సాక్షి, హైదరాబాద్: జూన్ 22: పాఠశాలల్లో 1, 2, 3, 4 కేటగిరీలవారీగా తాత్కాలిక ఖాళీల వివరాలు తెలుపుతూ డీఈవో కార్యాలయాలు, వెబ్‌సైట్‌లో ప్రదర్శన 22 నుంచి 27 వరకు: బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనాధికారులకు ప్రతుల అందజేత 26: మేనేజ్‌మెంట్ , కేటగిరీ, సబ్జెక్టు, మీడియం వారీగా తుది ఖాళీల వివరాలను డీఈవో కార్యాలయాలు, వెబ్‌సైట్‌లో ప్రదర్శన.
(హేతుబద్ధీకరణ పూర్తి చేసి అందుబాటులో ఉంచుతారు)
28, 29: డీఈవోలతో దరఖాస్తులు, పాయింట్ల పరిశీలన
30: డీఈవో కార్యాలయాలు, వెబ్‌సైట్‌లో ప్రాథమిక సీనియారిటీ జాబితా, పాయింట్ల ప్రదర్శన. హేతుబద్ధీకరణలో సర్‌ప్లస్ ఉపాధ్యాయులుగా గుర్తించిన వారి పేర్లు, జాబితా ప్రదర్శన
జూలై 1: సీనియారిటీ జాబితాలపై టీచర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణ
2, 3: అభ్యంతరాలు, విజ్ఞప్తుల పరిష్కారం
4: బదిలీలు, పదోన్నతులకు అర్హులైన వారి తుది సీనియారిటీ జాబితాల ప్రదర్శన
5: జిల్లా, జోనల్ స్థాయిల్లో మేనేజ్‌మెంట్ వారీగా జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు కౌన్సెలింగ్. 6: జిల్లా, జోనల్ స్థాయిల్లో జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్లలో అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు, బదిలీలు
7 నుంచి 9 వరకు: అన్ని మీడియాలు, అన్ని మేనేజ్‌మెంట్లలో జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ల బదిలీలకు కౌన్సెలింగ్
10, 11: అన్ని సబ్జెక్టుల్లో, అన్ని మేనేజ్‌మెంట్లలో, అన్ని మీడియంలలో మేనేజ్‌మెంట్ల వారీగా జిల్లా స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్లుగా పదోన్నతులు
12 నుంచి 16 వరకు: జిల్లా పరిషత్తు, ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ తత్సమాన కేడర్ వారిబదిలీలకు కౌన్సెలింగ్.
పాయింట్ల ఆధారంగా కేటాయింపులు
నాలుగో కేటగిరీ పాఠశాలల్లో (12 శాతం ఇంటి అద్దె పొందుతూ గ్రామానికి ఏ విధమైన రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు) పనిచేస్తున్న వారికి ప్రతి ఏడాది సర్వీసుకు 5 పాయింట్లు(నెల సర్వీసుకు 0.416 పాయింట్ల చొప్పున) ఇస్తారు.
మూడో కేటగిరీ పాఠశాలల్లో (12 శాతం ఇంటి అద్దె పొందుతూ రోడ్దు సౌకర్యం ఉన్న గ్రామాలు) పని చేస్తున్న వారికి ఏడాదికి 3 చొప్పున (నెలకు 0.25 చొప్పున) పాయింట్లు ఇస్తారు.
రెండో కేటగిరీ పాఠశాలల్లో (14.5 శాతం ఇంటి అద్దె పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) పనిచేస్తున్న వారికి ఏడాది సర్వీసుకు 2 పాయింట్లు (నెలకు 0.16) ఇస్తారు.
ఒకటో కేటగిరీ పాఠశాలల్లో (20 శాతం, ఆపైన హెచ్‌ఆర్‌ఏ పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒకటి చొప్పున (నెలకు 0.083) పాయింట్లు ఇస్తారు.
నాలుగో కేటగిరీ పాఠశాలల జాబితాను జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు.
ఆన్‌డ్యూటీ సౌకర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, వివాహం కాని మహిళలకు 10 పాయింట్లు కేటాయిస్తారు.
భార్యాభర్తలిద్దరిలో ఒకరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 10 పాయింట్లు ఇస్తారు. వీటిని హెచ్‌ఎంలు ఐదేళ్లకోసారి, టీచర్లు 8 ఏళ్లకోసారి వినియోగించుకోవచ్చు.
హేతుబద్ధీకరణ ద్వారా బదిలీ అయ్యే వారికి అదనంగా 10 పాయింట్లు ఇస్తారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి అదనంగా పాయింట్లు ఇవ్వరు.
2013లో బదిలీ అయినా పాత స్థానాల్లోనే ఉండిపోయిన వారు కోరుకున్న స్థానం హేతుబద్ధీకరణలో పోతే వారి బదిలీని రద్దు చేసి, అదనంగా 5 పాయింట్లు ఇచ్చి ప్రస్తుత బదిలీల్లో అవకాశం ఇస్తారు.
జాతీయ అవార్డు పొందిన వారికి 15, రాష్ట్ర అవార్డు పొందిన వారికి 10 పాయింట్లు ఇస్తారు.
పదో తరగతిలో 100% ఫలితాలు సాధించిన వారికి 2.5 పాయింట్లు, 95- 99%ఫలితాలు సాధిస్తే 2 పాయింట్లు, 90- 94% ఫలితాలు వస్తే ఒక పాయింటు ఇస్తారు.
ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ రిసోర్స్ పర్సన్స్‌కు రాష్ట్ర స్థాయి వారికి 5, జిల్లా స్థాయి వారికి 4, మండల స్థాయి వారికి 2 పాయింట్లు ఇస్తారు.
70 శాతంకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు, మానసిక వైకల్యం, బ్లడ్ క్యాన్సర్, జువైనల్ డయాబిటిస్‌తో బాధపడే పిల్లల తల్లిదండ్రులకు, ప్రాధాన్య క్రమంలో కౌన్సెలింగ్‌లో ముందుగా బదిలీకి అవకాశం కల్పిస్తారు. ఈ ప్రాధాన్య బదిలీలు హెచ్‌ఎంలకు ఐదేళ్లకోసారి, టీచర్లకు 8 ఏళ్లకోసారి అవకాశమిస్తారు.జోనల్ స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంల బదిలీల కోసం వేసే కమిటీ కి డీఎస్‌సీ నుంచి నియమితులయ్యే సీనియర్ అధికారి చైర్మన్‌గా ఉంటారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంల బదిలీల కమిటీకి చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్ ఉంటారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ టీచర్ల బదిలీల కమిటీకి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ టీచర్ల బదిలీల కమిటీకి చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్ వ్యవహరిస్తారు. బదిలీ అయిన వెంటనే ఉపాధ్యాయులకు వ్యక్తిగతంగా ఉత్తర్వులు అందుతాయి. వారు రిలీవ్ అయిన మరుసటి రోజే విధుల్లో చేరాలి. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో గరిష్ట సర్వీసు పూర్తయిన వారికి మళ్లీ అదే గ్రామ పంచాయతీ పరిధిలో పోస్టింగ్ ఇవ్వరు. ఒకసారి చేసిన బదిలీని మార్చడానికి వీల్లేదు. తప్పనిసరి బదిలీల్లో ఉండి కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే మిగిలిన ఖాళీల్లోకి పంపిస్తారు.
బదిలీలకు నిబంధనలివే...
ా బదిలీల దరఖాస్తులు, కౌన్సెలింగ్ అం తా ఆన్‌లైన్‌లో ఉంటుంది. జిల్లా/జోనల్ స్థాయిలో ఏర్పడిన బదిలీల కమిటీ ఆమో దం ప్రకారమే ఉత్తర్వులు జారీ చేస్తారు. ా 2015 జూలై 1 నాటికి ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒకే స్కూల్లో ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్ల సర్వీసు పూర్తయిన టీచర్లకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. పదవీ విరమణకు రెండేళ్ల సర్వీసు కలిగిన వారికి(వారు కోరుకుంటే తప్ప) తప్పనిసరి బదిలీ ఉండదు.
ా బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులు/హెచ్‌ఎంలకు తప్పనిసరి బదిలీ. వీటిల్లో పనిచేసేందుకు మహిళా హెచ్‌ఎం /టీచర్లు లేదా 50 ఏళ్లు పైబడిన పురుష టీచర్లు/హెచ్‌ఎంలకు అవకాశం కల్పిస్తారు ఇటీవలి పదో తరగతి పరీక్షల్లో 25 శాతం కంటే తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలల టీచర్లు, హెచ్‌ఎంలను 3 లేదా 4వ కేటగిరీ పాఠశాలలకు కౌన్సెలింగ్‌కు ముందే బదిలీ చేస్తారు. ఒకవేళ సబ్జెక్టు టీచర్ లేని పరిస్థితిలో ఫలితాలు తగ్గితే మాత్రం సదరు హెచ్‌ఎంకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
ా హేతుబద్ధీకరణ ద్వారా సర్‌ప్లస్‌గా గుర్తించిన వారు దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. ఈ బదిలీలన్నీ ఆయా మేనేజ్‌మెంట్ల పరిధిలోనే ఉంటాయి.