
రెజ్లర్ సుశీల్ కుమార్ (ఫైల్)
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ ఈ నెల 4 నుంచి పరారీలో ఉన్నాడు.
సుశీల్ సన్నిహితులను విచారించడంతో పాటు అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ ఆచూకీ తెలిపినవారికి రూ. 1 లక్ష బహుమతిగా అందిస్తామని తాజాగా పోలీసులు ప్రకటించారు. సుశీల్ సహచరుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి కూడా రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు.
నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దలాల్ ఫోన్‌లో షూట్ చేసిన వీడియో రికార్డింగ్‌లో సుశీల్ కూడా కొందరిని కొట్టడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారం కూడా ఇదే.
Comments
Please login to add a commentAdd a comment