delivered a baby boy
-
ప్రసవం ముందు వరకు డ్యూటీ.. మేయర్పై ప్రశంసలు
జైపూర్ నగర్ నిగమ్ (గ్రేటర్) మేయర్గా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్య గుర్జర్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ మహిళా మేయర్పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి బిడ్డకు జన్మనిస్తే పొగడ్తలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటటే. తను ప్రసవించే కొన్ని గంటల ముందు వరకు కూడా సౌమ్య మేయర్గా తన బాధ్యతలు నిర్వర్తించారు. విధుల్లో పాల్గొని ప్రజా పాలనకు అసలైన అర్థం చెప్పారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ప్రస్తుతం సౌమ్య స్టోరీ నెట్టింట్లో వైరల్గా మారింది. నిండు గర్భిని అయిన మేయర్ బుధవారం రాత్రి వరకు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరగా గురువారం ఉదయం అయిదు గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ.. పని దేవునితో సమానమని పేర్కొన్నారు. ‘పనే నాకు దైవం. బుధవారం రాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో పాల్గొన్నాను. ప్రసవ నొప్పులతో 12.30 గంటలకు హాస్పిటల్లో చేరాను. దేవుడి ఆశీస్సులతో గురువారం ఉదయం క్షేమంగా ప్రసవమైంది’ అని ట్వీట్లో వివరించారు.. తొలుత రాజస్తాన్ పదవిలో ఉన్నపపుడు సౌమ్య ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఏకంగా మేయర్ పదవిని దక్కించుకున్నారు. రెండోసారి గర్భం దాల్చారు. అయినా క్రమం తప్పకుండా మేయర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత నెలలోనే మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను కూడా సమర్పించారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటనలోనూ ఆమె పాల్గొన్నారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో కూడాపనిచేయడం ఉత్తేజంగా, ఒక సవాలుగా ఉందన్నారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకున్నారు. మహిళా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సౌమ్యకు దేశ ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి' Work is Worship! देर रात तक निगम ऑफिस में मीटिंग ली, प्रसव पीड़ा शुरू होने पर रात्रि 12:30 बजे कुकुन हॉस्पिटल में भर्ती हुई और सुबह 5.14 पर परमपिता परमेश्वर की कृपा से पुत्र को जन्म दिया। मैं और बच्चा दोनों स्वस्थ हैं। pic.twitter.com/nMULHwNGWn — Dr Somya Gurjar (@drsomyagurjar) February 11, 2021 -
తల్లికి పురుడు పోసిన కుమార్తెలు
సాక్షి, బెంగళూరు : పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేయకుండా వైద్యులు వెనక్కు పంపారు. గత్యంతరం లేక ఆ తల్లి తన ముగ్గురు కుమార్తెల సహాయంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన బెంగళూరులో గురువారం చోటు చేసుకుంది. రాయచూరుకు చెందిన లక్ష్మీ కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట బెంగళూరుకు వలస వచ్చింది. భర్త, ముగ్గురు కుమార్తెలతో (వారి వయసు వరుసగా 12, 9, 7 ఏళ్లు) కలసి బ్యాడరహళ్లిలో నివాసం ఉండేది. లక్ష్మీ మరోసారి గర్భం ధరించిన తర్వాత భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బేల్దారి పనులకు వెళ్లి కుమార్తెలను పోషిస్తోంది. (అమ్మో.. వైరస్ సోకుతుందేమో) ఈ క్రమంలో ఆమెకు 9 నెలలు నిండటంతో బుధవారం నొప్పులు అధికమయ్యాయి. దీంతో కుమార్తెలు ఆమెను బెంగళూరులోని కెంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కరోనా వైరస్ లక్షణాలతో ఉన్నవారు చికిత్స పొందుతున్నందున ప్రసవం చేయలేమని, వేరే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కుమార్తెలతో కలసి ఇంటికి వెళ్లింది. గురువారం నొప్పులు అధికం కావడంతో తల్లి ఇచ్చిన సూచనలతో ముగ్గురు కుమార్తెలు ప్రసవం చేశారు. (అగ్రరాజ్యం అతలాకుతలం) మగబిడ్డ జన్మించడంతో కుటుంబంలో ఆనందం మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెళ్లి వారికి సహకారం అందజేశారు. అనంతరం విషయాన్ని బ్యాడరహళ్లి పోలీసులకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకొని తల్లి, ముగ్గురు కుమార్తెలు, నవజాత శిశువును ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో ఉల్లాళ ఆశ్రమానికి తరలించారు. అనంతరం ఆమె కుటుంబానికి పోలీసులు కొంత నగదు సాయాన్ని అందజేశారు. -
ఎన్నికల ప్రచారంలో పురిటినొప్పులు
పుణె: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా కార్పొరేటర్ అభ్యర్థి పోలింగ్ జరగకముందే విజయాన్ని సాధించారు. అదెలా అంటే.. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ రూపాలి పాటిల్ పుణె మునిసిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ నేతల తరహాలోనే ఆమె తన ప్రచారాన్ని కొనసాగిస్తుండగా గురువారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. పార్టీ నేతలు ఆమెను పుణెలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం ఉదయం తన రెండో కాన్పులో ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఓటింగ్ జరగకముందే తమ అభ్యర్థి రుపాలి విజయం సాధించారంటూ ఎంఎన్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎన్ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ అయిన రుపాలి శనివార్ పేట్-నారాయణ్ పేట్ నుంచి 15వ వార్డు నుంచి కార్పొరేటర్ గా మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం వాస్తవానికి డాక్టర్లు పాటిల్ కు మార్చి 5న డెలివరి డేట్ ఇచ్చారు. అయితే దాదాపు నెల రోజుల ముందే తాను ఈ సంతోషాన్ని పొందానని పాటిల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బిబీగా పాల్గొనడం, నడవటం లాంటి వాటితో ఇలా జరిగి ఉండొచ్చుని చెప్పారు. డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తే మరో రెండు రోజుల్లోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని ఎంఎన్ఎస్ అభ్యర్థి రుపాలి పాటిల్ తెలిపారు.