1 నుంచి డిపార్చర్‌ కార్డ్స్‌ విధానం రద్దు | No departure card requirement for Indians flying abroad from 1 July | Sakshi
Sakshi News home page

1 నుంచి డిపార్చర్‌ కార్డ్స్‌ విధానం రద్దు

Published Tue, Jun 20 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

1 నుంచి డిపార్చర్‌ కార్డ్స్‌ విధానం రద్దు

1 నుంచి డిపార్చర్‌ కార్డ్స్‌ విధానం రద్దు

న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే భారతీయులకు వచ్చే నెల నుంచి విమానాశ్రయాల వద్ద ప్రయాణానికి ముందు ‘డిపార్చర్‌ కార్డ్స్‌’ పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే రైలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవారు మాత్రం ఈ ప్రయాణ పత్రాల్ని పూర్తి చేయాలని ఒక ఉత్తర్వులో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణానికి ముందు పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్‌ నెంబరు, చిరునామా, విమానం నెంబర్, ప్రయాణ తేదీ తదితర వివరాలు డిపార్చర్‌ కార్డ్‌లో పూరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement