనవరి 14: కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు -
సీఎస్‌పై దాడి చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్‌కు సమర్పించిన చార్జిషీట్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్ ప్రకటించారు.