ఐటీ ఉద్యోగులకు డెల్ సీఐఓ వార్నింగ్
లేఆఫ్స్ బెడదతో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగులను డెల్ సీఐఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెట్ బస్క్ అయ్యర్ హెచ్చరించారు. ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీలను ఎప్పడికప్పుడూ తెలుసుకుంటూ ఉండాలని, మీకు మీరుగా రీస్కిల్ అవుతూ ఉండాలని చెప్పారు. లేనిపక్షంలో ఐటీ ఉద్యోగాన్ని వీడి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. తమ ఐటీ ఉద్యోగులందరూ లేఆఫ్స్ బెడద ప్రమాదం బారిని పడకుండా.. రెవెన్యూలను ఆర్జించడానికి ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడారని భరోసా వ్యక్తంచేశారు. రాబోతున్న స్కిల్స్‌ను నేర్చుకోవాల్సిన బాధ్యత ఉద్యోగుల్లోనే ఉందని, అది ఆర్గనైజేషన్‌కు సంబంధించింది కాదంటూ అయ్యర్ పేర్కొన్నారు. ఏ ఆర్గనైజేషన్ కూడా రీస్కిలింగ్ అందించదని, ఎందుకంటే ఉద్యోగులకు ఏం శిక్షణ ఇవ్వాలో వారికే తెలియదని అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఐటీ ఉద్యోగులు తమ భవిష్యత్తును అంచనావేసుకుని, దానికి అనుగుణంగా ఎప్పడికప్పుడూ తమ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. కొత్త టెక్నాలజీలను టెకీలు వాడుతూ, వాటిని తెలుసుకుని ఉండాలని తెలిపారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీలు ఐటీ కంపెనీల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. ఆటోమేషన్ పెరిగిపోవడం, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారానే కంపెనీలు రెవెన్యూలను ఆర్జిస్తున్నాయి. సంప్రదాయ ఐటీ కంపెనీల్లో ఉన్న సాఫ్ట్వేర్ సర్వీసెస్, మైంటెనెన్స్లలో తక్కువ వ్యాపారం కొనసాగుతోంది. దీంతో కొత్త టెక్నాలజీలకు కచ్చితంగా రీస్కిలింగ్ అవసరం పడుతుందని, ఒకవేళ రీస్కిల్ చేసుకోలేని ఉద్యోగులు కచ్చితంగా ఉద్వాసనకు గురవుతారని డెల్ సీఐఓ అయ్యర్ హెచ్చరించారు.