Democratic presidential candidate
-
మళ్లీ చర్చా.. ఆ చాన్సే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో మరో డిబేట్లో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిగ్ డిబేట్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌పై తాను గెలిచానని, ఆమె ఓడిపోయినందునే మరో చర్చ అంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో గురువారం ప్రకటించారు. జూన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన మొదటి డిబేట్, ఆ తర్వాత హ్యారిస్‌తో మంగళవారం జరిగిన డిబేట్‌ను ప్రస్తావిస్తూ ఇక మూడోది ఉండబోదని స్పష్టం చేశారు. గెలుపు తనదేనని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ట్రంప్ చెప్పారు. కాగా, ప్రధాన మీడియా సంస్థల సర్వేల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బిగ్ డిబేట్‌ను చూసిన వారిలో 63 శాతం మంది కమలా హారిస్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేయగా, 37 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
Donald Trump: భారతీయురాలా? బ్లాకా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కానున్న కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆమె చాలాకాలంగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌గా తెలుసని, ఇప్పుడు హఠాత్తుగా నల్లజాతీయురాలినని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. షికాగోలో బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడారు. వేదికపై ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులలో ఒకరు.. ‘హారిస్ ఎప్పుడూ నల్లజాతీయురాలిగానే గుర్తింపును కోరుకున్నారు. నల్లజాతీయుల యూనివర్సిటీలోనే చదువుకున్నారు’ అని చెప్పడానికి ప్రయత్నించగా ట్రంప్ అడ్డుపడ్డారు. ఆమె ఏదో ఒకదానికి కట్టుబడితే గౌరవిస్తానని, కానీ గతంలో భారతీయ వారసత్వం గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా నల్లజాతి వైపు మలుపు తిరిగారని, ఎవరైనా దానిని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. న్యాయవాదిగా ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని, పాస్ అవుతానని కూడా ఆమె అనుకోలేదని, ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అంతకుముందు రోజు ఫాక్స్‌న్యూస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో సైతం ట్రంప్ అభ్యంతరకరంగా మాట్లాడారు. కమల అధ్యక్షురాలిగా ఎన్నికైతే ప్రపంచవ్యాప్తంగా నేతలు ఆమెను ఆట బొమ్మలా చూస్తారని, ఆమె చుట్టూరా తిరుగుతారని వ్యాఖ్యానించారు. -
'నా అనారోగ్యం పెద్ద విషయం కాదు'
వాషింగ్టన్: ఇప్పుడు తాను ఎంతో బాగున్నానని, తన స్వల్ప అస్వస్థత పెద్ద విషయమేమీ కాదని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తెలిపారు. 9/11 దాడులు జరిగి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో హిల్లరీ క్లింటన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. 'ఇది పెద్ద విషయం కాబోదని నేను భావిస్తున్నా. తీరిక లేకుండా చురుగ్గా పనిచేసే ప్రతి వ్యక్తికి ఇలాంటి స్వల్ప అస్వస్థతలు ఎదురవుతూ ఉంటాయి' అని క్లింటన్ తెలిపారు. అస్వస్థత నుంచి తేరుకున్న తర్వాత తొలిసారి సీఎన్ఎన్ చానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. తన 40 ఏళ్ల జీవితం గురించి, తాను చెల్లించిన పన్నుల గురించి, తన ఈమెయిల్స్ గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి సమగ్ర సమాచారం ప్రజలకు తెలుసునని ఆమె చెప్పుకొచ్చారు. న్యూమోనియోతో బాధపడుతున్న తాను వైద్యుడి సలహా పాటించకుండా బిజీ షెడ్యూల్ లో తలమునకలవ్వడం వల్లే స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. కొంచెం విశ్రాంతి తీసుకోవడం ద్వారా తాను తిరిగి పూర్తిస్థాయిలో షెడ్యూల్ ప్రకారం ముందుకెళతానని ఆమె చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ తమ ఆరోగ్య పరిస్థితిపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 68 ఏళ్ల హిల్లరీ అనారోగ్యానికి గురికావడం అమెరికన్లను ఆందోళనకు గురిచేసింది.