Denied tickets
-
ఢిల్లీ వెళ్లిన కర్ణాటక మాజీ CM జగదీష్ షెట్టర్
-
సీఎం చన్నీ సోదరుడికి కాంగ్రెస్ టికెట్ నిరాకరణ
న్యూఢిల్లీ: పార్టీ తరఫున పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదలచేసింది. 86 మంది పేర్లున్న ఈ జాబితాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్‌కు స్థానం దక్కలేదు. దీంతో బస్సీ పఠానా(ఎస్సీ) స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. చదవండి: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా మనోహర్ వృత్తిరీత్యా వైద్యుడు. గత ఏడాది ఆగస్ట్‌లో ప్రభుత్వం ఉద్యోగానికి రాజీనామా చేశాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, చంకౌర్ సాహిబ్ స్థానం నుంచి సీఎం చన్నీ బరిలో నిలుస్తున్నారు. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అమృతసర్(తూర్పు) నుంచి పోటీచేయనున్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు నిరాకరించింది. నటుడు సోనూసూద్ సోదరి మాళవిక మోగా నుం చి పోటీచేస్తారు. దీంతో మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆరు రోజులు వాయిదా వేయండి చండీగఢ్: గురు రవిదాస్ జీ జయంతి(ఫిబ్రవరి 16న) వస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను ఆరు రోజులు వాయిదావేయాలని బీజేపీ, దాని మిత్రపక్షాలు పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్సీ), శిరోమణి అకాలీదళ్(సంయుక్త్)లు ఈసీని ఆదివారం కోరాయి. ఈ మేరకు ఈసీకి లేఖ రాశాయి. బీఎస్పీ, కాంగ్రెస్ నేత, రాష్ట్ర సీఎం చన్నీలు సైతం పోలింగ్‌ను ఆరు రోజులు వాయిదా వేయాలని కోరడం తెల్సిందే. ఫిబ్రవరి 14కు బదులు పోలింగ్‌ను 20న నిర్వహించాలని కోరారు. -
అందుకే ఆమె పార్టీ మారారు!
లక్నో: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, యూపీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి.. బీజేపీలో చేరడం ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎందుకు పార్టీ మారారన్న దానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలకు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడం వల్లే బీజేపీలోకి వెళ్లిపోయారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. లక్నో సెంట్రల్ నియోజకర్గం నుంచి రీటా, లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి తన కుమారుడు మయాంక్ కు టికెట్ అడిగారని తెలిపాయి. దీంతోపాటు షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తూ తనను పక్కన పెట్టడంతో రీటా అంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి బలమైన సంబంధాలునప్పటికీ తనను పట్టించుకోకపోవడంతో ఆమె కలత చెందారు. రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన కిసాన్ యాత్రలోనూ ఆమెకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ఆవేశపూరిత నాయకురాలిగా ముద్రపడిన రీతా బహుగుణ 2009లో మాయావతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యారు. బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేసి నిప్పటించారు. అయితే పార్టీ మారడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 1998లో సుల్తాన్ పూర్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు సార్లు(2009, 2014) లక్నో లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 28 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో యూపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆమెను తప్పించి నిర్మల్ ఖాత్రిని నియమించారు.