dengue patient
-
యూపీలో ఘోరం.. డెంగ్యూ రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్.. వీడియో వైరల్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చేసింది. డెంగీతో బాధపడుతున్న రోగికి ప్లాస్మా పేరుతో ఓ బ్లడ్ బ్యాంక్ బత్తాయి జ్యూస్‌ను సరాఫరా చేసిందనే వార్త కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల నిర్లక్ష్యం అతని ప్రాణాలు తీసిందనేది ఆరోపణ. బ్లడ్ ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వేదాంక్ సింగ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్ కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రిలో స్కామ్ అని ఓ వ్యక్తి చెప్పడం వినిపిస్తోంది. ఆసుపత్రితో సంబంధం ఉన్న వైద్యులు బ్లడ్ ప్లాస్మా అవసరం ఉన్న రోగులకు బత్తాయి జ్యూస్‌ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక బత్తాయి జ్యూస్ ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని, దీనిపై ప్రయాగ్‌రాజ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. प्रयागराज में मानवता शर्मसार हो गयी। एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया। मरीज की मौत हो गयी है। इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP — Vedank Singh (@VedankSingh) October 19, 2022 మరోవైపు స్థానికంగా డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు. చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బడితెపూజ చేసిన మహిళలు.. వీడియో వైరల్ -
వామ్మో.. డెంగ్యూ పేషెంట్‌కు రూ.16 లక్షల బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : డెంగ్యూ పేషెంట్‌కు ఓ ఆసుపత్రి ఏకంగా 16 లక్షలు బిల్లు వసులు చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఠాగుర్ సినిమా సన్నివేశంను తలపించేలా ఉన్న ఈ సంఘటన రెండు నెలల క్రితం దేశరాజధాని ఢిల్లీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అంత బిల్లు వసూలు చేసినా సదరు ఆసుపత్రి ఆ పేషంట్‌ను బతికించ లేకపోయింది. ఆ వివరాలు..ఏడేళ్ల ఆద్యా సింగ్‌కు ఆగస్టు 27న తీవ్రమైన జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ద్వారకాలోని రాక్లండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చిన్నారికి డెంగీ వచ్చినట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని ఆద్యా తల్లిదండ్రులకు సూచించారు. వెంటనే ఆమెను ఆగస్టు 31న గుర్గావ్లోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ప్లేట్ లేట్స్ సంఖ్య పడిపోయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో 10 రోజుల పాటు ఐసీయూలో ఉంచి ఫోర్టిస్ వైద్యులు చికిత్స అందించారు. సెప్టెంబర్ 14న ఎంఆర్ఐ స్కానింగ్ తీయించారు. ఆ రిపోర్టులో ఆద్యా మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు తేలింది. అప్పటికే 16 లక్షలు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పాప ఆరోగ్యం క్షీణించడంతో చేతులెత్తేసింది. సెప్టెంబర్ 14న ఆద్యా కన్ను మూసింది. ఈ విషయాన్ని ఆద్యా సింగ్ తండ్రి మిత్రుడు.. నవంబర్ 17న ట్విట్టర్లో ప్రస్తావించాడు. పదిహేను రోజుల పాటు డెంగీకి చికిత్స చేసి చివరకు చిన్నారి ప్రాణాలను ఫోర్టిస్ ఆస్పత్రి బలిగొందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతగాంటే కేవలం నాలుగు రోజుల్లోనే 16 వేల రీట్వీట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. పూర్తి వివరాలు తమకు ఇవ్వండి.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా రీట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆరోగ్య కార్యదర్శికి మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో 15 రోజులు ఉన్నామని, రోజుకు 40 సిరంజీల లెక్కన 660 సిరంజీలకు చార్జ్ చేశారని, ఎక్కువ డోస్ కలిగిన యాంటీ బయోటిక్స్,1600 గ్లోవ్స్ ఉపయోగించారని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
అపోలో ఆసుపత్రిలో దారుణం
గాంధీనగర్: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అపోలో అసుపత్రికి డెంగ్యూ చికిత్స కోసం వచ్చిన మహిళపై అక్కడ పనిచేస్తున్న ఓ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. డెంగ్యూతో బాధపడుతున్న ఓ 21 ఏళ్ల మహిళ ఇటీవల చికిత్స కోసం అపోలో అసుపత్రిలో చేరింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెపై రాత్రివేళలో విధులు నిర్వర్తిస్తున్న రమేష్ చౌహాన్(28) అనే డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని వార్డు బాయ్ సహకారంతో డాక్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన డాక్టర్‌తో పాటు సహకరించిన వార్డు బాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రిలో చేరిన ఆమెపై రెండుసార్లు అత్యాచారానిని పాల్పడినట్లు తెలుస్తోంది. మెడికల్ రిపోర్టులో సైతం ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.