1 నుంచి డిపార్చర్ కార్డ్స్ విధానం రద్దు
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే భారతీయులకు వచ్చే నెల నుంచి విమానాశ్రయాల వద్ద ప్రయాణానికి ముందు ‘డిపార్చర్ కార్డ్స్’ పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే రైలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవారు మాత్రం ఈ ప్రయాణ పత్రాల్ని పూర్తి చేయాలని ఒక ఉత్తర్వులో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణానికి ముందు పేరు, జన్మదినం, పాస్పోర్ట్ నెంబరు, చిరునామా, విమానం నెంబర్, ప్రయాణ తేదీ తదితర వివరాలు డిపార్చర్ కార్డ్లో పూరించాలి.