డీఈవోలపై పాఠశాల విద్యా డెరైక్టర్ ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా కార్యక్రమాలను పక్కాగా చేపట్టడం లేదని, జిల్లాల్లో డీఈవోలు సరిగ్గా పని చేయడం లేదని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పరిస్థితులు, బోధన, విద్యాప్రమాణాలపై ఇటీవల తనిఖీ బృందా లు అధ్యయనం చేపట్టాయి. ఈ క్రమంలో జిల్లాలకు వెళ్లినపుడు వరంగల్ డీఈవో బృందాలకు సహకరించలేని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సహ పాఠ్య కార్యక్రమాల కోసం రూపొందించిన పుస్తకాలను పంపిణీ చేయకుండా అలాగే కార్యాలయం లో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవోలు సరిగా పనిచేయడం లేదని, యూజ్‌లెస్‌గా తయారయ్యారని అన్నట్లు తెలిసింది.
ప్రైవేటు పాఠశాలలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఓవైపు నోటీసులిస్తూనే... మరోవైపు కవర్లు తెచ్చుకోవడానికి అలవాటు పడ్డారని పేర్కొన్నట్లు సమాచారం. అమ్యామ్యాలపై కాకుండా విద్యా ప్రమాణాలపై దృష్టి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో డీఈవో కార్యాలయాల విభజన, క్షేత్ర స్థాయి తనిఖీలపై మంగళవారం డెరైక్టర్ కిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, మహబూబ్‌నగర్ డీఈవోల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే డీఈవోలందరి వ్యవహారంపై మండిపడ్డారు. కొత్త జిల్లాల్లో డీఈవోలుగా పని చేయాల్సిన వారికి ఈనెల 10వ తేదీ సాయంత్రం పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని, 11వ తేదీ నుంచి కొత్త కార్యాలయాల్లో విధులను నిర్వర్తించాలని సూచించారు. మొదటి రోజు ఆరేడు పనులను చేయాలని, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సూచించారు.
యూజ్‌లెస్‌గా తయారయ్యారు
Published Wed, Oct 5 2016 2:25 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM
Advertisement
Advertisement