DEO offices
-
సారూ.. పీటీఐలపై ఇదేం తీరు..!
కాసిపేట: జిల్లాలో విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరుతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న పీటీఐ(పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు) నష్టపోవాల్సి వస్తోంది. పునర్నియామకంలో జాప్యం కారణంగా ప్రతీ ఏడాది 10 రోజుల నుంచి 40 రోజుల వరకు వేతనం కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేస్తున్న పీటీఐలను ప్రభుత్వం ప్రతీ విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున తొలగించి మళ్లీ నియమిస్తుంది. ప్రభుత్వ ఆదేశానుసారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్లు ప్రతీ ఏడాది వీరికి రీ ఎంగేజ్ ఆర్డర్ ఇవ్వగానే అన్ని జిల్లాల్లో పీటీఐలు విధులకు హాజరవుతూ వారి వారి పాఠశాలల ద్వారా సంబంధిత పత్రాలు డీఈవో కార్యాలయానికి పంపిస్తారు. జిల్లాలో కమి షనర్, పీడీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కలెక్టర్ అప్రూవల్ అయ్యాక స్కూళ్లకు వెళ్లాలని చెబుతూ ఫైల్‌ను ప్రతీ ఏడాది 10 నుంచి 40రోజులు ఆలస్యం చేస్తుండడంతో వేతనాలు కోల్పోతున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ విభాగంలో జిల్లాలో మొత్తం 69మంది పీటీఐలుగా పనిచేస్తున్నారు. వీరికి వేతనం నెలకు రూ. 11,700 చెల్లిస్తున్నారు. పీటీఐలను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించగా.. కలెక్టర్ అప్రూవల్ అయ్యాక విధుల్లోకి తీసుకుంటామని, మిగతా జిల్లాల విషయం తమకు తెలియదని అన్నారు. -
ఈ డీఈఓ మాకొద్దు
డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరసింహారెడ్డి పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వ్యవహారశైలిపై విసిగి వేశారిన ఉద్యోగులు ‘ఈ డీఈఓ మాకొద్దంటూ’ గురువారం సాయంత్రం ఆందోళనకు దిగడం సంచలనం రేపింది. ఈయన తీరుతో ఉపాధ్యాయ సంఘాలు, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని ఉద్యోగులు పెదవి విప్పారు. సమస్యలు పట్టించుకోక పోగా ఆయన పనితీరు మానసిక క్షోభకు గురిచేస్తోందని వాపోయారు. ఆరునెలలుగా విసిగివేసారి ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : ఒకరూ కాదు..ఇద్దరు కాదు డీఈఓ కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్ కేడర్ నుంచి అటెండర్ స్థాయి వరకు ఉద్యోగులంతా ‘ ఈ డీఈఓ మాకొద్దంటూ’ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డీఈఓ వైఖరిని మార్చుకోవాలని కోరారు. తమకు న్యాయం చేసే వరకు ధర్నా విరమించమని ఉద్యోగులు భీష్మించారు. డీఈఓ వారి వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులు ధర్నాను విరమించారు. ఆ కార్యాలయ ఉద్యోగులు తమ సమస్యలను విలేకరులతో ఇలా చెప్పుకున్నారు.. సమస్య మొదలైంది ఇలా.. డీఈఓ కార్యాలయంలో ఏపీఓ కేడర్ లో టెక్నికల్ సిబ్బందిగా కొన్నేళ్లుగా నలుగురు టీచర్లు డెప్యూటేషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారిని రిలీవ్ చేసి మాతృశాఖకు పంపాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‡ చినవీరభద్రుడు ఏప్రిల్ 28న ఉత్తర్వులు జారీచేశారు. నెలలు గడుస్తున్న డీఈఓ రిలీవ్ చేయడం లేదు. తమను రిలీవ్ చేసి పోస్టింగ్‌లు ఇవ్వకపోతే త్వరలో బదిలీలు నిర్వహిస్తే నష్టపోతామని వారు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. వీరిని రిలీవ్ చేయకుండానే సమగ్రశిక్ష శాఖ, ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్ పద్ధతిలో పనిచేస్తూ వెనక్కు వచ్చిన వారికి అనుకూలమైన చోట్ల పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ సమస్యను చివరి సారిగా డీఈఓ దృష్టికి తీసుకొచ్చేందుకు కార్యాలయ ఉద్యోగులంతా శుక్రవారం మధ్యాహ్నం చాంబర్‌కు వెళ్లారు. ఆ సమయంలో దురు సుగా వ్యవహరించి, బయటకుపోండి అని మందలించారు. దీంతో ఉద్యోగులంతా ఏకమై కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అమ్యామ్యాలు ఇచ్చిన వారికి నచ్చిన చోట పోస్టింగ్స్ ఇస్తున్నారని, తమను చులకనగా చూస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పోస్టింగ్స్‌లో కొన్ని.. ♦ సమగ్రశిక్ష శాఖలో అసిస్టెంట్ ఏఎంఓగా పనిచేస్తూ మాతృశాఖకు బదిలీ అయిన టీచర్ లోకనాథంకు నెల ముందు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన పూర్వ పాఠశాల పిచ్చాటూరు మండలం అయితే అనుకూలంగా రేణిగుంట మండలం గాజులమండ్యంకు పోస్టింగ్ ఇచ్చారు. ♦ రాష్ట్ర సమగ్రశిక్షా శాఖలో పనిచేస్తూ పూర్వస్థానానికి వెనక్కు వచ్చిన ఓ మహిళా టీచర్‌కు పుత్తూరుకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా, అనుకూలంగా బంగారుపాళ్యం మండలానికి ఇచ్చారు. ♦ రాష్ట్ర సమగ్రశిక్ష శాఖలో పనిచేస్తూ పూర్వస్థానానికి వెనక్కు వచ్చిన ఉర్దూ బయాలజీ టీచర్ అబ్దుల్‌గనికి చౌడేపల్లి మండలంలో పోస్టింగ్ ఇవ్వాలి. స్వగ్రామమైన వి.కోట మండలం నడిపేపల్లి పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చారు. మరిన్ని ఆరోపణలు ఇలా ♦ విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ పాఠశాల పేరు ముందు టెక్నో అనే పదం వాడకూడదు. తిరుపతికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాలకు సైనిక్ స్కూల్ పేరుతో అనుమతులు ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పిన సూపరింటెండెంట్‌పై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేసి నోట్‌ఫైల్ సిద్ధం చేయించినట్లు సమాచారం. ♦ లైంగిక ఆరోపణలతో ఫోక్సో చట్టం కింద అరెస్టు అయిన ఓ ఉపాధ్యాయుడికి నిబంధనలు పాటించకుండా సస్పెన్షన్ ఎత్తివేసి అనుకూల ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారు. ♦ ఐదేళ్లుగా విధులు చేయని ఓ ఉపాధ్యాయుడికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ♦ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల పట్ల కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం. గతంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. -
యూజ్‌లెస్‌గా తయారయ్యారు
డీఈవోలపై పాఠశాల విద్యా డెరైక్టర్ ఆగ్రహం! సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా కార్యక్రమాలను పక్కాగా చేపట్టడం లేదని, జిల్లాల్లో డీఈవోలు సరిగ్గా పని చేయడం లేదని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పరిస్థితులు, బోధన, విద్యాప్రమాణాలపై ఇటీవల తనిఖీ బృందా లు అధ్యయనం చేపట్టాయి. ఈ క్రమంలో జిల్లాలకు వెళ్లినపుడు వరంగల్ డీఈవో బృందాలకు సహకరించలేని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సహ పాఠ్య కార్యక్రమాల కోసం రూపొందించిన పుస్తకాలను పంపిణీ చేయకుండా అలాగే కార్యాలయం లో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవోలు సరిగా పనిచేయడం లేదని, యూజ్‌లెస్‌గా తయారయ్యారని అన్నట్లు తెలిసింది. ప్రైవేటు పాఠశాలలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఓవైపు నోటీసులిస్తూనే... మరోవైపు కవర్లు తెచ్చుకోవడానికి అలవాటు పడ్డారని పేర్కొన్నట్లు సమాచారం. అమ్యామ్యాలపై కాకుండా విద్యా ప్రమాణాలపై దృష్టి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో డీఈవో కార్యాలయాల విభజన, క్షేత్ర స్థాయి తనిఖీలపై మంగళవారం డెరైక్టర్ కిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, మహబూబ్‌నగర్ డీఈవోల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే డీఈవోలందరి వ్యవహారంపై మండిపడ్డారు. కొత్త జిల్లాల్లో డీఈవోలుగా పని చేయాల్సిన వారికి ఈనెల 10వ తేదీ సాయంత్రం పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని, 11వ తేదీ నుంచి కొత్త కార్యాలయాల్లో విధులను నిర్వర్తించాలని సూచించారు. మొదటి రోజు ఆరేడు పనులను చేయాలని, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సూచించారు. -
టీచర్ల పదోన్నతులు, బదిలీలకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: జూన్ 22: పాఠశాలల్లో 1, 2, 3, 4 కేటగిరీలవారీగా తాత్కాలిక ఖాళీల వివరాలు తెలుపుతూ డీఈవో కార్యాలయాలు, వెబ్సైట్లో ప్రదర్శన 22 నుంచి 27 వరకు: బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనాధికారులకు ప్రతుల అందజేత 26: మేనేజ్మెంట్ , కేటగిరీ, సబ్జెక్టు, మీడియం వారీగా తుది ఖాళీల వివరాలను డీఈవో కార్యాలయాలు, వెబ్సైట్లో ప్రదర్శన. (హేతుబద్ధీకరణ పూర్తి చేసి అందుబాటులో ఉంచుతారు) 28, 29: డీఈవోలతో దరఖాస్తులు, పాయింట్ల పరిశీలన 30: డీఈవో కార్యాలయాలు, వెబ్సైట్లో ప్రాథమిక సీనియారిటీ జాబితా, పాయింట్ల ప్రదర్శన. హేతుబద్ధీకరణలో సర్ప్లస్ ఉపాధ్యాయులుగా గుర్తించిన వారి పేర్లు, జాబితా ప్రదర్శన జూలై 1: సీనియారిటీ జాబితాలపై టీచర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణ 2, 3: అభ్యంతరాలు, విజ్ఞప్తుల పరిష్కారం 4: బదిలీలు, పదోన్నతులకు అర్హులైన వారి తుది సీనియారిటీ జాబితాల ప్రదర్శన 5: జిల్లా, జోనల్ స్థాయిల్లో మేనేజ్మెంట్ వారీగా జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు కౌన్సెలింగ్. 6: జిల్లా, జోనల్ స్థాయిల్లో జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్లలో అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు, బదిలీలు 7 నుంచి 9 వరకు: అన్ని మీడియాలు, అన్ని మేనేజ్మెంట్లలో జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ల బదిలీలకు కౌన్సెలింగ్ 10, 11: అన్ని సబ్జెక్టుల్లో, అన్ని మేనేజ్మెంట్లలో, అన్ని మీడియంలలో మేనేజ్మెంట్ల వారీగా జిల్లా స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు 12 నుంచి 16 వరకు: జిల్లా పరిషత్తు, ప్రభుత్వ మేనేజ్మెంట్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ తత్సమాన కేడర్ వారిబదిలీలకు కౌన్సెలింగ్. పాయింట్ల ఆధారంగా కేటాయింపులు నాలుగో కేటగిరీ పాఠశాలల్లో (12 శాతం ఇంటి అద్దె పొందుతూ గ్రామానికి ఏ విధమైన రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు) పనిచేస్తున్న వారికి ప్రతి ఏడాది సర్వీసుకు 5 పాయింట్లు(నెల సర్వీసుకు 0.416 పాయింట్ల చొప్పున) ఇస్తారు. మూడో కేటగిరీ పాఠశాలల్లో (12 శాతం ఇంటి అద్దె పొందుతూ రోడ్దు సౌకర్యం ఉన్న గ్రామాలు) పని చేస్తున్న వారికి ఏడాదికి 3 చొప్పున (నెలకు 0.25 చొప్పున) పాయింట్లు ఇస్తారు. రెండో కేటగిరీ పాఠశాలల్లో (14.5 శాతం ఇంటి అద్దె పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) పనిచేస్తున్న వారికి ఏడాది సర్వీసుకు 2 పాయింట్లు (నెలకు 0.16) ఇస్తారు. ఒకటో కేటగిరీ పాఠశాలల్లో (20 శాతం, ఆపైన హెచ్ఆర్ఏ పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒకటి చొప్పున (నెలకు 0.083) పాయింట్లు ఇస్తారు. నాలుగో కేటగిరీ పాఠశాలల జాబితాను జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. ఆన్‌డ్యూటీ సౌకర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, వివాహం కాని మహిళలకు 10 పాయింట్లు కేటాయిస్తారు. భార్యాభర్తలిద్దరిలో ఒకరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 10 పాయింట్లు ఇస్తారు. వీటిని హెచ్ఎంలు ఐదేళ్లకోసారి, టీచర్లు 8 ఏళ్లకోసారి వినియోగించుకోవచ్చు. హేతుబద్ధీకరణ ద్వారా బదిలీ అయ్యే వారికి అదనంగా 10 పాయింట్లు ఇస్తారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి అదనంగా పాయింట్లు ఇవ్వరు. 2013లో బదిలీ అయినా పాత స్థానాల్లోనే ఉండిపోయిన వారు కోరుకున్న స్థానం హేతుబద్ధీకరణలో పోతే వారి బదిలీని రద్దు చేసి, అదనంగా 5 పాయింట్లు ఇచ్చి ప్రస్తుత బదిలీల్లో అవకాశం ఇస్తారు. జాతీయ అవార్డు పొందిన వారికి 15, రాష్ట్ర అవార్డు పొందిన వారికి 10 పాయింట్లు ఇస్తారు. పదో తరగతిలో 100% ఫలితాలు సాధించిన వారికి 2.5 పాయింట్లు, 95- 99%ఫలితాలు సాధిస్తే 2 పాయింట్లు, 90- 94% ఫలితాలు వస్తే ఒక పాయింటు ఇస్తారు. ఎస్ఎస్ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ రిసోర్స్ పర్సన్స్‌కు రాష్ట్ర స్థాయి వారికి 5, జిల్లా స్థాయి వారికి 4, మండల స్థాయి వారికి 2 పాయింట్లు ఇస్తారు. 70 శాతంకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు, మానసిక వైకల్యం, బ్లడ్ క్యాన్సర్, జువైనల్ డయాబిటిస్‌తో బాధపడే పిల్లల తల్లిదండ్రులకు, ప్రాధాన్య క్రమంలో కౌన్సెలింగ్‌లో ముందుగా బదిలీకి అవకాశం కల్పిస్తారు. ఈ ప్రాధాన్య బదిలీలు హెచ్ఎంలకు ఐదేళ్లకోసారి, టీచర్లకు 8 ఏళ్లకోసారి అవకాశమిస్తారు.జోనల్ స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంల బదిలీల కోసం వేసే కమిటీ కి డీఎస్సీ నుంచి నియమితులయ్యే సీనియర్ అధికారి చైర్మన్‌గా ఉంటారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంల బదిలీల కమిటీకి చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్ ఉంటారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ టీచర్ల బదిలీల కమిటీకి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ టీచర్ల బదిలీల కమిటీకి చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్ వ్యవహరిస్తారు. బదిలీ అయిన వెంటనే ఉపాధ్యాయులకు వ్యక్తిగతంగా ఉత్తర్వులు అందుతాయి. వారు రిలీవ్ అయిన మరుసటి రోజే విధుల్లో చేరాలి. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో గరిష్ట సర్వీసు పూర్తయిన వారికి మళ్లీ అదే గ్రామ పంచాయతీ పరిధిలో పోస్టింగ్ ఇవ్వరు. ఒకసారి చేసిన బదిలీని మార్చడానికి వీల్లేదు. తప్పనిసరి బదిలీల్లో ఉండి కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే మిగిలిన ఖాళీల్లోకి పంపిస్తారు. బదిలీలకు నిబంధనలివే... ా బదిలీల దరఖాస్తులు, కౌన్సెలింగ్ అం తా ఆన్లైన్లో ఉంటుంది. జిల్లా/జోనల్ స్థాయిలో ఏర్పడిన బదిలీల కమిటీ ఆమో దం ప్రకారమే ఉత్తర్వులు జారీ చేస్తారు. ా 2015 జూలై 1 నాటికి ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒకే స్కూల్లో ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్ల సర్వీసు పూర్తయిన టీచర్లకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. పదవీ విరమణకు రెండేళ్ల సర్వీసు కలిగిన వారికి(వారు కోరుకుంటే తప్ప) తప్పనిసరి బదిలీ ఉండదు. ా బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులు/హెచ్ఎంలకు తప్పనిసరి బదిలీ. వీటిల్లో పనిచేసేందుకు మహిళా హెచ్ఎం /టీచర్లు లేదా 50 ఏళ్లు పైబడిన పురుష టీచర్లు/హెచ్ఎంలకు అవకాశం కల్పిస్తారు ఇటీవలి పదో తరగతి పరీక్షల్లో 25 శాతం కంటే తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలల టీచర్లు, హెచ్ఎంలను 3 లేదా 4వ కేటగిరీ పాఠశాలలకు కౌన్సెలింగ్‌కు ముందే బదిలీ చేస్తారు. ఒకవేళ సబ్జెక్టు టీచర్ లేని పరిస్థితిలో ఫలితాలు తగ్గితే మాత్రం సదరు హెచ్ఎంకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ా హేతుబద్ధీకరణ ద్వారా సర్‌ప్లస్‌గా గుర్తించిన వారు దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. ఈ బదిలీలన్నీ ఆయా మేనేజ్మెంట్ల పరిధిలోనే ఉంటాయి.